‘రాధేశ్యామ్’‌ మరో రొమాంటిక్‌ లుక్‌, ఫ్యాన్స్‌ ఫిదా | Prabhas Releases Radhe Shyam New Poster With Pooja Hegde On Maha Shivaratri | Sakshi
Sakshi News home page

‘రాధేశ్యామ్’‌ మరో రొమాంటిక్‌ లుక్‌, ఫ్యాన్స్‌ ఫిదా

Published Thu, Mar 11 2021 5:45 PM | Last Updated on Thu, Mar 11 2021 6:11 PM

Prabhas Releases Radhe Shyam New Poster With Pooja Hegde On Maha Shivaratri - Sakshi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధే శ్యామ్’. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామ నేపథ్యంలో దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ రోమాంటిక్‌ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. కాగా ఇప్పటికే మూవీ నుంచి ప్రభాస్‌-పూజలకు సంబంధించిన పలు రోమాంటి సన్నివేశాలకు సంబంధించిన పోస్టర్లను చిత్ర యూనిటి విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. వీటికి ప్రేక్షకులను నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా హీరో ప్రభాస్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఈ మూవీ నుంచి మరో పోస్టర్‌ను విడుదల చేశాడు‌.   

ఈ పోస్టర్‌ ప్రభాస్‌, పూజ హెగ్డెలు మంచులో పడుకుని  ప్రేమమైకంలో తెలుతున్నట్లుగా కనిపిస్తున్నారు. ప్రభాస్‌ షేర్‌ చేసిన ఈ రోమాంటిక్‌ లుక్‌ అందరిని తఆకట్టుకుంటోంది. ‘కొందరు దీనిని పిచ్చి అంటారు.. మేం మాత్రం ప్రేమ అంటాం.. ఈ ప్రేమకథ మీ హృదయాలలో ఎప్పటికీ నిక్షిప్తమై ఉంటుంది‘ చిత్ర యూనిటి ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది.  కాగా రాధేశ్యామ్‌లో ప్రభాస్‌ సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఓ రొమాంటిక్ పాత్రలో ప్రభాస్ అభిమానులను ఆకట్టుకోనున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న రాధేశ్యామ్‌ పలు భాషల్లో జులై 30న విడుదల కానుంది.

చదవండి: 
ప్రేమ కోసం చచ్చే టైప్‌ కాదంటున్న ప్రభాస్‌ 
రాధేశ్యామ్‌ : ప్రభాస్ కాస్ట్యూమ్స్‌ కోసం 6కోట్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement