రాధేశ్యామ్‌ స్టోరీలైన్ తెలిసిపోయింది! | Radhesyam Story Is Clash Between Astrology and Science Says Sachin Kedekar | Sakshi
Sakshi News home page

రాధేశ్యామ్‌ స్టోరీలైన్ తెలిసిపోయింది!

Published Tue, Oct 27 2020 1:04 PM | Last Updated on Tue, Oct 27 2020 2:07 PM

Radhesyam Story Is Clash Between Astrology and Science Says Sachin Kedekar - Sakshi

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తదుపరి సినిమా రాధేశ్యామ్‌. బాహుబలి తరువాత ప్రభాస్‌ తీస్తున్న సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. వరుస విడుదలవుతున్న రాధేశ్యామ్‌ మోషన్‌ పోస్టర్లు, ఫోటోలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇప్పటికే డార్లింగ్‌ ఈ సినిమాలో తన లుక్‌తో అందరిని కట్టిపడేశాడు. ఇక డార్లింగ్‌ సరసన మన బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజ కూడా తన అందంతో అందరిని మరోసారి ఆకట్టుకుంది.

అసలు ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందని చాలా మంది అభిమానులు ఆలోచిస్తున్నారు. ఈ కథ జ్యోతిష్యానికి, సైన్స్‌కు మధ్య జరిగే కన్సెప్ట్‌తో తెరకెక్కుతుందని సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సచిన్ కేడ్కర్ తెలిపారు. ఈ సినిమాలో తాను ఒక డాక్టర్‌ పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. ప్రభాస్‌ భవిష్యత్తు పట్ల చాలా స్పష్టమైన ఆలోచనలు ఉన్న ఒక వ్యక్తిగా ఈ సినిమాలో కనిపించనన్నుట్లు సచిన్‌ కేడ్కర్‌ తెలిపారు. ఇక ఈ సినిమాను డైరెక్టర్‌ రాధాకృష్ణ కుమార్‌ ఎలా తెరపై  చూపించనున్నారో సినిమా విడుదలైన తరువాత తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. 

చదవండి: ‘రాధేశ్యామ్‌’ విషాదమా.. అమర ప్రేమ కావ్యమా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement