
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కోవిడ్ బ్రేక్ తర్వాత విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న భారీ తెలుగు చిత్రమిదే. 1970ల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఆల్రెడీ ప్రభాస్ అండ్ టీమ్ షూటింగ్ మొదలెట్టారు. తాజాగా పూజా హెగ్డే కూడా ఇటలీకి హాయ్ చెప్పారు. ఈ చిత్రం షూటింగ్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ సినిమాలో పూజా హెగ్డే ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. ప్రభాస్, పూజా కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని దర్శకుడు ఇటీవలే పేర్కొన్నారు. భాగ్యశ్రీ, కృష్ణంరాజు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment