ఆన్‌లైన్ లవ్.. ప్రేమలో కొన్నాళ్లుగా ఇదో ట్రెండ్.. వీటిపై వ్యతిరేకత ఉన్నా.. ఇక్కడే కలిసి.. ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్న వాళ్లూ ఉన్నారు. పైగా.. ఈ ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ జోరు రోజురోజుకూ పెరుగుతోందని ‘స్టాటిస్టా డిజిటల్ మార్కెట్ ఔట్‌లుక్’ పేర్కొంది. 2021 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా కనీసం 37 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్ వీటికి ఉండబోతున్నారని తెలిపింది. అంతేకాదు.. పెయిడ్, ఫ్రీ అకౌంట్ల ద్వారా వీటి ఆదాయం రూ. 24 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఈ యాప్స్ ఉపయోగిస్తున్నవారిలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. తర్వాత ఐరోపా దేశాలు ఉన్నాయి. చైనా, భారత్‌లాంటి దేశాల్లో ఉపయోగిస్తున్నవారి శాతం ప్రకారం తక్కువగానే ఉన్నా.. ఇక్కడున్న జనాభా దృష్ట్యా ఈ యాప్స్ రెవెన్యూ ఐరోపా దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఆన్‌లైన్ లవ్ జాతకం ఈ ఏడాది చివరి నాటికి ఎలా ఉండబోతోందో ఓసారి చూసేద్దామా.. ఈ ఏడాది చివరి నాటికి ఆయా దేశాల జనాభాలో డేటింగ్ యాప్స్‌ని వాడేవారి శాతం, ఆదాయం అంచనా (ఫ్రీ, పెయిడ్ యూజర్స్ కలిపి)
ఫీల్ మై లవ్.. ఆన్‌లైన్ లవ్ జాతకం
Published Sun, Feb 14 2021 8:19 AM | Last Updated on Sun, Feb 14 2021 1:41 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment