ఫిబ్రవరి 14.. వాలంటైన్ డే. ప్రేమికుల దినోత్సవంగా చెప్పుకునే ఈ రోజున ప్రియమైన వారికి తమ మనసులోని ప్రేమను, భావాలను వివిధ మార్గాల ద్వారా తెలియజేస్తూ ఆకట్టుకుంటుంటారు. అయితే ఈ వాలంటైన్ డే రోజున మనం రోజూ వాడే వాట్సాప్ ద్వారా మీ మనసులోని భావాలను మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇందు కోసం వాట్సాప్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయో తెలుసుకోండి...
డిజిటల్ అవతార్స్: వాట్సాప్‌లో డిజిటల్ అవతార్స్‌ను మీకు నచ్చినట్టుగా క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉంది. వీటిని మీ అభిరుచిగా తగినట్టుగా మీ వ్యక్తిత్వాన్ని, మనసును తెలియజేసేలా రూపొందించి మీ ప్రియమైనవారితో సంభాషణల్లో ఉపయోగించండి.
పిన్‌చాట్: ఈ పిన్‌చాట్ ఫీచర్‌తో మీ ఫేవరెట్ సంభాషణలను ఇన్‌స్టంట్‌గా పిన్ చేసి పెట్టుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫేవరెట్ చాట్‌ను హోల్డ్ చేసి పట్టుకుంటే పిన్‌చాట్ ట్యాబ్ క్రియేట్ అవుతుంది. అదే ఐఫోన్ యూజర్లు అయితే చాట్‌ను కుడివైపునకు స్వైప్ చేసే పిన్ ఆప్షన్ వస్తుంది.
ఎమోజీలు: అవతలివారు పంపించే సందేశాలకు ప్రతిస్పందించడానికి ఎమోజీలకు మించిన సులువైన మార్గం లేదు. ఎమోజీలంటే కేవలం థంబ్సప్ వంటి చిహ్నాలే కాదు. అర్థవంతమైన ఎమోజీలను పంపి ఎదుటివారి మనసును ఇట్టే ఆకట్టుకోవచ్చు.
స్టేటస్ అప్‌డేట్లు: వాట్సాప్ స్టేటస్ గురించి మనందరికీ తెలుసు. అయితే కాస్త విభిన్నంగా ఆలోచిస్తే మీ మనసు ఎదుటివారికి అర్థమయ్యేలా వీడియోలు, సౌండ్లు, టెక్ట్స్, జిఫ్స్ ద్వారా తెలియజేయచ్చు. ఇవి 24 గంటలపాటు అలాగే ఉంటాయి.
వాయిస్ మెసేజ్‌లు: ఎదుటివారిలో సంభాషణల్లో వాయిస్ మెసేజ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. మీలోని భావాలను మీకు అత్యంత ప్రియమైనవారికి స్వయంగా మీ స్వరంతోనే వినిపించండి. వారిని ఇవి కచ్చికంగా ఆకట్టుకుంటాయి.
కస్టమ్ నోటిఫికేషన్స్: ఇది చాలా ఆసక్తికర ఆప్షన్. ప్రియమైన వారి దగ్గర నుంచి కాల్స్ లేదా సందేశాల కోసం ఎదురు చూసేవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వారి కాంటాక్ట్ ఇన్‌ఫోపై క్లిక్ చేసి ప్రత్యేకమైన అలర్ట్ టోన్‌ను సెట్ చేసుకోవచ్చు.
లైవ్ లొకేషన్: ప్రియమైన వారి భద్రత, ఒకరి పట్ల మరొకరికి ఉన్న బాధ్యతను ఈ ఆప్షన్ తెలియజేస్తుంది. తెలియని ప్రదేశంలో ఉన్నప్పుడు దీని సాయంతో ఒకరినొకరు కలుసుకోవచ్చు.
పోల్స్: ఈ ప్రత్యేకమైన రోజున మీ ప్రియమైన వారికి ఎలాంటి బహుమతులు ఇస్తే బాగుంటుందో తెలియక తికమకపడుతుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ వాట్సాప్ పోల్ ఫీచర్‌ను మీరు ఉపయోగించుకుని మీ స్నేహితుల సలహాలు కోరవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment