నేడు ఫిబ్రవరి 14.. ఒకవైపు వసంత పంచమి. మరోవైపు ప్రేమికుల రోజు. ఉత్తరప్రదేశ్‌లో వాలెంట్సైన్స్ డే సందర్భంగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పతంగులను ఎగురవేయడం ద్వారా తమ ప్రేమను చాటుతున్నామని యూపీలోని మీరఠ్‌కు చెందిన యువత చెబుతోంది. యువతీ యువకులు తాము గాలిపటం ఎగురవేసినప్పుడు దాని దారం తెగితే.. అది నేరుగా వారి జీవిత భాగస్వాముల దగ్గరికి చేరుతుందని అంటుంటారు.
మీరఠ్‌లో వాలెంటైన్స్‌డే సందర్భంగా ఆకాశమంతా గాలిపటాలతో నిండిపోయింది. ఈసారి ప్రత్యేకమైన గాలిపటాలు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా గుండె ఆకారంలోని గాలిపటాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. కొన్ని గాలిపటాలలో అబ్బాయి, అమ్మాయిల రూపురేఖలు చిత్రీకరించారు. వాటి మధ్యలో హృదయాకారాన్ని తీర్చిదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment