
సాధారణ రోజుల్లో ప్రేమను ఇచ్చిపుచ్చుకునే లవ్ బర్డ్స్ వాలంటైన్స్‌డే రోజు మాత్రం గిఫ్టులు ఇచ్చుకుంటారు. లేదంటే కలిసి కాలక్షేపం చేస్తూ ఆ రోజును జీవితంలో మధుర సంతకంలా మార్చుకుంటారు. ప్రేమ లేఖలు, పుష్పగుచ్ఛాలు, టెడ్డీబేర్‌లు, చాక్లెట్లు, విలువైన బహుమతులు, హాలీడే ట్రిప్పులు.. ఇలా ప్రేమను కురిపిస్తూ రోజంతా మైమరచిపోయేందుకు ఎన్నెన్నో చేస్తారు. ప్రేమికుల రోజును పురస్కరించుకుని కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార తన ప్రియుడిని సర్‌ప్రైజ్ చేసింది.
అర్ధరాత్రి ప్రియుడు విఘ్నేశ్ శివన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి అతడిని ప్రేమ కౌగిలిలో బంధించింది. ఈ సర్‌ప్రైజ్‌కు ముగ్ధుడైన విఘ్నేశ్ ప్రియురాలి నుదుటిపై ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటూ ఆమెపై ప్రేమను కురిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మరో పోస్ట్‌లో విఘ్నేశ్ శివన్.. 'ప్రియమైన అందరికీ హ్యాపీ వాలంటైన్స్ డే. జీవితాన్ని పరిపూర్ణం చేసేది ప్రేమ మాత్రమే! కాబట్టి ప్రేమించడానికైనా, ప్రేమను ఆస్వాదించడానికైనా టైం తీసుకోండి. ఆసక్తి చూపించండి' అని పేర్కొంటూ నయనతారతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment