చెర్రి, నేను ఎప్పుడు గొడవ పడుతుంటాం: ఉపాసన | Upasana Said She And Ram Charan Always Fight and Argue Each Other | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ వాలంటైన్‌కు చెర్రి ఆ కానుక ఇచ్చాడు: ఉపాసన

Published Mon, Feb 15 2021 4:23 PM | Last Updated on Mon, Feb 15 2021 4:37 PM

Upasana Said She And Ram Charan Always Fight and Argue Each Other - Sakshi

చిన్ననాటి స్నేహితులైన మెగా కపుల్‌ రామ్‌ చరణ్‌-ఉపాసనలు 2012లో వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. టాలీవుడ్‌లో క్యూట్‌ కపుల్‌గా పేరొందిన ఈ జంట వైవాహిక బంధానికి ఎనిమిదేళ్లు గడిచాయి. అపోలా ఫార్మసీ చైర్మన్‌గా తన వ్యాపార విషయాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఉపాసన వాలంటైన్స్‌ డే సందర్భంగా ఓ ఇంటర్య్వూలో ముచ్చటించారు. ఈ సందర్భంగా చెర్రితో తన వైవాహిక బంధం గురించి మాట్లాడుతూ.. ‘భార్యాభర్తలు అన్నాక చిన్న గొడవలు, వాదనలు రావడం సర్వసాధారణం. అలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటేనే వారి బంధం మరింత బలపడుతుంది.  అందరు భార్యాభర్తల మాదిరిగానే మా మధ్య కూడా విభేదాలు, గొడవలు వస్తుంటాయి. నేను, చరణ్‌ అప్పుడప్పుడు గొడవలు పడుతుంటాం. మా మధ్య ఇలాంటి ఎన్నో అపురూపమైన జ్ఞాపకాలు ఉన్నాయి’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

అయితే తమ మధ్య వచ్చే గొడవలను, సమస్యలను ఇద్దరం కలిసి పరిష్కరించుకుంటామని చెప్పారు. ఇక ఈ వాలండైన్స్‌డేకు చెర్రి ఇచ్చిన అత్యంత విలువైన బహుహతి ఏంటని అడగ్గా.. ‘ఖరీదైన బహుమతుల కంటే కూడా అత్యంత విలువైన మధుర జ్ఞాపకాలను చరణ్‌ నాకు ఇచ్చాడు. వాటిని ఎప్పటికి మరచిపోలేను. అవే నాకు అత్యంత ఖరీదైన బహుహతులు. అయితే మా పెళ్లి జరిగిన తర్వాత వచ్చిన మొదటి వాలంటైన్స్ డే సందర్భంగా చరణ్ నాకు అపురూపమైన కానుక ఇచ్చాడు. హార్ట్ షేప్‌తో, ఎరుపు రంగు రాళ్లతో పొదిగిన డైమండ్‌ చెవి రింగులను ప్రత్యేకంగా తయారు చేయించి సర్‌ప్రైజ్‌  ఇచ్చాడు. అవి నాకు చాలా ప్రత్యేకమైనవి. వాటిని రోజు ధరిస్తాను’ అంటూ చెప్పారు.  

(చదవండి: శంకర్‌‌-చరణ్‌ల మూవీపై మెగా అప్‌డేట్‌)
          ఆర్‌ఆర్‌ఆర్‌: యుద్ధానికి మధ్యలో నవ్వులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement