జమ్మూ కశ్మీర్: దేశం కోసం సేవ చేసే ప్రతి సైనికుడు తమకు కుటుంబ సభ్యుడు అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీలో పర్యటించారు. ఉగ్రవాద దాడుల్లో రెండు ఆర్మీ వాహనాల్లో ఉన్న నలుగురు సైనికులు మృత్యువాతపడ్డ పరిస్థితులను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన జమ్మూ కశ్మీర్‌లోని భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు, సైనికులతో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు.
సరిహద్దుల్లో దేశ కోసం పోరాడే ప్రతి సైనికుడిని తమ కుటుంబ సభ్యుడిగా ప్రతి భారతీయుడు భావించాలని అన్నారు. భద్రత, ఇంటలీజెన్స్ విభాగాలు ఉగ్రదాడులను నిలువరించడానికి కృషి చేస్తాయని తెలిపారు. సైనికులకు ఈ విషయంలో ఎటువంటి నిఘా వ్యవస్థ అవసరం పడినా ప్రభుత్వం నుంచి అందిస్తామని పేర్కొన్నారు. భద్రతా బలగాలకు సౌకర్యాలు అందించడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు.
ఈ దాడులను ఎట్టి పరిస్థితుల్లో తేలికగా తీసుకోవద్దని మంత్రి సూచించారు. ‘మీరు(సైనికులు) అప్రమత్తంగా ఉన్నారని తెలుసు. కానీ ఇంకా ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలి. మీ ధైర్యసాహసాలు మాకు గర్వకారణం. మీ త్యాగాలను ఎవరూ పూడ్చలేరు. దేశ సరిహద్దుల్లో వెలకట్టలేని సేవ చేస్తున్నారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం సంక్షేమం, భద్రత పరంగా అండగా ఉంటుంది’ అని రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment