
లక్నో : భాగ్‌పత్‌లోని ఓ హోటల్ సిబ్బంది ఇద్దరు జవాన్లపై కర్రలతో దాడికి దిగింది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జవాన్లను తీవ్ర పదజాలంతో దూషిస్తూ.. కర్రలతో దాడి చేసిన ఈ ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌చేశారు. వివరాలు.. రెస్టారెంట్‌లో పని చేస్తున్న వ్యక్తులకు జవాన్లకు మధ్య వాగ్వాదం జరుగుతుండగా.. ఇంతలో ఒక్కసారిగా ఇరు వర్గాలు కొట్టుకోవడం ప్రారంభించాయి. అయితే జవాన్లు ఇద్దరే ఉండడంతో ప్రత్యర్థి గుంపు దాడిని నిలువరించలేకపోయారు. దీంతో అవతలి బృందం కర్రలు, రాడ్లతో జవాన్లు ఇద్దరినీ చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. హోటల్ సిబ్బందికి చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఇద్దరు జవాన్లపై హోటల్ సిబ్బంది కర్రలతో దాడి
Comments
Please login to add a commentAdd a comment