
Russian Soldiers Killed in Ukraine War: ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఇప్పటిదాకా ఏకంగా 9,861 మంది రష్యా సైనికులు మరణించారని రష్యాకు చెందిన ఓ ప్రముఖ వార్తా పత్రిక పేర్కొంది. 16 వేలకు పైగా తీవ్రంగా గాయపడ్డారని రష్యా రక్షణ శాఖ వర్గాలనే ఉటంకిస్తూ చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా హాకర్ల పని అని చెప్తూ ఈ కథనాన్ని కాసేపటికే వెబ్‌సైట్ నుంచి తొలగించింది. దీనిపై స్పందించేందుకు అధ్యక్ష భవన అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment