న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) తమ 1.62 లక్షల మంది సైనికులకు సోషల్ మీడియా వాడకంపై మార్గదర్శకాలను ఇచ్చింది. అంతేగాక సైనికులు వాడుతున్న ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటి యూజర్ ఐడీలు వెల్లడించాలని కోరింది. ఆన్‌లైన్ ప్రపంచంలో ఉన్న ప్రమాదాల రీత్యా, భారత్ పై ఇతర దేశాల నుంచి ఉన్న ముప్పు రీత్యా ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
దేశంలోని 63 విమానాశ్రయాల్లో సీఐఎస్‌ఎఫ్ జవాన్లు సేవలందిస్తున్నారు. వాటితో పాటు కొన్ని ఏరోస్పేస్, న్యూక్లియర్ డొమన్ తో పాటు పలు మంత్రిత్వ శాఖల భవనాల వద్ద వీరు పనిచేస్తున్నారు. సైనికులు ఉపయోగిస్తున్న ఐడీల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా పోస్టులు వస్తున్నాయేమో గమనించనున్నారు. తప్పుడు ఐడీలు సమర్పించడంగానీ, కొత్త ఐడీలు క్రియేట్ చేయడంగానీ చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment