దేశ రక్షణలో భాగంగా జమ్ముకాశ్మీర్‌లో పహారా కాస్తున్న తెలుగు జవాను మృతి చెందారు.
దత్తిరాజేరు(విజయనగరం): దేశ రక్షణలో భాగంగా జమ్ముకాశ్మీర్‌లో పహారా కాస్తున్న ఉత్తరాంధ్రకు చెందిన ఆర్మీ జవాన్ మంచు చరియలు విరిగిపడి మృతిచెందాడు.
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడాం గ్రామానికి చెందిన మామిడి నాగరాజు(25) ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్నాడు. ఈక్రమంలో జమ్ము కాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తుండగా.. మంచు కొండ చరియలు విరిగిపడటంతో.. మృతిచెందాడని ఉన్నతాధికారులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. నాగరాజుకు ఏడాది క్రితమే సమీప బంధువు అనూషతో వివాహం జరిగింది. రాజు మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.