
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో సైకో సైనికుడిని ఆర్మీ మట్టుపెట్టింది. విచక్షణారహితంగా కాల్పులు జరిపి 20 మందిని పొట్టనబెట్టుకున్న సర్జంట్ మేజర్ జక్రపంత్ తొమ్మాను ఆదివారం ఉదయం సైనికులు కాల్చి చంపారు. థాయిలాండ్‌లోని నఖోన్ రట్చసిమా నగరంలో శనివారం మధ్యాహ్నం జక్రపంత్ తొమ్మా విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే.
సైనిక స్థావరం నుంచి ఒక సైనిక వాహనాన్ని దొంగిలించిన జక్రపంత్ తొమ్మా నగరం నడిబొడ్డుకు దాన్ని నడుపుకుంటూ వెళ్లాడు. అక్కడి టెర్మినల్ 21మాల్‌లో ప్రవేశించి మెషీన్ గన్‌తో అక్కడ ఉన్నవారిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 20 మంది ప్రాణాలు కోల్పోగా 14 మంది గాయాలపాలయ్యారు. అనంతరం మాల్‌లో పలువురిని నిర్భందించాడు. షాపింగ్ మాల్‌ను తమ దిగ్భందంలోకి తీసుకున్న సైనికులు, కొన్ని గంటల పోరాటం తర్వాత ఉన్మాదిని హతమార్చారు.
చదవండి : థాయిలాండ్‌లో సైనికుడి కాల్పులు
Comments
Please login to add a commentAdd a comment