మళ్లీ బరితెగించిన పాకిస్థాన్
శ్రీనగర్: పాకిస్థాన్ మళ్లీ బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దుల్లో భారత సైనిక శిబిరాలపై కాల్పులకు దిగింది. సోమవారం జమ్ము కశ్మీర్లోని రాజౌరీ సెక్టార్లో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో భారత జవాన్ ఒకరు మరణించగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. బాధిత మహిళను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
పాక్ వరుసగా చేస్తున్న దాడులను భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. ఇటీవల భారత భద్రత దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో భారీ సంఖ్యలో పాక్ రేంజర్లు చనిపోయారు. అయినా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.