మళ్లీ కాల్పులుభారత్ జవాను, ఒక మహిళ మృతి
పూంచ్ (జమ్మూ): నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద పాకిస్తాన్ బరితెగిస్తూనే ఉంది. సోమవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్, రాజౌరీ జిల్లాల్లోని భారత శిబిరాలు, గ్రామాలే లక్ష్యంగా మోర్టార్లు, తుపాకులతో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. బిమల్ తమంగ్ (20) అనే భారత జవాను, బాలాకోట్ సెక్టార్ గౌలాద్ గ్రామ మహిళ రషీదాబీ(60) మృతిచెందారు. మరో ఇద్దరు జవానులు, ఒక బాలిక గాయపడ్డారు. పాక్ కాల్పులను గట్టిగా తిప్పికొట్టామని భారత ఆర్మీ తెలిపింది. సోమవారం ఉదయం 9 నుంచి బాలాకోట్ సెక్టార్‌లో పాక్ బలగాలు కాల్పులు ప్రారంభించాయని, మెంథార్ సెక్టార్‌లో మధ్యాహ్నం కాల్పులు జరిగాయని చెప్పింది. సెప్టెంబర్ 29 సర్జికల్ దాడుల తర్వాత పాక్ 60 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది. ఈ కాల్పుల్లో మొత్తం 11 మంది చనిపోయారంది. గత రెండు రోజుల్లో పాక్ బలగాల సాయంతో సరిహద్దు వెంబడి హిరానగర్ సెక్టార్‌లో మూడుసార్లు ఉగ్రవాదులు చొరబాట్లకు యత్నించారని, వాటిని అడ్డుకున్నామని బీఎస్‌ఎఫ్ తెలిపింది.
స్కూళ్లు ఎవరు తగలబెడుతున్నారు? జమ్మూకశ్మీర్లో దుండగులు వరుసగా స్కూళ్లను తగులబెడుతున్న నేపథ్యంలో వాటికి రక్షణ కల్పించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. విద్యారంగానికి శత్రువులుగా మారిన గుర్తుతెలియని దుండగుల్ని కనిపెట్టి... వారిపట్ల కఠిన వైఖరి అవలంభించాలని రాష్ట్ర పోలీసు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేసింది.
బరితెగిస్తూనే ఉన్న పాక్
Published Tue, Nov 1 2016 1:33 AM | Last Updated on Sat, Mar 23 2019 8:44 PM
Advertisement
Advertisement