గ్రెనేడ్లతో విమానాశ్రయానికి వచ్చిన జవాను అరెస్ట్ | ‌Grenades recovered from soldier's luggage at Srinagar airport | Sakshi
Sakshi News home page

గ్రెనేడ్లతో విమానాశ్రయానికి వచ్చిన జవాను అరెస్ట్

Published Mon, Apr 3 2017 10:49 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

‌Grenades recovered from soldier's luggage at Srinagar airport

జమ్ము కశ్మీర్‌: శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో సోమవారం ఉదయం ఓ జవాను అరెస్ట్‌ అయ్యాడు. బ్యాగులో రెండు గ్రెనేడ్లతో విమానం ఎక్కేందుకు యత్నించిన ఆర్మీ జవాను భూపాల్‌ ముఖియాను ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉరీ సెక్టార్‌లోని ఎల్‌వోసీ(నియంత్రణ రేఖ) వద్ద విధులు నిర్వర్తిస్తున్న భూపాల్‌ శ్రీనగర్‌ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు సోమవారం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. సెక్యూర్టీ చెకింగ్‌లో భాగంగా జవాను బ్యాగు చెక్‌ చేస్తుండగా.. అందులో నుంచి రెండు గ్రెనేడ్లు బయటపడ్డాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement