
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఏపీ వ్యాప్తంగా సీఐడీ తనిఖీలు చేపట్టింది. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లలోనూ సీఐడీ సోదాలు జరిపింది. కాగా, చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి ఖాతాదారుల సొమ్ము మళ్లింపు, నిబంధనల ఉల్లంఘనలపై ఆరోపణల నేపథ్యంలో సీఐడీ అధికారులు శనివారం ఉదయం నుంచి తనిఖీలు నిర్వహించారు. విజయవాడ మార్గదర్శి మెయిన్ బ్రాంచ్‌లో మేనేజర్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని సీఐడీ అధికారులు విచారించారు.
ఇక, గతంలోనూ సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, నిధుల మళ్లింపుపై సీఐడీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సీఐడీకి అందిన ఫిర్యాదు మేరకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment