Villege
-
మహిళ సజీవ దహనం.. మంత్రాల నెపంతో గ్రామస్తుల దాడి
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో దారుణం జరిగింది. మంత్రాలు చేస్తుందనే నెపంతో డేగల ముత్తవ్వ అనే మహిళపై ఆ ఊరి గ్రామస్తులు దాడి చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. గ్రామస్తులు దాడితో ఆమె కొడుకు,కోడలు పారిపోయారు.అయితే తీవ్రగాయాల పాలైన ముత్తవ్వను ఆమె బంధువులు వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ముగ్గురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఇది పరిస్థితి..
-
ఆకస్మికంగా వచ్చి.. ఆవేదన తెలుసుకుని
వంగర: శనివారం రాత్రి 9.20 గంటలు. ఎం.సీతారాంపురం నిశ్శబ్దంగా ఉంది. ప్రజలంతా నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో గ్రామంలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. కాన్వాయ్ వచ్చి ఆగడంతో ఏమై ఉంటుందోనని అంతా గుమిగూడడం మొదలుపెట్టారు. అంతలో కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ కారు దిగడంతో అంతా ఆశ్చర్యపోయారు. జిల్లా కేంద్రంలో రాత్రి పొద్దుపోయే వరకు వరుస సమావేశాలతో బిజీగా గడిపిన కలెక్టర్ పల్లె నిద్ర చేయాలని నిర్ణయించుకుని అప్పటికప్పుడు ఎం. సీతారాంపురం గ్రామాన్ని ఎంచుకున్నారు. అనుకున్నదే తడవుగా శ్రీకాకుళం నుంచి గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహానికి వచ్చారు. తహసీల్దార్ డి.ఐజాక్ అప్పటికప్పుడు చేరుకుని కలెక్టర్ ను స్వాగతించారు. సమాచారం అందుకున్న మండల ప్రత్యేకాధికారి డాక్టర్ బొత్స జయ ప్రకాష్, ఎంపీడీఓ డొంక త్రినాథ్, డీఎస్పీ శ్రావణి కూడా అక్కడకు చేరుకున్నారు. కలెక్టర్ రాకను తెలుసుకు న్న కొందరు అధికారులు శ్రీకాకుళం, రాజాం, పా లకొండ నుంచి వాహనాలపై హడావుడిగా ఎం. సీతారాంపురం చేరుకున్నారు. అనంతరం స్థానిక సర్పంచ్ కళావతి ఆధ్వర్యంలో స్థానికులు వచ్చి కలెక్టర్‌కు సమస్యలు ఏకరువు పెట్టారు. ►ప్రధానంగా తాగునీరు, సాగునీరు సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. స్థానికుల ఆవేద న చూసి కలెక్టర్ చలించిపోయారు. తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ►సచివాలయ వ్యవస్థ, ఉద్యోగుల సేవలపై ఆరా తీయగా.. కొందరు సమయపాలన పాటించడం లేదని, ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వడం లేదని బదులిచ్చారు. ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించగా.. అన్నీ బాగున్నాయన్నారు. వైద్య సిబ్బంది సేవలపై కూడా జనం సంతృప్తి వ్యక్తం చేశారు. ►వైఎస్సార్ సీపీ నాయకులు ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ, కిమిడి ఉమామహేశ్వరరావు తోటపల్లి కుడి ప్రధాన కాలువలో జంగిల్ క్లియరెన్స్ చేయాలని కోరగా.. నిధులు మంజూరు చేస్తానని కలెక్టర్ చెప్పారు. కిమ్మి–రుషింగి వంతెన పనులు పూర్తి చేయాలన్నారు. ► వంగరలో సచివాలయ నిర్మాణానికి స్థలం మంజూరు చేయాలని సర్పంచ్ ప్రతినిధి కనగల పారినాయుడు కోరారు. ఎం.సీతారాంపురానికి ఆధార్ కేంద్రం మంజూరు చేయాలని స్థానికులు కోరా రు. అనంతరం అక్కడే రాత్రి భోజనం చేశారు. బొత్స ప్రవీణ్‌కుమార్ అనే సచివాలయ ఉద్యోగి తన ఇంటి నుంచి సామగ్రిని తీసుకువచ్చి కలెక్టర్ నిద్రకు హాస్టల్లోని ఓ గదిని సిద్ధం చేశారు.11 గంటలకు ఆయన నిద్రకు ఉపక్రమించారు. గ్రామస్తులతో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ నిద్రకు ఉపక్రమిస్తున్న కలెక్టర్ -
కరోనా వేళ ఉచితంగా పాఠాలు.. ఇంటినే బడిగా మార్చి..
సాక్షి, చింతలమానెపల్లి(కరీంనగర్): అన్నిదానాల్లోకెళ్లా విద్యాదానం గొప్పది అంటారు.. జ్ఞానం సంపాదించడమే కాదు.. జ్ఞానం పంచాలి అనేది పెద్దల మాట. ఈ మాటలు నిజం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు చింతలమానెపల్లి మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన తూమోజు వెంకటేశ్. కరోనా కారణంగా విద్యార్థులు చదువులో వెనకబడకుండా ఉచితంగా విద్యనేర్పుతూ అందరి చేత ప్రశంసలు పొందుతున్నాడు. ఇంజినీరింగ్ చదువుకుని.. ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన వెంకటేష్‌కు ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. దీనికి తోడు అనారోగ్యానికి గురికావడంతో 2019లో స్వగ్రామానికి తిరిగి వచ్చి పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. ఇంటినే బడిగా మార్చి.. 2020లో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో పాఠశాలలు మూతబడ్డాయి. ఈ క్రమంలో విద్యార్థులు చదువుకోవడం మానేసి వీధుల్లో తిరుగుతుండడం గమనించాడు. గ్రామానికి చెందిన పలువురు యువకుల సహకారంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాడు. గ్రామంలో కరోనా కేసులు నమోదు కాకపోవడంతో విద్యార్థులకు స్థానిక పాఠశాలలో చదువు చెప్పేందుకు సిద్ధమయ్యాడు. సుమారు 80మంది విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధించాడు. సొంతఖర్చులతో పరీక్ష పత్రాలు, బోధనా సామగ్రిని కొనుగోలు చేశాడు. పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తూ.. ఈ ఏడాదిసైతం కరోనా వ్యాప్తి చెందడంతో ప్రభుత్వం తిరిగి లాక్డౌన్ విధించింది. వేసవి సెలవుల కారణంగా పాఠశాలలు మూసివేశారు. 5, ఆపై తరగతుల విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో చేరేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులకు గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష వివరాలు తెలియజేసి తాను ఉచితంగా బోధిస్తానన్నాడు. నెల రోజులుగా విద్యార్థులకు గురుకుల సిలబస్‌ను బోధించడంతో పాటు మోడల్ పరీక్షలు సైతం నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం 13 మంది విద్యార్థులను గురుకుల ప్రవేశ పరీక్షకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపాడు. వీరితో పాటు గ్రామంలోని 25 మంది ఇతర విద్యార్థులకు అవసరమైన మెలకువలు, ప్రావీణ్యాన్ని మెరుగుపర్చుకునే పాఠాలు బోధిస్తున్నాడు. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో తండ్రి జనార్దన్ ఇచ్చిన స్ఫూర్తితోనే విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తున్నట్లు వెంకటేశ్ పేర్కొంటున్నాడు. జనార్దన్ గత ప్రభుత్వాలు నిర్వహించిన అనియత విద్య, యువజన విద్య లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని, తండ్రి బోధించిన పాఠాలతోనే తాను గురుకుల ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇందారం గురుకుల పాఠశాలలో చదువుకున్నట్లు చెబుతున్నాడు. రాబోయే రోజుల్లో మరింత మంది విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన చేస్తానని ఆయన వెల్లడిస్తున్నాడు. వెంకటేశ్ వద్ద విద్యాబుద్దులు నేర్చుకుంటున్న విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. రానున్న ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు విద్యార్థులు తెలుపుతున్నారు. చదవండి: లాక్డౌన్ ఉల్లంఘనులకు ‘తెలంగాణ’ గుడ్‌న్యూస్ -
జనంలేక పాడుబడ్డ ఊరు: రోజూ వచ్చి వెళ్తున్న వృద్ధుడు
చిత్తూరు: పాపాఘ్ని నది సమీపంలో ఉండే ఊరు ఒకప్పుడు జనాలతో, పంటలతో కళకళలాడేది. ఆ ఊరి పేరు పుట్టాపర్తి. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో ఉంది. కొన్నేళ్ల నుంచి నదిలో నీరులేక, బోరు బావుల్లో నీరు రాక.. పంటలు పండక ఊరు ఖాళీ అయిపోయింది. ఇక్కడ జీవించిన వారు సమీప గ్రామాలకు, బెంగళూరుకు పనుల కోసం వలస వెళ్లిపోయారు. దీంతో ఇళ్లన్నీ శిథిలమైపోయాయి. జనం లేకపోయినా ఊరి పేరు మాత్రమే రెవెన్యూ రికార్డుల్లో మిగిలిపోయింది. అయితే బక్కోళ్ల కిట్టన్న అనే 70 ఏళ్ల వృద్ధుడు మాత్రం ప్రతిరోజు ఊరికి వచ్చి వెళుతూ ఉంటాడు. పగలంతా తన వ్యవసాయ భూమిలో ఉన్న షెడ్డులో కాలక్షేపం చేసి సాయంత్రం తాను నివసిస్తున్న టి.సదుం గ్రామానికి చేరుకుంటున్నాడు. ఎందుకు వెళ్తావు ఆ ఊరికి అని అడిగితే.. చిన్న నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి అని కిట్టన్న బదులిస్తాడు. ఊరి పేరు ఎలా వచ్చిందంటే.. టి.సదుంలో ఒకప్పుడు కలరా వ్యాధి ప్రబలడంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి కొంతమంది పాపాఘ్ని నది ఒడ్డున ఉన్న ప్రాంతంలో నివసించడానికి వెళ్లారు. ఆ ఖాళీ స్థలంలో గుడిసెలు, రాతి సుద్ద మిద్దెలు కట్టుకోవడంతో అదో ఊరిగా మారింది. అక్కడ నాగుల పుట్టలు, చెదలు పుట్టలు అధికంగా ఉండటంతో ఆ ఊరికి పుట్టాపర్తిగా నామకరణం చేశారు. శివరాత్రి ఉత్సవాలు ప్రత్యేకత.. పాపాఘ్ని నది ఒడ్డున శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఏటా శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి ఉత్సవ ప్రతిమలను పుట్టాపర్తికి తీసుకెళ్లడం.. అనంతరం టి.సదుం గ్రామానికి తీసుకెళ్లడం ఆనవాయితీగా ఉండేది. కానీ ఇప్పుడు పుట్టాపర్తిలో ఎవరూ లేకపోవడంతో ఉత్సవ ప్రతిమలను నేరుగా టి.సదుంకు తీసుకెళ్లిపోతున్నారు. పాపాఘ్ని నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నపుడు కపిల్ (ఎద్దులతో తిప్పే యంత్రం) ద్వారా నీళ్లు తోడి పంటలు సాగు చేసేవారమని, పచ్చటి పొలాలతో ఊరు కళకళలాడేదని కిట్టన్న చెప్పాడు. ఏడేళ్ల వయసు వరకు ఇక్కడే.. నాకు ఏడేళ్ల వయసు వచ్చే వరకూ ఊళ్లోనే ఉన్నా. పాపాఘ్ని నది దాటి టి.సదుంలో ఉన్న పాఠశాలకు వెళ్లేవాడిని. ఒకసారి నదిలో నీటి ప్రవాహం అధికం కావడంతో ఇంటికి రాలేక పోయాను. ఇప్పుడు టి.సదుంలోనే ఉంటున్నాను. – బోడెన్నగారి ఆదెన్న నీరు తగ్గే వరకూ అక్కడే.. పాపాఘ్ని నదిలోకి నీరు వస్తే మూడు రోజుల వరకూ ప్రవాహం తగ్గేది కాదు. పని మీద బయటకు వెళ్తే అక్కడే ఉండేవాళ్లం. ఊళ్లో పండుగలు, పబ్బాలు గొప్పగా చేసుకునేవాళ్లం. పగలంతా గత అనుభవాలు గుర్తుచేసుకుంటూ ఇక్కడే కాలక్షేపం చేసి రాత్రికి టి.సదుం చేరుకుంటాను. – బక్కోళ్ల కిట్టన్న చదవండి: నా కులంపై దుష్ప్రచారం చేస్తున్నారు: పుష్ప శ్రీవాణి -
లచ్చిరాజుపేటకు అచ్చిరాని వినాయక చవితి
సాక్షి, పార్వతీపురం(విజయనగరం): వినాయకుడు ఆదిదేవుడు. వినాయకుని పూజకు ప్రతీ ఒక్కరూ ఆసక్తి చూపుతారు. భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొంటారు. వినాయకుని విగ్రహం మండపానికి తీసుకువచ్చేందుకు యువత తహతహలాడుతుంటారు. చందాలు ఎత్తుకుంటారు. మండపాన్ని రంగులతో అలంకరిస్తారు. చిన్నా పెద్దా అని తేడాలేకుండా నృత్యాలు చేస్తూ, భజనలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. అయితే... విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం లచ్చిరాజుపేట గ్రామ ప్రజలకు ఆ సంతోషం దూరమయ్యింది. గత రెండు దశాబ్దాలుగా ఆ గ్రామ ప్రజలు వినాయక చవితి ఉత్సవాలకు దూరంగా ఉంటున్నారు. వినాయక చవితి అంటేనే ఆ గ్రామ ప్రజల గుండెల్లో గుబులు రేగుతోంది. వినాయక చవితి ఏర్పాట్లు చేస్తామని ఆలోచన చేస్తేనే చాలా... ఏదో ఒక రూపంలో అశుభం జరుగుతుందన్నది గ్రామస్తుల నమ్మకం. గతంలో రెండు పర్యాయాలు వినాయక చవితి ఏర్పాట్లు చేసే సమయంలో మరిపి అచ్చియ్య(40), కోరాడ గంగవేణి(25)చనిపోయారు. దీంతో 20 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం మానేశారు. తాజాగా మరో ఘటన.. గ్రామ యువత అంతా చేయిచేయి కలిపి ఈ ఏడాది వినయాక చవితిని జరుపుకోవాలని నిశ్చయించారు. ఇందులో భాగంగా ఓ రోజు ఆలస్యంగా మంగళవారం ఉదయం గ్రామంలోని కొందరు యువత వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు పార్వతీపురం పట్టణానికి వచ్చారు. అయితే యువత వినాయక విగ్రహం కొనుగోలు చేయకముందే వారికి ఒక ఫోన్ వచ్చింది. గ్రామానికి చెందిన అంబటి నారాయణమ్మ(80) అనే వృద్ధురాలు మృతి చెందిందని గ్రామస్తులు తెలియజేశారు. దీంతో యువత విగ్రహం కొనుగోలు చేయకుండానే వెనుదిరిగారు. దీనికి పరిష్కారం ఏమిటనే విషయాన్ని గ్రామ పెద్దలు పండితులతో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. సరదాగా చేద్దామనుకున్నాం.. వినాయక చవితిని పండగలా జరుపుకోవాలనుకున్నాం. మాకు తెలిసి 20 సంవత్సరాలుగా ఈ పండగ చేయలేదు. ఎప్పుడో ఏదో జరిగిందని ఇప్పుడు కూడా అలాగే ఎందుకు జరుగుతుందని భావించాం. యువకులంతా కలసి వినాయక చవితి ఏర్పాట్లు చేసుకుందామనుకున్నాం. ఒక రోజు ఆలస్యంగా అయినా ఫరవాలేదు.. వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చి చవితి పండగను చేద్దామని భావించాం. విగ్రహం కొనుగోలు చేయడానికి నేను పార్వతీపురం వచ్చాను. ఇంతలోనే ఊరి నుంచి ఫోన్ వచ్చింది. ఊరిలో వృద్ధురాలు చనిపోయిందని. దీంతో మా లచ్చిరాజు పేటకు వినాయక చవితి అచ్చిరాదని మరోసారి రుజువైంది. – వెంకటరమణ, లచ్చిరాజు పేట -
పోటీకి చౌట్పల్లి దూరం
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు పొందిన నాయకుల ఖిల్లాగా పేరొందిన చౌట్పల్లి ఈసారి ఎన్నికల తెరపై కనుమరుగైంది. ఈ గ్రామానికి చెందిన నాయకులకు ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ నియోజకవర్గం నుంచి అవకాశం లభించకపోవడంతో పోటీకి చౌట్పల్లి దూరం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి చౌట్పల్లికి చెందిన ఎవరో ఒకరు అసెంబ్లీలో బాల్కొండ లేదా ఆర్మూర్ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ గ్రామానికి చెందిన ఇద్దరు నాయకులు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలవడంతో చౌట్పల్లికి అసెంబ్లీలో స్థానం లేకుండా పోయింది. కాగా ఈ సారి అసలే పోటీకి అవకాశం దక్కకపోవడంతో ఎంతో ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న చౌట్పల్లి తొలిసారి పోటీకి దూరమైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 1952 నుంచి పోటీ.. 1952లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆయన 1956లో నిజామాబాద్ జిల్లా పరిషత్‌కు మొట్టమొదటి చైర్మన్‌గా ఎంపికయ్యారు. 1978లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరఫున కేఆర్ గోవింద్‌రెడ్డి పోటీ చేశారు. అంతకు ముందు ఆయన భీమ్‌గల్ సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన ఏలేటి మహిపాల్ రెడ్డి కూడా భీమ్‌గల్ సమితి అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు. 1983లో ఏలేటి మహిపాల్‌రెడ్డి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1985లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మహిపాల్‌రెడ్డి ఈ ఎన్నికల్లో గెలిచి అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో మహిపాల్‌రెడ్డికి ఆర్మూర్ టిక్కెట్ దక్కలేదు. కాగా ఈ ఎన్నికల్లో బాల్కొండ కాంగ్రెస్ టిక్కెట్‌ను చౌట్పల్లికి చెందిన సురేశ్‌రెడ్డికి పార్టీ అధిష్టానం కేటాయించగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే 1994లో అన్నపూర్ణమ్మ ఆర్మూర్ ఎమ్మెల్యేగా, సురేశ్‌రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అసెంబ్లీలో రెండు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించడం సంచలనం సృష్టించింది. 1999, 2004లో వరుసగా సురేశ్‌రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు స్పీకర్‌గా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సురేశ్‌రెడ్డి పోటీ చేయగా ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున అన్నపూర్ణమ్మ పోటీ చేసి సురేశ్‌రెడ్డిపై విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో సురేశ్‌రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున, బాల్కొండ నుంచి అన్నపూర్ణమ్మ కుమారుడు డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఇద్దరు ఓటమిపాలయ్యారు. దీంతో అసెంబ్లీలో చౌట్పల్లికి చోటు లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో సురేశ్‌రెడ్డి పోటీకి ఆసక్తి కనబరిచినా ఆయన టీఆర్ఎస్లో చేరడం ఆయనకు పార్టీ అధిష్టానం మరో పదవీని ఆఫర్ చేయడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు ఈసారి దూరమయ్యారు. అలాగే మల్లికార్జున్‌రెడ్డి మహాకూటమి తరపున పోటీ చేయడానికి బాల్కొండ టిక్కెట్‌ను ఆశించారు. కానీ టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన కూడా పోటీకి దూరమయ్యారు. 1983 నుంచి చౌట్పల్లికి చెందిన వారు ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఏదో ఒక పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయగా ఈసారి తొలిసారి పోటీకి అవకాశం దక్కకపోవడంతో పోటీకి చౌట్పల్లి దూరమైందని వెల్లడవుతోంది. -
మమ్మల్ని పట్టించుకుంటేనే ఓటు
సాక్షి,మోర్తాడ్(బాల్కొండ): మాకు మద్యం, డబ్బు వద్దు మేము సూచించిన సమస్యలను పరిష్కరించడానికి తగు హమీ ఇచ్చే వారికే తమ ఓటు అంటు ప్రజలు ముందస్తు ఎన్నికల వేళ సమస్యలను అభ్యర్థుల ముందు ఉంచుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మెనిఫెస్టోలను రూపొందించి వాటిని ఓటర్ల ముందు ఉంచుతు ఆకర్షించడానికి ప్రయత్నించడం సాధారణ విషయం. అయితే ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రజలే తమ సమస్యలతో ఒక మెనిఫెస్టోను రూపొందించుకుని వాటికి సానుకూలంగా స్పందించిన వారికే ఓటు వేస్తామని స్పష్టం చేస్తుండటం గమనార్హం. బాల్కొండ నియోజకవర్గంలోని వన్నెల్(బీ), రామన్నపేట్ సంతోష్ కాలనీ ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం లభించడానికి ముందస్తు ఎన్నికలను ఒక వేదికగా ఎంచుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్సిలను ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలు ముగిసి ఏడాదిలోగా సమస్యలు పరిష్కరించేవారికి ఓటు వేస్తామని ప్రజలు వెల్లడిస్తున్నారు. కాగా రాజకీయ నాయకుల హమీలపై నమ్మకంలేని ప్రజలు రాత పూర్వకంగా హమీని కోరుతుండటం విశేషం. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు, అభ్యర్థుల మెనిఫెస్టోలకు ధీటుగా ప్రజలే ప్రత్యేక మెనిఫెస్టోలను రూపొందించి అభ్యర్థుల ముందుంచుతుండటం వల్ల అభ్యర్థులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
ఆ పల్లెలో ప్రచారం మొదలు పెడితే విజయం ఖాయం!
సాక్షి,బోధన్(నిజామాబాద్) : ఆ పల్లెలో ప్రచారం మొదలు పెడితే ఎన్నికల్లో విజయం ఖాయమని రాజకీయ నేతల నమ్మకం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మె ల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేసే రాజకీయ పార్టీల నేతలు ఆ పల్లె నుంచే ప్రచారం ప్రారంభించే పొలిటికల్ సెంటీ మెంట్ 20 ఏళ్లుగా కొనసాగుతోంది. అదే బోధన్ మండలంలోని బర్దీపూర్ గ్రామం. మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈశన్య దిశలో ఉన్నా చిన్న పల్లెటూరు.. రాజకీయ నాయకులు ప్రచారం ఈ పల్లె నుంచే మొదలు పెడితే విజయం సిద్ధిస్తుందని జ్యోతిష్క్యుల సూచనలను నియోజక వర్గ అభ్యర్థులు అనుసరిస్తున్నారు. ఈ గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆయలంలో దైవ దర్శనం చేసుకుని, పూజలు నిర్వహించి ప్రచారాన్ని మొదలు పెట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది. తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 1999 ఎన్నికల్లో బర్దీపూర్ గ్రామం నుంచి ప్రచారం మొదలు పెట్టి విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికలతో పాటు తాజాగా 2018 ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించారు. అయితే 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి ఓడిపోయారు. ఈ విషయం తెలిసి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఈ గ్రామం నుంచే ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. 2014 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ కూడా ఈ గ్రామం నుంచి ప్రచారం మొదలు పెట్టారు. పొలిటికల్ సెంటిమెంట్‌తో బర్దీపూర్ గ్రామానికి ప్రత్యేకత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్ బర్దీపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుని అబివృద్ధికి కృషి చేశారు. -
జన్మనిచ్చిన ఊరికోసం ఒక్కటైన ఉద్యోగులు
వెంకటాపురం డెవలప్మెంట్ ఫోరం’ ఏర్పాటు గ్రామాభివృద్ధికి నిర్ణయం వెంకటాపురం (దుగ్గొండి) : సమాజంలో ఉన్నత స్థానం రాగానే ఊరిని మరిచి పట్టణం బాట పట్టడం సహజం. అయితే జన్మనిచ్చిన ఊరిని మరవకుండా గ్రామాభివృద్ధి కోసం ఉద్యోగాలు పొందిన వారు, ఉన్నత స్థానాలకు చేరిన వారు, ఉన్నత చదువులు చదువుకున్న వారంతా ఒక్కటయ్యారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని తీర్మానించుకున్నారు. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన పలువురు వరంగల్, హైదరాబాద్‌తో పాటు చాలా ప్రదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి కంపెనీలు స్థాపించి పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. వీరంతా ఆదివారం హన్మకొండలోని పబ్లిక్ గార్డె¯ŒSలో సమావేశమయ్యారు. గ్రామ అభివృద్ధి కోసం ‘వెంకటాపురం డెవలప్మెంట్ ఫోరం’ను ఏర్పాటు చేశారు. మొదటగా స్వచ్ఛగామ్ కార్యక్రమం చేపట్టి సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కార్యక్రమాల నిర్వహణ కోసం అడ్‌హక్ కమిటీని ఉమామహేశ్వర్‌రెడ్డి, జమాలుద్దీ¯ŒS, మూర్తి, బాలక్రిష్ణ, రమణనాయక్‌లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో భుజంగరావు, మల్లికార్జు¯ŒS, శానబోయిన రాజ్‌కుమార్, రాజయ్య, పులిచేరు నర్సయ్య, 50 మంది ఉద్యోగస్తులు పాల్గొన్నారు. -
దారి చూపిన ఊరు
స్ఫూర్తి కొత్తదారి ఎప్పుడు కనిపిస్తుంది? ఏ ఇబ్బందో, కష్టమో వచ్చినప్పుడో... ప్రత్యామ్నాయం కోసం వెదుకుతాం. కొత్త దారి ఒకటి కనుక్కుంటాం. కొందరు మాత్రం కష్టాలు, నష్టాలు దరి చేరక మునుపే ప్రత్యామ్నాయాలను వెదుకుతారు. ముందుచూపుతో వ్యవహరిస్తారు. కంబకాయ గ్రామం అలాంటి ముందు చూపుతోనే వ్యవహరించింది. ఇతర గ్రామాలకు ఆదర్శంగా మారింది. ‘గ్యాస్ ధరల కష్టాలు’ అనే మాట వినిపించక ముందే ఊళ్లోకి బయోగ్యాస్‌ను ఆహ్వానించింది. చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శం గా నిలవడమే కాదు తెలుగునాట అగ్రస్థానంలో నిలిచింది. ఇంట్లోకి వంటగ్యాస్ రాగానే పండగ కాదు. రోజురోజూకు పెరుగుతున్న ధరను తట్టుకునే శక్తి ఉండాలి. అలాంటి శక్తి ఎంతమందికి ఉంది? కంబకాయ గ్రామంలో చాలామందికి గ్యాస్ధరల పెరుగుదలతో సంబంధం లేదు. ‘గ్యాస్ ధర మళ్లీ పెరిగింది’లాంటి వార్తలు చదివి ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాల క్రితమే ఆ గ్రామానికి ‘బయో గ్యాస్’ రూపంలో ఒక వరం లభించింది. ఇక భయమెందుకు? శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో ఉంది కంబకాయ గ్రామం. రెండు దశాబ్దాల క్రితం అప్పటి గ్రామ సర్పంచ్ పాగోటి రాజారావునాయుడు పశువుల పేడతో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం చేశారు. అప్పటికది ఊరికి కొత్త. దాని ప్రయోజనాల గురించి కూడా ఎక్కువమందికి తెలియదు. అయితే కాలక్రమంలో బయోగ్యాస్ విలువ తెలుసుకోవడం మొదలైంది. ఇప్పటి వరకు ఒక్క కంబకాయ గ్రామంలోనే 320కి పైగా బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం జరిగింది. ఇది ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. చుట్టుపక్కల 70 గ్రామాల వరకు ఈ ఊరిని స్ఫూర్తిగా తీసుకొని బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మించాయి, నిర్మిస్తున్నాయి. ఎలా తయారుచేస్తారు? మొదట ట్యాంకు నిర్మిస్తారు. ఈ ట్యాంకు భూమి అడుగు భాగంలో ఉంటుంది. ట్యాంకుకు ప్రక్కన కానీ, ట్యాంకు పైన కానీ ఒక కుండీ నిర్మిస్తారు. ఆ కుండీ ద్వారా పేడ, నీరు కలిపి బాగా చిక్కటి ద్రవ పదార్థంలా తయారు చేసి ట్యాంకులోకి విడిచిపెడతారు. ట్యాంకులో ప్రవేశించిన పేడ మూడు రోజులకి (ప్రారంభంలో) గ్యాస్‌గా మారుతుంది. ఆ ట్యాంకుకు ఏర్పాటు చేసిన పైపులైన్ సహాయం తో గ్యాస్ పొయ్యి వరకు సరఫరా అవుతుంది. మరో వైపు ట్యాంకు లోపల వ్యర్థపదార్థం రెండవ వైపు ఏర్పాటు చేసిన ఔట్లెట్ ద్వారా బయటకు వెళుతుంది. దీన్ని ‘స్లర్రీ’ అంటారు. ప్రతిరోజూ పశువుల పేడను ద్రవపదార్థంగా మార్చి ట్యాంకులో వేస్తుండాలి. ప్రయోజనం ఏమిటి? ‘‘బయోగ్యాస్ వినియోగం ద్వారా చాలా సమయం ఆదా అవుతుంది’’ అంటున్నారు గ్రామ మాజీ సర్పంచ్ పి.కుసుమకుమారి. గ్యాస్ ధరల పెరుగుదలకు ప్రత్యామ్నాయమనే కాకుండా, బయోగ్యాస్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. వంట చేసే మహిళలకు కళ్ల జబ్బులు, ఇతర హానికరమైన సమస్యలు ఉండవు. బయోగ్యాస్ వినియోగం అనంతరం విడుదలయ్యే వ్యర్థ పదార్థం ‘స్లర్రీ’ని పంట పొలాలలో ఎరువుగా ఉపయోగించవచ్చు. ఈ సేంద్రియ ఎరువు వినియోగం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది. గ్యాస్ వృథా అవుతుందనిగానీ, ప్రమాదాలు సంభవిస్తాయనే భయం కానీ గృహిణులకు ఉండదు. బయోగ్యాస్‌ద్వారా విద్యుద్దీపాలనూ వెలిగించుకోవచ్చు. ప్రభుత్వ చేయూత... ఒక ప్లాంట్ నిర్మాణానికి సుమారు ఇరవైవేల రూపాయల ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ (నెడ్కాప్) ద్వారా ఒక్కో ప్లాంట్‌కు ఎనిమిదివేల రూపాయల సబ్సీడి ఇస్తోంది. సబ్సీడీలో భాగంగా పొయ్యి, ఇతర పరికరాలను కూడా సరఫరా చేస్తారు. పర్యావరణ మిత్ర... బయోగ్యాస్‌కు ముందు వంటచెరుకు కోసం చెట్లను నరికేసేవారు. దీని ప్రభావం పర్యావరణంపై పడేది. బయోగ్యాస్ పుణ్యమా అని చెట్లకు ముప్పు తప్పింది. దోమల బెడద తప్పింది. రసాయనిక ఎరువులు కొనే అవసరం తప్పింది. ఒక్కటా రెండా... బయోగ్యాస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ గ్యాస్‌ను సమర్థంగా ఉపయోగించుకుంటూ తెలుగునాట అగ్రస్థానంలో నిలిచి, ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్న కంబకాయ బాటలో ప్రయాణించడానికి ఎన్నో గ్రామాలు స్ఫూర్తి పొందుతున్నాయి. - సదాశివుని కృష్ణ, సాక్షి, నరసన్నపేట ఫొటోలు: చల్ల మల్లేశ్వరరావు 1. ట్యాంక్‌లో పేడ కలుపుతున్న దృశ్యం 2. స్లర్రీ వినియోగించిన పొలంలో వరినాట్లు వేస్తున్న దృశ్యం 3. బయోగ్యాస్ ద్వారా వంట చేస్తున్న గృహిణి ఎలాంటి సమస్యా లేదు... ఇరవై సంవత్సరాల నుంచి బయోగ్యాస్‌ని ఉపయోగిస్తున్నాం. ఇప్పటికి వరకు ఏ విధమైన సమస్య రాలేదు. ప్లాంట్ నిర్మాణానికి స్వామిబాబు వజ్రమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ (ఎస్వీసిటీ) స్వచ్ఛంద సంస్థ సహకరించింది. - పాగోటి లక్ష్మి, గృహిణి, కంబకాయ వంటతో పాటు వ్యవసాయోత్పత్తికీ... బయోగ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యే స్లర్రీని సేంద్రియ ఎరువుగా వినియోగించడం వల్ల అధిక దిగుబడి, భూమి సారవంతంగా తయారవడం వంటి మంచి ఫలితాలు ఉన్నాయి. వంట ప్రయోజనం కంటే వ్యవసాయోత్పత్తికి ఇది మరీ ప్రోత్సాహంగా ఉంది. - గుజ్జిడి నాగేశ్వరరావు, రైతు