జన్మనిచ్చిన ఊరికోసం ఒక్కటైన ఉద్యోగులు | THE EMPLOYS UNIT FOR VILLEGE | Sakshi
Sakshi News home page

జన్మనిచ్చిన ఊరికోసం ఒక్కటైన ఉద్యోగులు

Published Mon, Oct 3 2016 1:20 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

THE EMPLOYS UNIT FOR VILLEGE

  • వెంకటాపురం డెవలప్‌మెంట్‌ ఫోరం’ ఏర్పాటు
  • గ్రామాభివృద్ధికి నిర్ణయం
  •  
    వెంకటాపురం (దుగ్గొండి) : సమాజంలో ఉన్నత స్థానం రాగానే ఊరిని మరిచి పట్టణం బాట పట్టడం సహజం. అయితే జన్మనిచ్చిన ఊరిని మరవకుండా గ్రామాభివృద్ధి కోసం ఉద్యోగాలు పొందిన వారు, ఉన్నత స్థానాలకు చేరిన వారు, ఉన్నత చదువులు చదువుకున్న వారంతా ఒక్కటయ్యారు.
    గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని తీర్మానించుకున్నారు. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన పలువురు వరంగల్, హైదరాబాద్‌తో పాటు చాలా ప్రదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి కంపెనీలు స్థాపించి పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. వీరంతా ఆదివారం హన్మకొండలోని పబ్లిక్‌ గార్డె¯ŒSలో సమావేశమయ్యారు. గ్రామ అభివృద్ధి కోసం ‘వెంకటాపురం డెవలప్‌మెంట్‌ ఫోరం’ను ఏర్పాటు చేశారు. మొదటగా స్వచ్ఛగామ్‌ కార్యక్రమం చేపట్టి సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కార్యక్రమాల నిర్వహణ కోసం అడ్‌హక్‌ కమిటీని ఉమామహేశ్వర్‌రెడ్డి, జమాలుద్దీ¯ŒS, మూర్తి, బాలక్రిష్ణ, రమణనాయక్‌లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో భుజంగరావు, మల్లికార్జు¯ŒS, శానబోయిన రాజ్‌కుమార్, రాజయ్య, పులిచేరు నర్సయ్య, 50 మంది ఉద్యోగస్తులు పాల్గొన్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement