సాక్షి, జహీరాబాద్: దేశవ్యాప్తంగా టమాటాలకు ఎంతో డిమాండ్ ఉందో తెలిసిందే. కొన్ని కిలో టమాటాల ధర ఏకంగా రూ.200లకు పైనే పలికింది. ఈ క్రమంలో కొందరు టమాట రైతులు కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక, టమాటకు భారీ ధర పలుకుతున్న నేపథ్యంలో తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమ్ముకుందామని కూరగాయల మార్కెట్‌కు తెచ్చిన టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల ప్రకారం.. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్‌కు చెందిన ఓ రైతు టమాటాలు అమ్మడానికి పట్టణంలో కూరగాయల మార్కెట్‌కు తాను పండించిన టమాటాలను తీసుకువచ్చాడు. కాగా, శుక్రవారం రాత్రి టమాటా ట్రేలను దుకాణంలో ఉంచి ఇంటికి వెళ్లాడు. అయితే, శనివారం తెల్లవారుజామునే వచ్చి చూసేసరికి రూ.6,500 విలువైన మూడు టమాటా ట్రేలు కనిపించలేదు. అవి దొంగతనానికి గురయ్యయాయని గుర్తించిన రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా హెల్మెట్ పెట్టుకున్న ఓ వ్యక్తి టమాటా ట్రేలను ఎత్తుకెళ్తు గుర్తించారు. ఇక, అతడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా పలు చోట్ల టమాటాలు చోరీకి గురైన ఘటనలు చాలానే జరిగాయి.
ఇటీవలే.. మహారాష్ట్రలోని పుణెలో అరుణ్ ధామ్ తన పొలంలో పండిన 400 కిలోల టమాటాలను పెట్టెల్లో సర్ది వాటిని రాత్రి ఒక వాహనంలో ఉంచి ఇంటి ముందు పార్క్ చేశాడు. ఉదయం వాహనాన్ని మార్కెట్‌కు తీసుకెళ్దామని చూడగా టమాటాలున్న బాక్స్‌లన్నీ చోరీ అయ్యాయి. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక, తమిళనాడులో కూడా విలువైన టమాటాలు చోరీకి గురయ్యాయి.
ఇది కూడా చదవండి: 5 కోట్లు గెలిచి 58 కోట్లు పోగొట్టుకున్న అభాగ్యుడు..
Comments
Please login to add a commentAdd a comment