మెదక్: దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వని చందంగా మారింది డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల పరిస్ధితి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా ఇళ్లు కట్టివ్వలేదు. హుస్నాబాద్ పట్టణంలో మొదటి విడతగా 160 ఇళ్లు, రెండో విడతకు 400 డబుల్ బెడ్రూం పంపిణీకి మంజూరు చేసింది. పట్టణ శివారులో జీప్లస్ టూ పద్ధతిన ఇళ్లు నిర్మించారు.
ఎన్నో ఏళ్ల సొంతింటి కల నేరవేరిందని సంతోషం పడుతున్న లబ్ధిదారులకు కలగానే మిగిలింది. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇళ్ల మంజూరునకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా, 1426 వచ్చాయి. ప్రస్తుతం 264 ఇళ్లు పూర్తికాగా మిగిలినవి చివరి దశలో ఉన్నా యి. లబ్ధిదారుల ఇళ్ల మంజూరునకు జిల్లా అధికా రులు సర్వే నిర్వహించారు. తొలి విడతలో 480 మందిని అర్హులుగా ఎంపిక చేశారు.
ఈ క్రమంలో జా బితాలో అనర్హులు ఉన్నారంటూ లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు రీ సర్వే చేపట్టారు. ఈ రీసర్వేలో 189 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు. మొత్తం 560 ఇళ్లకు గాను 264 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. ఈ 264 ఇళ్లకోసం మొత్తం 342 మందిని ఎంపిక చేశారు. దీంతో మార్చి 22న డ్రా తీయగా, 264 మందికి ఇళ్ల పంపిణీ చేశారు. 78 మందికి నిరాశే మిగిలింది.
20 నుంచి 30 ఇళ్లు మిగిలాయి
డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి. దాదాపు 20 నుంచి 30 ఇండ్లకు సంబందించి చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సతీష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే లభ్దిదారులకు పట్టాలు ఇప్పించి గృహ ప్రవేశాలు చేయిస్తాం. – ఆకుల రజిత, మున్సిపల్ చైర్ పర్సన్, హుస్నాబాద్
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ
డబుల్ బెడ్రూం ఇళ్లను మే 5వ తేదీన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీ దుగా ప్రారంభించి కేవలం 5 గురు లబ్ధిదారు లకు మాత్రమే పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి పట్టాలు ఇచ్చిన వారికి ఇళ్లు ఇవ్వలేదు.
ఎంపిక చేసిన మిగితా లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు ఇవ్వకపోవడంతో వారు నిరాశతో ఉన్నారు. పట్టాలు తీసుకున్న వారికి ఇల్లు వచ్చిందనే సంతోషం లేదు. డబుల్ బెడ్రూం ఇళ్లకు ఎంపికై న వారికి కూడా సంతోషం లేకుండా పోయింది. ప్రతి రోజూ ఇళ్ల వద్దకు వెళ్లి చూసి సంతోషపడాల్సిందే తప్ప గృహ ప్రవేశం చేసింది లేదు.
Comments
Please login to add a commentAdd a comment