కల్లాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని రవాణా చేయాలంటూ వారం రోజులుగా రైతుల ఆందోళన
తమ ఆందోళన గురించి వివరించడానికి వెళ్తే తహసీల్దార్ నిర్లక్ష్యపు వ్యాఖ్యలు.. రాస్తారోకోకు దిగిన రైతులు
పాపన్నపేట (మెదక్): ధాన్యం రవాణా చేయాలని కోరుతూ వారం రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నా అధికారుల నుంచి స్పందన కరువైంది. వారి ఆందోళనను పట్టించుకోక పోగా ఓ తహసీల్దార్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. మెదక్ జిల్లా పాపన్న పేట సమీపంలో మిన్‌పూర్‌లో శుక్రవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో వారం రోజులుగా రవాణా జరగక వందలాది క్వింటాళ్ల ధాన్యం కల్లాల్లో పేరుకు పోయింది. అయితే గురువారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి మొలకలెత్తాయి. దీంతో ధాన్యం రవాణా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు.
సమాచారం అందుకున్న పోలీసులు పాపన్నపేట తహసీల్దార్ లక్ష్మణ్‌బాబుకు రైతుల ఆందోళన గురించి వివరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ‘ఎప్పు డంటే అప్పుడు వచ్చేయడానికి మాకు మాత్రం భార్యా పిల్లలు లేరా’అంటూ నిర్లక్ష్యంగా సమాధాన మివ్వడంతో ఆగ్రహించిన రైతులు బొడ్మట్‌పల్లి రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్సై సురేశ్ అక్కడకు చేరుకుని రైతులకు నచ్చ జెప్పినప్పటికీ ఆందోళన విరమించలేదు. పోలీ సులు ఫోన్ చేసి తహసీ ల్దార్‌ను ఘటనా స్థలానికి పిలిపించారు. రైతులతో తహసీ ల్దార్ కొద్దిసేపు మాట్లాడి వారికి క్షమాపణ చెప్పారు. అదేవిధంగా గంటలో ధాన్యం రవాణా ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment