గాల్లో ఢీకొన్న విమానాలు: 8 మంది మృతి | eight feared dead after two planes collide mid air over a lake in USA | Sakshi
Sakshi News home page

గాల్లో ఢీకొన్న విమానాలు: 8 మంది మృతి

Published Mon, Jul 6 2020 1:05 PM | Last Updated on Mon, Jul 6 2020 1:05 PM

eight feared dead after two planes collide mid air over a lake in USA - Sakshi

వాషింగ్టన్​: అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రెండు విమానాలు గాల్లో ఢీ కొట్టుకున్న ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. విమానాలు రెండూ కోయర్ డీఅలెన్ సరస్సులో మునిగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. రెండు మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. (గల్వాన్‌ లోయలో కీలక పరిణామం)

మృతుల్లో పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నారని చెప్పారు. రెండు విమానాలు ఢీ కొట్టుకోవడం వెనుక ఉన్న కారణాన్ని ఇంకా కనుగొనలేదని తెలిపారు. సరస్సులో మునిగిపోయిన రెండు విమానాల శకలాలను సోనార్ సాయంతో గుర్తించినట్లు వెల్లడించారు. వాటిని బయటకు తీయడానికి ఒకటి నుంచి రెండు రోజుల సమయం పడుతుందన్నారు. విమాన ప్రమాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. (ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. 100 ఏళ్ల తర్వాత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement