విమాన దుర్ఘటనలో తెలుగు పైలట్ మృతి | Trainee pilot from Andhra dies in US | Sakshi
Sakshi News home page

విమాన దుర్ఘటనలో తెలుగు పైలట్ మృతి

Published Tue, Nov 19 2013 3:56 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

విమాన దుర్ఘటనలో తెలుగు పైలట్ మృతి - Sakshi

విమాన దుర్ఘటనలో తెలుగు పైలట్ మృతి

హైదరాబాద్ : అమెరికా విమాన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పైలెట్ మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కర్నూల్ జిల్లాకు చెందిన చామకూర కార్తీక్ ఈ ఘటనలో మృత్యవాత పడినట్లు మంగళవారం హూక్స్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ఆదివారం సెసీనా 172 విమానంలో సాంకేతిక లోపం సంభవించడంతో ప్రమాదం జరిగింది.  సింగిల్ ఇంజిన్ తో నడిచే సెసీనా పేలిపోవడంతో కార్తీక్ అసువులు బాసాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు.

 

గత సెప్టెంబర్ లోనే అమెరికాకు వెళ్లిన  కార్తీక్ మృతిపట్ల బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.అతని తండ్రి బీఎస్ఎన్ఎల్ అధికారి. ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీలో శిక్షణ తీసుకున్నకార్తీక్ పూర్తి విద్యాభ్యాసం హైదరాబాద్లోనే సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement