
తిరువనంతపురం: కోళీకోడ్ విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో విషాదం నింపింది. మరికొద్ది క్షణాల్లో సొంత గడ్డపై కాలుమోపబోతున్నామనే సంతోషంతో ఉన్నవారిని ఊహించని ప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారికి ఈ దుర్ఘటన ఓ పీడకలగా మారింది. అంతా 15 సెంకడ్లలో జరిగిపోయిందని ప్రమాదం నుంచి బయటపడిన ముహమ్మద్ జునైద్ అనే ప్యాసింజెర్ చెప్పాడు. దేవుడి దయతో తాను బయటపడ్డానని, ఇంకోసారి విమాన ప్రయాణం చేయాలనే ఆలోచననే లేదని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ శుక్రవారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
(చదవండి : భయంతో ముందు సీట్లను పట్టుకున్నాం..)
ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా 18 మంది మరణించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కొంతమంది స్పల్ప గాయాలతో బయటపడ్డారు. వారిలో ఒకరు జునైడ్(25) ఒకరు. మూడేళ్ల క్రితం దుబాయ్‌కి వెళ్లి అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. నెలకు 75 వేల జీతం. అంతా బాగుంటుందన్న సమయంలో కరోనా మహ్మమారి అతని ఉపాధిని దెబ్బతీసింది. మే నెలలో సగం జీతం ఇచ్చిన కంపెనీ.. తర్వాత మూడు నెలలు సెలవులపై వెళ్లాలని చెప్పి చేతులు దులుపుకుంది. ఈ క్రమంలో భారత్‌కు తిరిగి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. విమానం వెనుక భాగం చివరి సీట్లో కూర్చోవడం వల్ల తాను బతికి బయటపడ్డానని జునైద్ చెప్పాడు. విమాన పైకప్పు తాకడం వల్ల తలకి, పెదాలకు చిన్న గాయం తప్పా ఎలాంటి ప్రమాదం జరగలేదని జునైద్ పేర్కొన్నారు. దేవుని దయతో బయటపడ్డానని, మరోసారి విమానం ఎక్కాలని లేదని చెప్పుకొచ్చారు. (చదవండి : కోళీకోడ్ ఘటన: ప్రాణం కాపాడిన ఫైన్)
Comments
Please login to add a commentAdd a comment