plane catches fire
-
విమానం ల్యాండింగ్: క్షణాల్లో అంటుకున్న మంటలు, వీడియో వైరల్
అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపై ఒక విమానం భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. రెడ్ ఎయిర్ ఫ్లైట్ ఫ్రంట్ ల్యాండింగ్ గేర్ పెయిలవ్వడంతో 126 మంది ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా మంటలంటుకున్నాయి. దీంతో ప్రయాణీకులు ప్రాణభయంతో వణికిపోయారు. #Florida 🇺🇸 | Plane with 126 passengers, from the Dominican Republic, caught fire after landing at #Miami airport. The MD-82 plane, Red Air Flight 203, had landed when the landing gear collapsed and caught fire. 3 people with minor injuries. pic.twitter.com/eBok7Xuwhj — The informant (@theinformantofc) June 22, 2022 డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగో నుండి వస్తున్న విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతొ రన్‌వే నుండి పక్కకు జరిగిన విమానం క్రేన్ టవర్, చిన్న భవనంతో సహా అనేక వస్తువులను ఢీకొట్టింది. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెల్లటి రసాయన నురుగుతో మంటలను తక్షణమే అదుపు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలో విపరీతంగా షేర్ అవుతోంది. #NEW: Video shared with @nbc6 by Red Air Flight 203 passenger as they escaped burning plane. Three people were injured. Investigators say landing gear collapsed as plane landed at Miami International Airport. #Miami pic.twitter.com/LRHI3cGYdL — Ryan Nelson (@RyanNelsonTV) June 22, 2022 విమానం మంటల్లో చిక్కుకున్నప్పుడు ఫ్లైట్‌లోని ప్రయాణికులు వణికిపోయారని ఎన్బీసీ-6 అధికారి ర్యాన్ నెల్సన్ తెలిపారు. విమానం మెక్‌డొనెల్ డగ్లస్ MD-82 అని, ఘటనా స్థలానికి పరిశోధకుల బృందాన్ని పంపనున్నట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ తెలిపింది. ఫ్రంట్ ల్యాండింగ్ గేర్ కూలిపోవడమే మంటలకు కారణమని మియామీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కొన్ని విమానాలు రాకపోకలు ప్రభావితమైనాయి. -
విమానంలో అగ్ని ప్రమాదం.. 41 మంది మృతి
మాస్కో : అకస్మాత్తుగా విమానంలో చెలరేగిన మంటల్లో దాదాపు 41 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. రష్యా రాజధాని మాస్కోలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విమానంలో సిబ్బందితో పాటు 78 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. మాస్కో నుంచి బయల్దేరిన ఈ విమానం.. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే అత్యవసర ల్యాండింగ్ వల్ల నేలకు బలంగా తాకింది. దీనివల్లే విమానంలో మంటలు చెలరేగి ఈ దుర్ఘటన సంభవించినట్లు తెలుస్తోంది. -
విమానంలో అగ్నిప్రమాదం.. 41 మంది మృతి
-
సింగపూర్ విమానంలో మంటలు
సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి అత్యవసర ల్యాండింగ్ చేస్తుండగా, దానికి మంటలు అంటుకున్నాయి. చాంగి విమానాశ్రయంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సింగపూర్ నుంచి ఇటలీలోని మిలన్ వెళ్లాల్సిన ఈ విమానం ఉదయం 2.05 గంటలకు బయల్దేరింది. కొంత సేపు ప్రయాణించిన తర్వాత, ఇంజన్లో సమస్య వచ్చిందని, అందువల్ల విమానాన్ని సింగపూర్‌కు తీసుకెళ్లిపోతున్నామని పైలట్ ప్రకటించాడు. ఆ సమయానికి విమానంలో 222 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు. ఉదయం 7 గంటల సమయంలో విమానం ల్యాండ్ అవుతుండగా... దాని కుడివైపు రెక్కలకు మంటలు అంటుకున్నాయి. అయితే మంటలను వెంటనే ఆర్పేసినట్లు విమానంలోని ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో చేసిన పోస్టింగుల ద్వారా తెలిసింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశామని, ఎవరికీ గాయాలు కాలేదని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. వాళ్లందరినీ మెట్ల మార్గం గుండా కిందకు దింపి, అక్కడి నుంచి వాహనాలలో విమానాశ్రయంలోకి పంపారు. లీ బీ యీ అనే ప్రయాణికురాలు కిటికీలోంచి తన స్మార్ట్‌ఫోన్‌తో వీడియో తీసి దాన్ని వెంటనే ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తాను ఇప్పుడే చావును తప్పించుకున్నానని ఆమె చెప్పారు. విమానంలో ఉండగా తనకు ఇంధనం వాసన బాగా ఎక్కువగా వచ్చిందని, కాసేపటికి కుడివైపు ఇంజన్లో ఆయిల్ లీకవుతుండటంతో విమానాన్ని తిరిగి సింగపూర్ తీసుకెళ్తున్నట్లు పైలట్ ప్రకటించాడని ఆమె తెలిపారు. విమానం ల్యాండయ్యి, మంటలు అంటుకున్న ఐదు నిమిషాల తర్వాత ఫైరింజన్లు వచ్చాయని.. ఆ ఐదు నిమిషాలు మాత్రం తమ పాలిట నరకమేనని చెప్పారు.