Turkey Election 2023: Turkey President Erdogan Wins Historic Runoff Election - Sakshi
Sakshi News home page

నరాలు తెగే ఉత్కంఠ.. చారిత్రక విజయం.. మళ్లీ ఆయనే అధ్యక్షుడు!

Published Mon, May 29 2023 8:35 AM | Last Updated on Mon, May 29 2023 9:59 AM

Turkey  President Erdogan Wins Historic Runoff Election - Sakshi

ఇస్తాంబుల్‌: టర్కీ(తుర్కీయే) అధ్యక్ష ఎన్నికల్లో రెసెప్ తయ్యిప్‌ ఎర్డోగాన్‌(69) మరోసారి ఘన విజయం సాధించారు. సుప్రీం ఎలక్షన్‌ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికలకు తుది ఫలితాలు వెలువడిన అనంతరం.. తన విజయాన్ని ఆదివారం రాత్రి స్వయంగా ప్రకటించారాయన. దారుణమైన ఆర్థిక సంక్షోభం, దానికి తోడు భారీ భూకంపంతో కుదేలు కావడం.. ఆయనకు ఎన్నికల్లో ప్రతికూల అంశాలు అవుతాయని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ,  ఆ అంచనాలు తప్పాయి. చారిత్రక విజయం అందుకున్నారాయన.

రాబోయే ఐదేళ్ల కాలం తామే దేశాన్ని పరిపాలించబోతున్నామని ప్రకటించారాయన. ఈ మేరకు తన స్వస్థలం ఇస్తాంబుల్‌లో ఓ బస్సు టాప్‌పైకి ఎక్కి తన మద్దతుదారులను ఉద్దేశించి.. ఆయన మాట్లాడారు. మీ నమ్మకాన్ని చురగొనాలన్నది దైవాజ్ఞ అంటూ  పేర్కొన్నారాయన. మరోవైపు ఎర్డోగాన్‌ విజయాన్ని ఆయన మద్దతుదారులు, యువత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న నిర్వహించింది.  

మే 14వ తేదీన ఓటింగ్‌ జరగ్గా.. తొలి విడత కౌంటింగ్‌లో ఆసక్తికర ఫలితాలు రావడం ఉత్కంఠ రేపింది. ఒకానొక దశలో ఎర్డోగాన్‌ ఓడిపోతారేమోనని భావించారంతా. ఎర్డోగాన్‌కు 49.5 శాతం, కిలిక్దారోగ్లుకి 44.9 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో రెండో(తుది) రౌండ్‌ ఫలితం కోసం టర్కీ ఉత్కంఠగా ఎదురు చూసింది. అయితే కౌంటింగ్‌లో ఎర్డోగాన్‌ 52 శాతం ఓట్లు సాధించారు. ప్రత్యర్థి కెమల్‌ కిలిక్దారోగ్లుకు 48 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో.. ఎర్డోగాన్‌ విజయం ఖరారైంది.

గత రెండు దశాబ్దాలుగా ఎర్డోగాన్‌ పాలకుడిగా కొనసాగుతున్నారు. అధ్యక్షుడిగా, అంతకు ముందు ప్రధానిగా ఆయన పని చేశారు.

ఇదిలా ఉంటే.. ఎర్డోగాన్‌ చారిత్రక విజయం పట్ల పలు దేశాల అధినేతలు, ఐక్యరాజ్య సమితి చీఫ్‌ ఆంటోనియో గుట్రెస్‌ సోషల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

జార్జియా మూలాలు ఉన్న రెసెప్ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ కుటుంబం.. ఆయన 13వ ఏట ఇస్తాంబుల్‌కు వలస వచ్చింది. సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆయన.. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల్లో ఆ విశ్వాసాలను పక్కనపెట్టాడు. సం‍స్కరణల పేరిట ఆయన తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా మహిళలకు స్వేచ్ఛలాంటివి.. మతపరమైన విమర్శలకు దారి తీశాయి.  అయితే పేదల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు మళ్లీ ఆయన్ని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాయి.

2014 నుంచి టర్కీకి అధ్యక్షుడిగా పని చేశారు. 2003 నుంచి 2014 నడుమ.. ఆ దేశ ప్రధానిగా పని చేశారు. అంతకు ముందు ఆయనపై రాజకీయ నిషేధం కొనసాగడం గననార్హం. బ్యాన్‌కి ముందు.. 1994-98 మధ్య ఇస్తాంబుల్‌ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2001లో ఏర్పాటు చేసిన  జస్టిస్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ పార్టీ(AKP) సహ వ్యవస్థాపకుడు కూడా. 

1954లో రిజ్‌, గునెయ్జులో పుట్టిన ఎర్డోగాన్‌.. ఆర్థిక శాస్త్రంలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఆపై రాజకీయాల వైపు అడుగులేశారు. ఇస్లామిక్‌ రాజకీయ నేత నెక్‌మెట్టిన్‌ ఎర్బకన్‌కు ప్రియ శిష్యుడిగా కొనసాగి.. స్థానిక రాజకీయాల్లో రాణించాడు. ఆపై ఇస్తాంబుల్‌కు మేయర్‌ అయ్యాడు. 

జైలు శిక్ష.. మార్పు
1997లో ఇస్తాంబుల్‌ మేయర్‌గా కొనసాగుతున్న టైంలో.. ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు.  టర్కీ ఉద్యమకారుడైన జియా గోకాల్ప్‌ రచనల్లోని ఓ పద్యాన్ని పఠించే సమయంలో.. మాతృకలో లేని అంశాలను జోడించి చదివి వినిపించారాయన. అయితే ఆ పదాలు అభ్యంతరకరంగా ఉండడంతో.. వివాదం మొదలైంది. ఆయన చేసిన పని హింసకు, విద్వేషానికి దారి తీసేలా ఉందంటూ పది నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. దీంతో.. ఆయన తన మేయర్‌ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేకాదు.. ఆయనపై రాజకీయ నిషేధం అమలులోకి వచ్చింది.

ఈలోపు ఆయన తన తన శిక్షను జరిమానా కింద మార్చాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. కోర్టు  ఆ శిక్షను నాలుగు నెలల కిందకు కుదించింది. అప్పుడు ఆయన్ని కిర్క్లారెలీలోని పినర్హిసార్ జైలుకు తరలించారు. ఆయన జైలుకు వెళ్లిన రోజునే.. దిస్‌ సాంగ్‌ డసన్ట్‌ ఎండ్‌ హియర్‌ అనే ఆల్బమ్‌ ఒకటి ఆయన రిలీజ్‌ చేశారు. అందులో ఏడు పద్యాలతో కూడిన ట్రాక్‌ లిస్ట్‌ ఉండగా.. 1999లో బెస్ట్‌ సెల్లింగ్‌గా నిలవడంతో పాటు ఏకంగా మిలియన్‌ కాపీలు అమ్ముడుపోయి రికార్డు సృష్టిచింది. అంతేకాదు.. అక్కడి నుంచే జస్టిస్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ పార్టీ(AK Parti)కి ఆలోచన చేశాడాయన.

ఆ తర్వాత మత విశ్వాసాలను పక్కనపెట్టి.. పాశ్చాత్య ధోరణి తరహా పాలనను తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో వామపక్ష భావజాలంతో ముందుకు సాగారాయన. పేదల మనిషిగా తన పాలన ముద్రపడేలా ముందుకెళ్లారు. 2013లో టర్కీ ప్రధాని హోదాలో పినర్హిసార్ జైలును సందర్శించిన ఆయన.. తనకిది పునర్జన్మ ఇచ్చిన ప్రదేశమని ప్రకటించుకున్నారు. ఆ సమయంలో  టర్కీలో విపరీతమైన ప్రజాదరణ ఆయన వశమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement