అంకారా: రష్యా ప్రతినిధిపై ఉక్రెయిన్ ఎంపీ దాడి చేశారు. రష్యా ప్రతినిధి కవ్వింపు చర్యతో ఆగ్రహానికిలోనైన ఉక్రెయిన్ ఎంపీ.. అతడిపై దాడికి దిగాడు. ముఖంపై పంచ్ ఇచ్చి.. గాయపరిచాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
టర్కీ దేశ రాజధాని అంకారాలోని గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది. బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ 61వ పార్లమెంటరీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇక, ఈ సమ్మిట్‌కు పలువురు రష్యా ప్రతినిధులు, ఉక్రెయిన్ ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో సమ్మిట్‌కు హాజరైన ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండర్ మారికోవ్స్కీ తమ దేశ జెండాను ప్రదర్శించాడు.
ఇదే సమయంలో అటుగా వస్తున్న రష్యా ప్రతినిధి ఒకరు ఓవరాక్షన్ చేశారు. ఒలెక్సాండర్ చేతిలోని జెండాను ఒక్కసారిగా లాక్కొని అక్కడి నుంచి పరుగులు తీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఉక్రెయిన్ ఎంపీ.. అతన్ని వెంబడించి పట్టుకున్నాడు. పిడిగుద్దులు గుద్దుతూ రష్యా ప్రతినిధిని చావబాదాడు. అక్కడే ఉన్న ఇతర అధికారులు వీరిని అడ్డుకున్నారు. అనంతరం రష్యా ప్రతినిధి చేతిలోని జెండాని ఎంపీ లాక్కున్నాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా ప్రతినిధి కవ్వింపు చర్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: మరో ఆప్షన్ లేదు.. లొంగిపోతానన్నా వినొద్దు.. జెలెన్‌స్కీని మట్టుబెట్టాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment