బాక్స్ క్రికెట్ స్టేడియాన్ని కూల్చివేస్తుండగా భూమికి సంబంధించిన వ్యక్తులు అడ్డుకునే యత్నం చేశారు. హైడ్రా సీఐ తిరుమలేశ్‌తో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో దాడికి యత్నించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అదే రీతిలో సీఐ బదులివ్వడంతో భూ యజమానులు వెనక్కి తగ్గారు. హైడ్రా సిబ్బంది వెంటనే జేసీబీతో క్రికెట్ స్టేడియాన్ని ధ్వంసం చేసి చదును చేశారు. లేఅవుట్‌లో చూపించిన పార్కు స్థలంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో ఇది పార్కు స్థలం అంటూ బోర్డు పాతించారు. దాడికి యత్నించిన వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు సీఐ తిరుమలేశ్ తెలిపారు. అనంతరం కాలనీవాసులు సీఎం రేవంత్‌రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు.