దుండిగల్: విద్యుత్ కేబుల్ లైన్ మార్చడానికి లంచం డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఏఈని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధిలోని డీపోచంపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న సురేందర్‌రెడ్డి 11కేవీ విద్యుత్ లైన్ మార్చడానికి, ఓ భవనానికి కేబుల్ లైన్ వేయడానికి సదరు భవన యజమాని నుంచి రూ.30 వేలు డిమాండ్ చేశాడు. ఈ విషయమై సదరు భవన యజమాని ఏసీబీ అధికారులను సంప్రదించారు. అధికారులు సూచించిన విధంగా గురువారం ఏఈ సుందర్‌రెడ్డికి ఆయన కార్యాలయంలో నగదు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.