ఘనంగా దాసాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్ట | - | Sakshi
Sakshi News home page

ఘనంగా దాసాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్ట

Published Thu, Apr 17 2025 1:33 AM | Last Updated on Thu, Apr 17 2025 1:33 AM

ఘనంగా

ఘనంగా దాసాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్ట

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌:బాపులపాడు మండలం వీరవల్లిలో కృష్ణా మిల్క్‌ యూనియన్‌కు చెందిన ‘ప్రాజెక్టు కామథేను’ పాల ఫ్యాక్టరీ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్టా మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కనులపండువగా సాగింది. మహోత్సవం తిలకించేందుకు పాడి రైతులు, పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణా మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు దంపతుల చేతుల మీదగా ఆలయ శిఖర ప్రతిష్టను చిన్న జీయర్‌ స్వామి నిర్వహించారు. సీతారాముల పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి దేవస్థానం నుంచి తెచ్చిన ముత్యాల తలంబ్రాలను భక్తులను అందించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ఆయన ప్రవచనాన్ని అందించారు. కృష్ణాజిల్లా ప్రాంతంలో గోవుల పెంపకం మరింత పెరగాలని, గో సంపద వృద్ధి చెందటం ద్వారా నేల సారాన్ని పెంచుకునే కృషి చేయాలి సూచించారు. పాల సహకార సొసైటీలకు యూనియన్‌ తరుపున బోనస్‌లను చిన్న జీయర్‌ స్వామి చేతుల మీదగా పంపిణీ చేశారు. అనంతరం మహా అన్నప్రసాద వితరణ జరిగింది. కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఎండీ కొల్లి ఈశ్వర బాబు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు, ఇతర పాలకవర్గ సభ్యులు, పాల సహాకార సంఘాల అధ్యక్షులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

చౌటుప్పల్‌: ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని గణేష్‌నగర్‌ కాలనీలో మంగళవారం రాత్రి జరిగింది. బుధవారం స్థానిక సీఐ మన్మథకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామానికి చెందిన పందేటి చలపతిరావు(38) చౌటుప్పల్‌ పరిధిలోని దివీస్‌ ఫార్మా కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. గత 20 ఏళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని గణేష్‌నగర్‌ కాలనీలో నివాసముంటున్నాడు. మంగళవారం సాయంత్రం చలపతిరావు భార్య భవిత ప్రార్థన నిమిత్తం స్థానికంగా చర్చికి వెళ్లింది. కుమార్తె ఇంట్లోనే ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జీవితంపై విరక్తితో చలపతిరావు రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లోని మరో గదిలోకి వెళ్లి సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రార్థన ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన భవిత తన భర్త ఆత్మహత్య చేసుకోవడాన్ని చూసి భోరున విలపించింది. మృతుడి తండ్రి వీరరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

భార్య, కుమారుడు అదృశ్యంపై కేసు

పెనమలూరు: కానూరులో భార్య, కుమారుడు అదృశ్యమయ్యారని భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... కానూరు శివాలయం వీఽధికి చెందిన లంకె దుర్గాప్రసాద్‌, భార్య దుర్గాభవాని, 3 సంవత్సరాల కుమారుడితో ఉంటున్నాడు. ప్రైవేటు కంపెనీలో పని చేస్తాడు. ఈ నెల 14వ తేదీ రాత్రి దుర్గాప్రసాద్‌ ఫోన్‌ మాట్లాడుతుండగా కుమారుడు ఫోన్‌ కావాలని అల్లరి చేశాడు. ఈ విషయమై భార్యాభర్తలకు మధ్య గొడవ జరిగింది. రాత్రి దుర్గాభవాని, కుమారుడు ఇంట్లో నిద్రపోగా దుర్గాప్రసాద్‌ దగ్గరలో ఉన్న తల్లి ఇంట్లో నిద్రపోయాడు. అయితే 15వ తేదీ ఉదయం దుర్గాప్రసాద్‌ ఇంటికి రాగా భార్య, కుమారుడు కనిపించలేదు. తాను తిరిగి రానని భార్య ఇంటి గోడపై రాసింది. దుర్గాప్రసాద్‌ వెంటనే దుర్గాభవాని పుట్టిల్లు పామర్రుకు ఫోన్‌ చేయగా రాలేదని తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

ఘనంగా దాసాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్ట 1
1/1

ఘనంగా దాసాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్ట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement