
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు
పెడన: బల్లిపర్రు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం జరిగిన 5వ తరగతి, జూనియర్ ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పాఠశాల ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ ఎన్.రూతమ్మ తెలిపారు. జూనియర్ ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి 197 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 154 మంది హాజరయ్యారని, 43 మంది ఆబ్సెంట్ అయినట్లు పేర్కొన్నారు. ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు 135 మందికి 53 మంది హాజరయ్యాని తెలిపారు.
18 నుంచి రాష్ట్ర స్థాయి నాటక పోటీలు
గుడివాడ టౌన్: కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ నెల 18, 19, 20 తేదీల్లో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం గుడివాడ ఎస్‌పీఎస్ హైస్కూల్ ఆవరణలో పోటీల బ్రోచర్లను ఆవిష్కరించారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి ఎస్‌పీఎస్ హైస్కూల్ వేదికపై నాటక పోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీ సత్యనారాయణ, కార్యదర్శి ఏఎస్వీ ప్రసాదు, కన్వీనర్ ఆర్వీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
గుడివాడ టౌన్: ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. శనివారం బాలికల విభాగంలో పోటీలు ముగియగా ఆదివారం బాలురు, పురుషుల విభాగం పోటీలు ముగిశాయి. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగాల్లో పోటీలు జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ లంకదాసరి ప్రసాదరావు, స్టేడియం కమిటీ సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి జ్యోతిసురేఖ
విజయవాడస్పోర్ట్స్: ఆర్చరీ ప్రపంచ కప్ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారిణి వెన్నం జ్యోతిసురేఖ గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్ర, దేశ క్రీడా ఖ్యాతిని ప్రపంచానికి చాటారని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. అమెరికాలో జరిగిన ఆర్చరీ ప్రపంచ్ కప్ స్టేజ్–1 టోర్నీలో పతకం సాధించిన జ్యోతిసురేఖను మంత్రి ఒక ప్రకటనలో అభినందించారు. ఆదివారం జరిగిన కాంపౌండ్ మిక్సిడ్ విభాగం ఫైనల్స్‌లో రిషబ్‌యాదవ్‌తో కలిసి 153–151 తేడాతో చైనీస్ జోడీ హువాంగ్ ఐ జౌ– చెన్‌చిహు లిన్‌ని ఓడించి దేశానికి తెలుగు తేజం బంగారు పతకాన్ని అందించడం రాష్ట్ర ప్రజలు గర్వించదగ్గ విషయని పేర్కొన్నారు.
ఏపీ జీఈఏ ఐక్యవేదిక కో–చైర్మన్‌గా బాలాజీ
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక (ఏపీ జీఈఏ) కో చైర్మన్‌గా ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏపీ జీఈఏ కార్యాలయంలో ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షతన సమావేశం జరిగింది. బాలాజీ ఎన్నికపై ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సత్యనారాయణ, రాష్ట్ర సంఘటన కార్యదర్శి సీహెచ్ శ్రావణ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు