
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
ఇచ్చేవి గోరంత.. ప్రచారం కొండంత
–4లోu
ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
విమానాశ్రయం(గన్నవరం): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మే రెండో తేదీన గన్నవరం విమానాశ్రయానికి విచ్చేస్తున్న సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. ప్రధాన మంత్రి పర్యటన నేపథ్యంలో విమానాశ్రయంలో ఎస్పీ ఆర్.గంగాధరరావు, జేసీ గీతాంజలిశర్మతో కలిసి కలెక్టర్ పలు శాఖల జిల్లా అధికారులతో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరావతి రాజ ధాని పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు పీఎం విచ్చేస్తున్నట్లు తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రధానితో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎయిర్‌పోర్ట్‌కు వస్తారని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందో బస్తు ఏర్పాటు చేయాలన్నారు. అదే సమయంలో సాధారణ ప్రయాణికులకు ఎటువంటి ఆటంకం కలుగ కుండా ముందుగానే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునేలా సమాచారం అందించాలని సూచించారు.
జి.కొండూరు: మాటలు కోటలు దాటుతున్నాయి గానీ.. చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదన్నట్లు తయారైంది కూటమి ప్రభుత్వ తీరు. పేద ప్రజలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వం అందిస్తోన్న కార్పొరేషన్ రుణాల మంజూరులో ప్రభుత్వం కేటాయించిన యూనిట్లకు, వచ్చిన దరఖాస్తులకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. యూనిట్ల కేటాయింపు వందల్లో ఉంటే దరఖాస్తులు మాత్రం వేలల్లో వచ్చాయి. సిఫార్సు లేనిదే రుణాల మంజూరు కష్టమని ప్రచారం జరగడంతో ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు కూడా ముప్పై శాతానికి పైగా దరఖాస్తుదారులు వెనకాడారు. యూనిట్ల కేటాయింపులో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి మరిన్ని యూనిట్లను కేటాయిస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని దరఖాస్తుదారులు ఆశిస్తున్నారు.
కేటాయింపులు అంతంతమాత్రమే..
అన్ని సామాజిక వర్గాల్లో నిరుపేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా రాయితీపై అందించే వ్యక్తిగత రుణాల కేటాయింపు అంతంమాత్రంగానే ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్‌లకు రుణాల మంజూరు కోసం 2,335యూనిట్లను ప్రభుత్వం కేటాయించగా 34,767మంది దరఖాస్తులు చేశారు. వీరికి యాభైశాతం ప్రభుత్వం రాయితీపై యూనిట్ కాస్ట్ ఆధారంగా రుణాలను మంజూరు చేస్తారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు 990యూనిట్లను ప్రభు త్వం టార్గెట్‌గా కేటాయించగా ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఎస్సీ రుణాలకు ప్రభుత్వ రాయితీ 40శాతం నుంచి ప్రారంభమై ఎంచుకున్న యూనిట్ ఆధారంగా రాయితీని అందిస్తారు.
సిఫార్సులు ఉంటేనే రుణాలు..
కార్పొరేషన్ రుణాల కోసం ముందస్తుగానే కూటమి నాయకులు తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు జాబితాను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంటర్వ్యూల అనంతరం మండల స్థాయి కూటమి నాయకులు తయారు చేసి ఇచ్చిన జాబితానే మండల పరిషత్ అధికారుల లాగిన్ నుంచి బ్యాంకర్లకు పంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
గత ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నిరుపేద మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల పేరుతో నగదు బదిలీకి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా అన్ని సామాజిక వర్గాలలో 45–60 ఏళ్ల మధ్య వయస్సుగల మహిళలకి ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ఆర్థిక సాయం తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా గ్రామ వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులను గుర్తించి పథకాన్ని అమలు చేశారు. ఈ పథకాలతో పాటు మరికొన్ని నగదు బదిలీ పథకాల ద్వారా లబ్ధి పొందిన ఎన్నో కుటుంబాలు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదిగారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రాయితీపై అందించే వ్యక్తిగత రుణాలకు కూడా టార్గెట్‌లు పెట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా అయితే కూటమి అనుకూలస్తులే లబ్ధి పొందుతారు తప్ప అసలైన పేద కుటుంబాలకు మేలు జరగదని దరఖాస్తుదారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
పారదర్శకత పాటించాలి..
కార్పొరేషన్ రుణాల మంజూరులో పారదర్శకత పాటించాలి. ఇంటర్వ్యూలలో ఎంపిక చేసిన దరఖాస్తుదారుల జాబి తా నుంచి డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తే న్యాయం జరుగుతుంది. వేలల్లో దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో రుణాల మంజూరు టార్గెట్‌ను పెంచాలి.
– పొన్నం శ్రీనివాసరావు, రజక సంఘం నాయకుడు, జి.కొండూరు గ్రామం
టార్గెట్‌లు వద్దు..
కార్పొరేషన్ రుణాలకు పరిమితి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ మంజూరు చేయాలి. దరఖాస్తు చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూల అనంతరం తుదిజాబితా నుంచి డ్రా పద్ధతిలో ఎంపిక చేయాలి. పారదర్శకత పాటించకపోతే అసలైన పేదలకు న్యాయం జరగదు.
– పులిపాక ప్రకాశ్,
జనసేన నాయకుడు, జి.కొండూరు
●
అన్యాయం జరుగుతోంది..
మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్‌లు విడివిడిగా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ పేరుతో ఉమ్మడిగా రుణాలను మంజూరు చేయడం వల్ల అధిక జనాభా ఉన్న వర్గానికి సంక్షేమ రంగంలో అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి కార్పొరేషన్‌ల వారీగా పరిమితి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలను అందించాలి.
– మందా నాగమల్లేశ్వరరావు, ఏపీ ఎంఆర్ పీఎస్ అమరావతి అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం
3
న్యూస్‌రీల్
ఎన్టీఆర్ జిల్లాలో రుణాల మంజూరు టార్గెట్ 2,335 యూనిట్లు మాత్రమే వచ్చిన దరఖాస్తులు 34,767 అర్హత, పారదర్శకతకు తావే లేదు సిఫార్సులకే అవకాశమంటూ ప్రచారం యూనిట్లు పెంచాలని విన్నవిస్తున్న దరఖాస్తుదారులు
ఎన్టీఆర్ జిల్లాలో వివిధ కార్పొరేషన్‌ల ద్వారా రుణాల టార్గెట్, దరఖాస్తుల వివరాలు..
కార్పొరేషన్ రుణాల దరఖాస్తులు
టార్గెట్
బీసీ 1,466 23,975
కాపు 508 6,840
ఈడబ్ల్యుఎస్ 361 3,952
ఎస్సీ 990 (ప్రక్రియ
కొనసాగుతోంది)

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ