పెనమలూరు: కానూరు మురళీనగర్‌లో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటంతో పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన షగీర్‌ఖాన్(30), భార్య దిల్‌రుబాబీబీ, ముగ్గురు పిల్లలతో కానూరు మురళీనగర్‌లో గత కొద్ది కాలంగా ఉంటున్నాడు. భర్త ఆటోనగర్‌లో పాత ఇనుము షాపులో పని చేస్తుండగా, భార్య స్టీల్ కంపెనీలో పని చేస్తోంది. భర్త షగీర్‌ఖాన్ మద్యానికి బానిసగా మారటంతో భార్య దిల్‌రుబాబీబీతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం భార్య పనికి వెళ్లగా, ముగ్గురు పిల్లలు స్కూల్‌కు వెళ్లారు. షగీర్‌ఖాన్ భార్య దిల్‌రుబాబీబీకి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. భార్య మధ్యలో పని వదిలి ఇంటికి వచ్చి తలుపుకొట్టింది. భర్త తలుపు తెరవకపోవటంతో ఇంటి యజమాని, ఇరుగుపొరుగువారికి సమాచారం తెలిపింది. పోలీసుల సహకారంతో బలవంతంగా తలుపులు తెరిచి చూడగా షగీర్‌ఖాన్ చున్నీతో ఉరేసుకుని మృతిచెంది ఉన్నాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.