
బీసీలకు 52శాతం రిజర్వేషన్లు కల్పించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బీసీలకు 52శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.పుష్పరాజ్ డిమాండ్ చేశారు. బీసీలకు 52శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీఎస్పీ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో ఽశుక్రవారం ధర్నా చేశారు. ఈసందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో బీసీలు 52శాతం ఉన్నారని గత ప్రభుత్వం లెక్కలతో తేల్చిందన్నారు. ఆ మేరకు బీసీలకు విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థలపదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీహార్ సీఎం నితీష్‌కుమార్ కులగణన జరిపి బీసీలకు 65శాతం రిజర్వేషన్లు ప్రకటించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శులు కొదమల ప్రభుదాసు, గంగవరపు దేవా , జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌కిరణ్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు దొండపాటి శామ్యూల్ కుమార్, సిటీ కన్వీనర్ పి.డేనియల్, నాయకులు దాసరి కృష్ణ, ఉడుముల బుజ్జి, మద్దిరాల వినోద్, కోటేశ్వరరావు, మల్లాది అశోక్, బూదాల బాబురావు, కె.వి.రత్నం, నందిగం రామ్మోహన్, మేకల దుష్యంత్, ప్రత్తిపాటి మల్లయ్య పాల్గొన్నారు.