
ఇంటర్ ఫలితాల్లో శ్రీచైతన్య విజయభేరి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఇంటర్మీడియెట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు విజయదుందుభి మోగించాయని శ్రీచైతన్య విద్యాసంస్థల డీన్ పి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఎంజీ రోడ్డులోని ఎంఅండ్‌ఎం శ్రీ చైతన్య విద్యాసంస్థల క్యాంపస్‌లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శనివారం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్–2025 ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 992 మార్కులతో కె.మానస, జి.లహరి రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిచారన్నారు. అలాగే బైపీసీ విభాగంలో షేక్ ఆఫీఫా తబస్సుమ్ 992 మార్కులతో అసాధారణ ప్రతిభ కనబరిచిందన్నారు. 990 ఆపై మార్కులు 172 మంది, 247 మంది 985 ఆపై మార్కులు, 792 మంది 980 ఆపై మార్కులు, 8551 మంది 900 ఆపై మార్కులు పొందారని వివరించారు.
ఫస్టియర్ ఫలితాల్లోనూ విజయ పరంపర
ప్రథమ సంవత్సర ఫలితాల్లోనూ తమ విద్యార్థుల విజయ పరంపర కొనసాగిందన్నారు. ఎంపీసీ విభాగంలో 467 మార్కులతో ఇద్దరు విద్యార్థులు ఎం.వినూత్న, బి.యశ్వంత్ నాయక్ అగ్రస్థానంలో నిలిచారన్నారు. బైపీసీ విభాగంలో చల్ల లేఖన 437 మార్కులతో రాష్ట్రంలో ప్రఽథమ స్థానం పొందారని చెప్పారు. ఎంపీసీ విభాగంలో 466 ఆపై మార్కులు 23 మంది, 465 ఆపై మార్కులు 157 మంది, 460 ఆపై మార్కులు 1212 మంది, 400 ఆపై మార్కులు 7927 మంది సాధించారని తెలిపారు. బైపీసీ విభాగం నుంచి 436 ఆపై మార్కులతో 14 మంది, 435 ఆపై మార్కులు 67 మంది, 430 ఆపై మార్కులు 469 మంది, 400 ఆపై మార్కులు 2063 మంది విద్యార్థులు సాధించి సత్తా చాటారన్నారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఏజీఎం మద్దినేని మురళీకృష్ణ, డీన్స్, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
తిరుపతమ్మ సేవలో అధికారులు
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారిని శనివారం పశుసంవర్ధక శాఖ జెడీ హనుమంతరావు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ జాయింట్ కమిషనర్ శివరామ్, అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు వారిని అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అమ్మవారి గోశాలను సందర్శించి పలు సూచనలు చేశారు. పశువైద్యాధికారి పి.అనిల్ తదితరులు పాల్గొన్నారు.