
వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్లు, ప్రధాన కార్యదర్శి నియామక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో వివిధ హోదాల్లో నాయకులను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ సీపీ పొలిటికల్ ఎడ్వైజరీ కమిటీ మెంబర్లుగా మాజీ మంత్రులు జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది.
నృత్యకళాకారులకు గిన్నిస్ బుక్‌లో చోటు
పెద్దఆవుటపల్లి(గన్నవరం): ఉంగుటూరు మండలం పెద్దఆవుటపల్లికి చెందిన శ్రీవిజయలలిత కూచిపూడి నృత్య అకాడమీ నృత్య కళాకారులు 30 మంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికా ర్డ్స్‌లో చోటు దక్కించుకున్నారని నాట్యచారిని జి.వనజ చంద్రశేఖర్ తెలిపారు. ఆమె శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. 2023 డిసెంబర్ 24న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో భరత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 7,209 మంది కళాకారులతో కూచిపూడి కళావైభవం మహా బృంద నాట్య ప్రదర్శన జరిగిందని పేర్కొన్నారు. ఈ బృందంలో తమ అకాడమీ విద్యార్థులు 30 మంది భాగస్వాములయ్యారని తెలిపారు. ఆ నాట్య ప్రద ర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు ఎక్కిందని పేర్కొన్నారు. నాట్య ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులందరికీ గిన్నిస్ బుక్ నుంచి సర్టిఫికెట్లు అందాయని వివరించారు.
కొనసాగుతున్న వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
గుడివాడ టౌన్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12వ రాష్ట్ర క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలు శనివారం కూడా కొనసాగాయి. మహిళల విభాగంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ స్థాయిలో ఈ పోటీలు జరి గాయి. మాస్టర్స్ మహిళా విభాగం పోటీలు శనివారం ముగిశాయి. ఈ పోటీల్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన జగపతి తిరుపతమ్మ మూడు విభాగాల్లో బంగారు పతకాలు సాధించి స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ది చాంపియన్‌గా నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేడియం కమిటీ సభ్యుడు గుత్తా శివరామ కృష్ణ(చంటి), కోచ్ ఎం. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సుబ్రహ్మణ్యుడి సేవలో డీజీపీ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సతీ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలు పూర్ణకంభంతో ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా పుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీ రామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు, వేదపండితులు బాలకృష్ణ శర్మ, మణిదీప్ శర్మ, విరూప్ శర్మ వేద ఆశీర్వచనాలు అందజేశారు. కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధరరావు, అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్లు, ప్రధాన కార్యదర్శి నియామక

వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్లు, ప్రధాన కార్యదర్శి నియామక