
గాయని మల్లాది స్వాతికి విశిష్ట మహిళా పురస్కారం
విజయవాడకల్చరల్: విజయవాడ నగరానికి చెందిన శాసీ్త్రయ సంగీత విద్వాంసురాలు, గాయని మల్లాది స్వాతికి 2025 సంవత్సరానికి విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నట్లు ఆదివారం ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బల్లెం వేణుమాధవ్ ఆర్ట్స్ థియేటర్ సంస్థ ప్రతి ఏటా దేశంలో వివిధ రంగాల్లో సేవలను అందించిన వారికి విశిష్ట మహిళా పురస్కారం అందిస్తోంది. 2025 సంవత్సరానికి గానూ స్వాతికి ఈ పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని తెలుగు చలన చిత్ర మండలి హాల్‌లో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి చేతుల మీదుగా శనివారం పురస్కారం అందుకున్నారు. స్వాతి నగరంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో కర్నాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో కచేరీలు, సినీ సంగీత విభావరి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరానికి చెందిన పలు సంస్థలు ఆమెను అభినందించాయి.