Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comments On Chandrababu And Media1
బాబూ.. మీడియాతో పెట్టుకోకు!

ఎవరైనా బలవంతంగా ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తాం?. ముందుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మరి పోలీసులే వ్యక్తుల ఇళ్లల్లోకి బలవంతంగా చొరబడితే? చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే? ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని హరిస్తూ అరాచకాలకు పాల్పడితే? ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఇదే.ఏపీ ప్రభుత్వం మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి మరీ పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను వేధిస్తూ చివరికి ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న మీడియా గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి నివాసంపై పోలీసుల దాడిని కూడా ఈ కోణంలోనే చూడాలి. టీడీపీ, అధికారంలోకి వచ్చినప్పటి జనసేన, బీజేపీ కూటమి దుశ్చర్యలకు అంతు లేకుండా పోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడూ మీడియాపై ఒక కన్నేసే ఉంచుతారు. బాకా మీడియాను ఒకరకంగా, వైఫల్యాలను, ప్రభుత్వ స్కామ్‌లను బయటపెట్టే మీడియాను మరో రకంగా చూస్తారు. మాట వినని జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకు వస్తారు కూడా. అనుకూలంగా ఉండే మీడియాకు రకరకాల రూపాలలో మేళ్లు చేస్తారు. తద్వారా ఆ యాజమాన్యాలను తన గుప్పెట్లో ఉంచుకుంటారు.1995లో తన మామ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక వర్గం మీడియా ద్వారా ఆయనపైనే వ్యతిరేక ప్రచారం అనండి.. దుష్ప్రచారం చేయించిన చరిత్ర చంద్రబాబుది అని అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నవారు చెబుతుంటారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉంటూనే ఆయన తెలివిగా ఎన్టీఆర్‌ ప్రతిష్టను తగ్గించే వ్యూహాలు అమలు చేశారని ఆరోపణలున్నాయి. ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతిని బూచిగా చూపెట్టేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను బాగా వాడుకోగలిగేవారు. ఈనాడు చూడడానికే అసహ్యంగా ఉండే ఘోరమైన కార్టూన్లు ఎన్టీఆర్‌పై వేసేది. అయినా ఆ రోజుల్లో ఈ పత్రికలపై ఎన్టీఆర్‌ కేసులు పెట్టలేదు.మామను కూలదోసి ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు పాలన మాటెలా ఉన్నా అనుకూల మీడియా వ్యవస్థనైతే బాగానే ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్‌లు జరిగినా, జరగకపోయినా, కల్పిత కథనాలకు కొదవ ఉండేది కాదు. అదే టైమ్‌లో రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లే వ్యూహాలు పక్కాగా అమలయ్యేవి. ఆ రోజుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే కొన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రచార ప్రకటనలు నిలిపివేసే వారు. కానీ ఇప్పటిలా బరితెగించి మరీ కేసులు పెట్టేవారు కాదనే చెప్పాలి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం చంద్రబాబుకు కొత్తకాదు. అయితే, ఆ హామీలను అమలు చేయకపోయినా ఎవరూ వాటిని గుర్తు చేయకూడదు! అందుకోసం ఆయన నానా ప్రయత్నాలూ చేస్తుంటారు.2014లో రైతుల సంపూర్ణ రుణమాఫీ కావచ్చు.. కాపుల రిజర్వేషన్‌ ఉద్యమం కావచ్చు.. మరేదైనా కావచ్చు. చంద్రబాబు పంథా ఒక్కటే. తనకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే అనుకూల మీడియా చేత వాటిని అణచివేసే ప్రయత్నం చేయడం. అంశం ఏదైనా.. టీవీ ఛానళ్లలో అనుకూల ప్రచారమే సాగాలన్నది ఆయన ఆకాంక్ష. కాపుల రిజర్వేషన్‌ విషయమే తీసుకుందాం.. ఇచ్చిన హామీ అమలుకు ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపడితే ఆ విషయం ప్రజలలోకి వెళ్లనీయకుండా కొన్ని టీవీ చానళ్లను బ్లాక్ చేయడానికి యత్నించారు. ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అధికార పార్టీపై వ్యతిరేక వార్తలు రాయాలని జర్నలిస్టులకు నూరి పోస్తుంటారు. దానికి తగినట్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ఉన్నవి, లేనివి కల్పించి వార్తలు ఇచ్చేవి. ఈ మీడియా 2019-2024 మధ్యలో ముఖ్యమంత్రి జగన్‌పై కక్కినంత విషం బహుశా ప్రపంచంలోనే మరే మీడియా కక్కి ఉండదు. ఇందుకోసం పచ్చి అబద్ధాలు రాసేందుకూ వెనుకాడలేదు ఈ సంస్థలు.టీడీపీ మీడియా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్‌ను కించపరిచేలా కథనాలు ఇచ్చినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌ తదితరులు దారుణమైన వ్యాఖ్యలు చేసినా అప్పట్లో ఎవరిపై కేసులు పెట్టలేదు. కానీ 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు.. సాక్షి మీడియా అణచివేతకు యత్నిస్తూనే ఉన్నారు. పలువురు విలేకరులపై పోలీసు కేసులు నమోదవడం ఇందుకు నిదర్శనం. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఎప్పుడో మూడేళ్ల క్రితం శిలాఫలకం పడవేశారంటూ అప్పటి ఎమ్మెల్యేతోపాటు విలేకరిపై కూడా కేసు పెట్టారట. అప్పుడు ఏం చేశారో కాని, కూటమి అధికారంలోకి వచ్చాక, టీడీపీ, జనసేన వారు లెక్కలేనని శిలా ఫలకాలను ధ్వంసం చేసినా ఒక్క కేసు నమోదు కాలేదు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎవరెవరో ఫిర్యాదు చేయడం పోలీసులు హుటాహుటిన వైఎస్సార్‌సీపీ వారిని అరెస్టు చేయడం సాధారణమై పోతోంది.ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్‌ ‘రెడ్ బుక్’పేరుతో కక్ష రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ?. చాలా సింపుల్‌ ప్రభుత్వ తప్పులు ఎవరూ ఎత్తి చూపకూడదు. సూపర్ సిక్స్ తో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన 150 హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఎవరూ ప్రశ్నించకూడదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరుల అసత్యపు ప్రచారాన్ని ఎవరూ గుర్తు చేయకూడదు. ఏడాది తిరగకుండానే కూటమి ప్రభుత్వం చేసిన రూ.1.5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు? దేనికి ఖర్చుపెట్టారు? అని ఎవరూ అడగకూడదు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను ఎవరూ వెలికి తీయకూడదు. సాక్షి మీడియా ఇవన్నీ చేస్తున్నందునే చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టి దాడి చేస్తోంది.నిజానికి సాక్షి మీడియా ప్రతీ వార్తనూ ఆధార సహితంగానే రాస్తుంది. సౌర శక్తి ఒప్పందాలనే తీసుకుందాం. జగన్‌ హయాంలో యూనిట్‌కు రూ.2.49లకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఎల్లోమీడియా..లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగిపోయిందని ప్రచారం చేశాయి. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిందేమిటి? అదే విద్యుత్తును రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నారు. అంటే.. యూనిట్‌కు దాదాపు రెండు రూపాయలు ఎక్కువ పోసి కొంటున్నారన్నమాట. అయినా సరే.. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లో ఒక్క వార్త కూడా రాలేదు. సాక్షి మాత్రం పక్కా ఆధారాలతో జరిగిన అవినీతిని వివరించారు. సౌర శక్తి కొనుగోళ్ల విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది.అలాగే.. విశాఖలో టీసీఎస్‌కు 99 పైసలకు ఎకరా భూమి ఇవ్వడం, ఊరు, పేరు లేని ఒక కంపెనీకి అరవై ఎకరాలు కట్టబెట్టడం, అమరావతి రాజధాని నిర్మాణాల పేరుతో అధిక రేట్లకు ఇష్టారాజ్యంగా టెండర్లు కేటాయించడం, అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను కూడా తాకట్టు పెట్టడం పెన్షన్లు మినహా మరే హామీ అమలు చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి నెలకొనడం మొదలైన వార్తలను సాక్షి మీడియా ఇస్తోంది. ఏలికలకు ఇది పంటికింద రాయిలా మారింది. దీంతో సాక్షిని ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తోంది. ఈ క్రమంలో ఆధారాలు లేని మద్యం స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టుకు చంద్రబాబు.. పోలీసులను ప్రయోగించారు. నిందితులు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిలో ఉన్నారన్న అనుమానం వచ్చిందని పోలీసులు.. చెప్పా పెట్టకుండా విజయవాడలో ఆయన ఇంటిపై పడ్డారు. నిజంగా అలాంటి అనుమానం ఉంటే ఏమి చేయాలి? సెర్చ్ వారంటే ఇచ్చి సోదాలు చేయాలి. అసలు ఒక పత్రికా సంపాదకుడి ఇంటికి అంత ధైర్యంగా వెళ్లారంటే ఈ ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు.సాక్షి సిబ్బందిని మానసికంగా వేధించడానికి ఇలా చేసినట్లు తెలుసుకోవడం కష్టం కాదు. ఇంత మాత్రానికే సాక్షి మీడియా వణికిపోతుందా?. 2008 నుంచి సాక్షి మీడియా ఇలాంటి ఆటుపోట్లను ఎన్నింటినో ఎదుర్కొంది. ఈ మీడియాను దెబ్బతీయడానికి చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి ఎన్ని కుట్రలు పన్నింది.. ఎన్ని కేసులు పెట్టించింది తెలియనిది కాదు. 2014 టర్మ్‌లో కూడా సాక్షిని లేకుండా చేయాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. తిరిగి ఈ టర్మ్‌లో అంతకన్నా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలకు తెగిస్తున్నారు. ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి వాటిని సమర్థంగానే ఎదుర్కొన్నారు. పోలీసులు మూడు గంటలపాటు అక్కడ ఉన్నా వారికి ఏమీ దొరకలేదు. దాంతో వారు సైలెంట్‌గా వెళ్లిపోక తప్పలేదు. సెర్చ్ వారంట్ లేకుండా వెళ్లడం ద్వారా పోలీసులు దుశ్చర్యకు పాల్పడినట్లు అయింది.ఇక, ఎమర్జన్సీలో సైతం ఇందిరాగాంధీ ఇలాంటి పద్దతులు అనుసరించి మీడియా గొంతు నులమాలని విశ్వయత్నం చేశారు. కానీ, అంతిమంగా ఆమె ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. తొలుత ఇందిరాగాంధీ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత తెలుగుదేశంను తన అధీనంలోకి తెచ్చుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అవే పద్దతులు అవలంభిస్తున్నారు. చరిత్ర చెప్పిన పాఠాలను మర్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరికైనా ఓటమి తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Today Gold and Silver Price May 16th 20252
ఉన్నట్టుండి భారీగా పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి అనుకునే లోపే.. ఈ రోజు (మే 16) మళ్ళీ భారీగా పెరిగాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 87,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,130 వద్ద నిలిచాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు.. ఈ రోజు భారీగా పెరిగాయి. ఈ రోజు కూడా రూ. 1100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1200 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 1100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1200 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,200 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 95,130 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 87,350 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 95,280 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1100, రూ. 1200 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు (శుక్రవారం) కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: 365 రోజుల వ్యాలిడిటీ కోసం..

Eleven Movie Movie Review And Rating In Telugu3
‘లెవన్‌’ మూవీ రివ్యూ

నవీన్ చంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెవన్’. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. AR ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్,రేయా హరి నిర్మించిన ఈ చిత్రం నేడు(మే 16) తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘లెవన్‌’ కథేంటంటే.. అరవింద్‌(నవీన్‌ చంద్ర) ) ఓ సిన్సియర్‌ పోలీసాఫీసర్‌. ఏసీపీ హోదాలో వైజాగ్‌కి ట్రాన్స్‌ఫర్‌ అవుతాడు. వచ్చీరావడంతోనే ఓ దొంగతనం కేసును ఈజీగా సాల్వ్‌ చేస్తాడు. అదే సమయంలో వైజాగ్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. తొలుత ఈ కేసును ఏసీసీ రంజిత్‌ కుమార్‌ (శశాంక్‌) డీల్‌ చేస్తాడు. విచారణ మధ్యలోనే అతనికి యాక్సిడెంట్‌ అవుతుంది. దీంతో ఈ కేసు అరవింద్‌ చేతికి వస్తుంది. అతనికి సహాయంగా ఎస్సై మనోహర్‌ ఉంటాడు. వీరిద్దరు కలిసి చేసిన విచారణలో చనిపోయినవారంతా కవలలు అని, ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపుతున్నారని తేలుతుంది. ఈ హత్యలు చేస్తున్న సీరియల్‌ కిల్లర్‌ ఎవరు? ఎందుకు చేస్తున్నాడు? ట్విన్స్‌లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు? వారితో సీరియల్‌ కిల్లర్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఏసీపీ అరవింద్‌ ఈ కేసును ఎలా డీల్‌ చేశాడు? చివరకు హంతకుడిని పట్టుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. విలన్‌ క్రైమ్‌ చేయడం... పోలీసు అయిన హీరో ఆ కిల్లర్‌ని పట్టుకోవడం..అతనికో ప్లాష్‌ బ్యాక్‌ స్టోరీ..ఇలా ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్ల ఫార్మాట్‌ దాదాపు ఒకేలా ఉంటుంది. దీంట్లో క్రైమ్‌ జరిగిన తీరు.. వాటి చుట్టు అల్లుకున్న మైండ్‌ గేమ్‌, హీరో ఎంత తెలివితా ఈ కేసును ఛేధించాడనే అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సినిమాలకు బిగిస‌డ‌ల‌ని స్క్రీన్‌ప్లే అవసరం. ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా తలను పక్కకు తిప్పుకోకుండా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. ‘లెవన్‌’ ఈ విషయంలో ఇది కొంతవరకు సఫలం అయింది. విలన్‌ ప్లాట్‌ రొటీన్‌గా ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో వచ్చే ట్విస్టులను ముందుగా డీకోడ్‌ చేడయం కొంతవరకు కష్టమే. క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలను రెగ్యులర్‌గా చూసేవాళ్లు విలన్‌ ఎవరనేది కనిపెట్టినా.. వాళ్ల మైండ్‌తో కూడా గేమ్‌ ఆడేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది. సినిమా ప్రారంభంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. సీరియల్‌ కిల్లింగ్‌ కేసు హీరో చేతికి వచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అదే సమయంలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ ఇరికించినట్లుగా అనిపిస్తుంది. ప్రీఇంటర్వెల్‌ నుంచి కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెస్‌ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మధ్యలో వచ్చే ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ హృదయాలను హత్తుకుంటుంది. ఇక చివరిలో వచ్చే ట్వీస్టులు అదిరిపోతాయి. ఈ కథకి లెవన్‌ అనే టైటిల్‌ ఎందుకు పెట్టారనేదానితో పాటు ప్రతి సీన్‌కి లాజిక్‌ ఉంటుంది. మొత్తంగా ‘లెవన్‌’ సినిమా రొటీన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథే అయినా.. కథనం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. నవీన్‌ చంద్రకు పోలీసు పాత్రలు చేయడం కొత్త కాదు. ఈ మధ్య ఆయన ఎక్కువ ఇలాంటి పాత్రలే చేశాడు. ఇందులో ఏసీపీ అరవింద్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన బాడీలాంగ్వేజ్‌, లుక్‌ నిజమైన పోలీసుల అధికారిని గుర్తు చేసేలా ఉంటుంది. హీరోయిన్‌ రియా హరి పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ఎస్సై మనోహర్‌గా దిలీపన్‌, పోలీసు ఉన్నతాధికారిగా ఆడుకాలం నరేన్‌, ఏసీపీ రంజిత్‌ కుమార్‌గా శశాంక్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. కిరీటీ, రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. డి ఇమాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు ప్లస్‌ అయింది. తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంతా ఉన్నాయి.

Bangalore Varsha Travels Fraud Tirumala Devotees4
తిరుమల భక్తులకు ట్రావెల్స్ సంస్థ కుచ్చుటోపీ.. భక్తుల ఆవేదన

సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులకు బెంగళూరుకు చెందిన ట్రావెల్స్‌ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. బెంగళూరు నుండి తిరుపతికి రవాణా ఖర్చుతోపాటు దర్శనం కల్పిస్తామని నమ్మించిన భక్తులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దిక్కుతోచని స్థితిలో 35 మంది కన్నడ భక్తులు తిరుమలలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. తిరుమల కొండను టార్గెట్ చేసుకొని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మోసాలకు పాల్పడుతున్నాయి. తాజాగా బెంగళూరు నుండి తిరుపతికి రవాణా ఖర్చుతోపాటు దర్శనం కల్పిస్తామని బెంగళూరుకు చెందిన వర్షా ట్రావెల్స్ భక్తులను మోసం చేసింది. సర్వదర్శనం పేరుతో నకిలీ దర్శన టిక్కెట్లను వారికి ఇచ్చింది. ఒక్కొక్క భక్తుడి నుండి రూ.3,350 నగదు వసూలు చేసింది. టికెట్‌ ఉందని ధీమాతో భక్తులు తిరుమలకు వచ్చారు.తిరుమలకు వచ్చాక.. తీరా నకిలీ టికెట్లని తెలడంతో శ్రీవారి భక్తులు బోరుమంటున్నారు. 35 మంది కన్నడ భక్తులు దిక్కుతోచని స్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం, భక్తులు.. పోలీసులను ఆశ్రయించారు. వర్షా ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, భక్తులకు విక్రయించిన టికెట్లపై తిరుమల శ్రీవారి ఫొటో ఉండటం గమనార్హం.ఇదిలా ఉండగా.. తిరుమలలోని విష్ణు నివాసం అతిథి గృహంలో భారీ దొంగతనం జరిగింది. 32 గ్రాముల బంగారం, 40వేల నగదు, ఓ సెల్ ఫోన్‌ అపహరణకు గురైంది. ఈనెల 7న శ్రీవారి దర్శనం కోసం నెల్లూరు జిల్లా, మర్రిపాడుకు చెందిన విజయభాస్కర్ కుటుంబం తిరుమలకు వచ్చింది. వీరంతా.. రైల్వే స్టేషన్ సమీపంలోని విష్ణు నివాసం రూమ్ నెంబర్ 461లో బస చేశారు. రూమ్‌లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వీరి వస్తువులను దొంగతనం చేశాడు. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఈస్ట్ ఎస్సై మహేష్ తెలిపారు.

How Can MI Qualify For The Playoffs After IPL 2025 Resumption5
IPL 2025: ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు ఎలా చేరుతుంది..?

భారత్‌, పాక్‌ మధ్య యుద్దం కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్‌ 2025 రేపటి నుండి (మే 17) పునఃప్రారంభం కానుంది. కేకేఆర్‌, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో (బెంగళూరు) ఐపీఎల్‌ రీస్టార్‌ అవుతుంది. ఐపీఎల్‌ పునఃప్రారంభం నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఏయే జట్లకు దక్కే అవకాశం ఉందో అన్న దానిపై ఓ లుక్కేద్దాం.ప్రస్తుతం​ గుజరాత్‌, ఆర్సీబీ తలో 16 పాయింట్లు (11 మ్యాచ్‌ల్లో తలో 8 విజయాలు) ఖాతాలో కలిగి ఉండి ప్లే ఆఫ్స్‌ రేసులో ముందున్నాయి. ఇరు జట్లు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ఈ జట్ల ప్లే ఆఫ్స్‌ అవకాశాలు నల్లేరుపై నడకే అని చెప్పాలి. ఈ రెండు జట్లు మూడింటిలో తలో మ్యాచ్‌ గెలిచినా కనీసం మూడు, నాలుగు స్థానాల్లోనైనా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.ఇక మిగిలింది రెండు బెర్త్‌లు. ఈ రెండు బెర్త్‌ల కోసం ప్రధానంగా మూడు జట్ల మధ్య పోటీ ఉంటుంది. రేసులో పంజాబ్‌ కింగ్స్‌కు (11 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు) అవకాశాలు ఎక్కువగా ఉండగా.. ఢిల్లీ, ముంబైకి ఆతర్వాతి అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ముంబైతో పోలిస్తే ఢిల్లీకే కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింట్లు కలిగి ఉండగా.. ముంబై 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్న ఐదు జట్లలో ముంబై మినహా మిగతా నాలుగు జట్లు ఇంకా తలో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు ఎలా చేరుతుంది..?ఈ సీజన్‌లో ముంబై మరో 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ‍ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 14 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో ఉంది. ముంబై మిగిలిన రెండు మ్యాచ్‌లు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాల్సి ఉంది. ముంబై ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. వీరి టేబుల్ స్థానం మొదటి రెండు స్థానాల్లో ఉన్న గుజరాత్, ఆర్సీబీ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు జట్లు 22 పాయింట్లతో ముగించే అవకాశాలు ఉన్నాయి.ముంబై తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిస్తే, వారి ప్లే ఆఫ్స్‌ అవకాశాలు చాలా సంక్లిష్టమవుతాయి. ఒకవేళ ముంబై ఢిల్లీని ఓడిస్తే.. ఆతర్వాత పంజాబ్‌ కూడా ఢిల్లీని ఓడించాలి. అప్పుడు ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి వైదొలుగుతుంది. ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.ఒకవేళ ముంబై పంజాబ్‌ను ఓడించి ఢిల్లీ చేతిలో ఓడితే.. ఆతర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ కూడా పంజాబ్‌ను ఓడిస్తే పంజాబ్‌ ఇంటికి (పంజాబ్‌ రాజస్థాన్‌ చేతిలో కూడా ఓడాలి) ఢిల్లీ (17), ముంబై (16) ప్లే ఆఫ్స్‌కు చేరతాయి. ఒకవేళ ముంబై తమ రెండు మ్యాచ్‌ల్లో ఓడితే వారి ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే.కేకేఆర్‌, లక్నో కూడా రేసులోనే..!కేకేఆర్‌ (11), లక్నోకు (10) ప్లే ఆఫ్స్‌ అవకాశాలు లేనప్పటికీ.. టెక్నికల్‌గా ఆ జట్లకు ఇంకా ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ రెండు జట్లు తదుపరి ఆడాల్సిన అన్ని మ్యాచ్‌ల్లో (కేకేఆర్‌ 2, లక్నో 3) గెలవాల్సి ఉండటంతో పాటు.. ఈ జట్ల ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉన్నాయి.ఈ మూడు టీమ్‌లు ఔట్‌ఈ సీజన్‌లో సీఎస్‌కే, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించాయి. తదుపరి ఆడబోయే మ్యాచ్‌ల ఫలితాలతో ఈ జట్లకు ఒరిగేదేమీ లేనప్పటికీ.. ఈ జట్లు ఇతర జట్ల ప్లే ఆఫ్స్‌ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Did Donald Trump family sign a cryptocurrency deal with Pakistan6
ఆపరేషన్‌ సిందూర్‌కి ముందు ట్రంప్‌,పాక్‌ల మధ్య చీకటి ఒప్పందం?

వాష్టింగన్‌: పహల్గాంలో ఉగ్రదాడి, ఆ దాడిపై భారత చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. పాకిస్తాన్‌ ప్రభుత్వంతో జరిపిన ఓ చీకటి ఒప్పందం బట్టబయలైంది. ఆ చీకటి ఒప్పందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు సైతం సంబంధం ఉండడం మరింత అనుమానాలకు తెరతీసింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ మధ్య జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల వయసున్న (అప్పటికి ఏర్పాటు చేసి నెలరోజులే) క్రిప్టో కౌన్సిల్‌తో కుదుర్చుకున్న ఈ కంపెనీలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జారెడ్ కుష్నర్ కలిపి 60శాతం వాటా ఉంది. గత నెలలో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్‌, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌తో ఒప్పందం చేసుకున్నారని తెలిపే లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైతం ఉంది.ఆఘమేఘాల మీదఈ ఒప్పందం తర్వాత వరల్డ్‌ లిబర్టీ ఫైనాన్షియల్‌ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా కొద్ది రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తమ సలహాదారుగా బైనాన్స్ వ్యవస్థాపకుడు ఛాంగ్‌పెంగ్ జావోను పాక్‌ ప్రభుత్వం నియమించింది. ఘన స్వాగతం పలికిన ఆసిమ్ మునీర్ ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి పాకిస్తాన్‌కు వచ్చిన ఓ ప్రతినిధి బృందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా ఆ అమెరికన్‌ బృందానికి నాయకత్వం వహించింది మరెవరో కాదు ట్రంప్‌ అత్యంత సన్నిహితుడు,వ్యాపార భాగస్వామి స్టీవ్ విట్కాఫ్ కుమారుడు జాకరీ విట్కాఫ్. జాకరీ విట్కాఫ్‌ ప్రస్తుతంప్రస్తుత మిడిల్ ఈస్ట్‌కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. జాకరీ విట్కాఫ్‌ బృందం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో రహస్య సమావేశం సైతం నిర్వహించింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, ఆస్తుల టోకనైజేషన్, స్టేబుల్‌కాయిన్ అభివృద్ధి, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ పై పైలట్ ప్రాజెక్టులకు అనుమతి లభించనుంది. దీని ద్వారా పాకిస్తాన్‌లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణతో పాటు బ్యాంకింగ్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెట్టుబడులు, పెన్షన్ వంటి సేవల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. పాక్‌-ట్రంప్‌ చీకటి ఒప్పందంపై అనుమానంపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందంపై ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్‌ ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందానికి వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసింది. అయితే, ఈ ఒప్పందంపై అటు ట్రంప్ కుటుంబం, ఇటు వైట్ హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Earthquake of magnitude 4.5 strikes China7
Earthquake: చైనాలో భూకంపం

బీజింగ్‌: చైనాలో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది.భారత కాలమానం ప్రకారం ఉదయం 6:29 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. భూమి లోతులో 10 కిలోమీటర్ల లోపల భూకంపం నమోదైనట్లు ఎన్‌సీఎస్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు భూకంప వివరాలను ఎన్‌సీఎస్ తమ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈనెల మే 12న తెల్లవారుజామున 2:41 గంటలకు టిబెట్‌, చైనా పలు ప్రాంతాల్లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంపం భూమిలో 9 కిలోమీటర్ల లోతులో నమోదైంది.EQ of M: 4.5, On: 16/05/2025 06:29:51 IST, Lat: 25.05 N, Long: 99.72 E, Depth: 10 Km, Location: China. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/08mQNfOwyd— National Center for Seismology (@NCS_Earthquake) May 16, 2025

Congress MLA Kothur Manjunath doubts On Operation Sindoor8
ఆపరేషన్‌ సరే.. పహల్గాం నిందితులు చనిపోయారా?: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

బెంగళూరు: పాకిస్తాన్‌పై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌తో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. భారత దాడుల్లో మరణించింది ఎవరు?. పహల్గాంలో దాడి చేసిన వారు మృతుల్లో ఒక్కరైనా ఉన్నారా?. సరిహద్దులో ఎందుకు భద్రత లేదు?. పహల్గాం ఘటన జరిగిన తర్వాత వారు ఎలా తప్పించుకున్నారు? అని ప్రశ్నలు సంధించారు.కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోతూర్ మంజునాథ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌కు ఎలాంటి ప్రయోజనం అందించలేదు. ఈ ఆపరేషన్‌లో ఏమీ చేయలేదు. కేవలం గొప్పగా చూపించుకోవడానికే ఇదంతా చెబుతున్నారు. ఓ నాలుగు విమానాలు సరిహద్దులు దాటి వెళ్లి.. మళ్లీ తిరిగి వచ్చాయి. అంతే తప్ప ఇంకేమీ జరగలేదు. భారత దాడుల్లో మరణించిన వారు ఎవరు?. పహల్గాంలో దాడి చేసిన వారు మృతుల్లో ఎవరైనా ఉన్నారా?. అధికారులు ఒకటి చెబితే.. టీవీలు మరొకటి చెబుతున్నాయి. మరొకరు ఇంకేదో అంటున్నారు. మనం ఎవరిని నమ్ముతాము? అధికారిక ప్రకటన ఎక్కడ?’ అని ప్రశ్నించారు.అలాగే, భారత్‌ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎవరు నిర్ధారించారు?. మన సరిహద్దును దాటిన ఆ ఉగ్రవాదులు ఎవరు? వారి గుర్తింపు ఏంటి? సరిహద్దులో ఎందుకు భద్రత లేదు? వారు ఎలా తప్పించుకున్నారు? ఉగ్రవాద మూలాలు, శాఖలను గుర్తించి వాటిని నిర్మూలించాలి. పహల్గాం ఘటన పూర్తిగా నిఘా వైఫల్యమే. పహల్గాం దాడి బాధితుల కుటుంబాలకు న్యాయం చేయడంలో కేంద్రం​ విఫలమైంది. పహల్గాం బాధితులకు కేంద్రం పరిహారం ఇచ్చిందా?. కర్ణాటక, పాకిస్తాన్, చైనా లేదా బంగ్లాదేశ్‌లో ఎక్కడైనా పౌరులపై జరిగే దాడులను మేము వ్యతిరేకిస్తాం’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఈ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుందని చెప్పారు. పాక్‌ దాడులు చేస్తే తిరిగి దాడులు చేస్తామని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్‌’ పేరుతో పాకిస్తాన్‌, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. భారత్‌.. నూర్‌ఖాన్‌, రఫీకీ, షోర్కోట్‌, మురిద్‌, సుక్కోర్‌, సియాల్కోట్‌, పసురూర్‌, చునియన్‌, సర్గోదా, భోలారీ, జకోబాబాద్‌లో దాడులు చేసింది. దాడికి ముందు.. తర్వాత ఇక్కడినుంచి సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో నష్టం తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జకోబాబాద్‌లోని షాబాజ్‌ బేస్‌ చాలావరకు ధ్వంసమై కనిపిస్తోంది. ఇక భారత పదాతి దళం జరిపిన దాడిలో నియంత్రణ రేఖ వద్ద పాక్‌ సైనిక స్థావరాలు, ఉగ్ర బంకర్లు నాశనమయ్యాయి.

Fashion Tips: Wear trendy jewelry that matches your dress.9
జస్ట్‌ డ్రెస్సింగ్‌ మాత్రమే కాదు..ట్రెండ్‌కి తగ్గ ఆభరణాలతో మెరవండిలా..!

చక్కటి ఆభరణాలు వస్త్రధారణలో ఒక ముఖ్యమైన భాగం, ఇది దుస్తులను మెరిపించడం మాత్రమే కాదు డ్రెస్సింగ్‌ వెలవెల పోయేలా చేసే శక్తి కూడా కలిగి ఉంటుంది. మెరవాలంటే ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటే మాత్రమే సాధ్యం. అయితే ప్రతి సీజన్‌లో రకరకాల ట్రెండ్‌లు వస్తుండటంతో, ఏది అనుసరించాలో, ఏది వదిలివేయాలో ? అనే గందరగోళం తప్పదు. ఈ నేపథ్యంలో సిటీ జ్యువెలరీ డిజైనర్‌లు అందిస్తున్న సూచనలివి.. లేయరింగ్, స్టాకింగ్‌.. పలు రకాల లెంగ్త్‌ ఉన్న చైన్‌ పెండెంట్‌లను లేయర్‌లాగా ధరించవచ్చు. లేదా ఒకే వైపు పలు బ్రేస్‌లెట్‌లను ఒకటిగా పేర్చవచ్చు. ఆల్‌ పీసెస్‌ రంగులు కలిసి కనబడేలా చూసుకోవడమే ఖచి్చతమైన స్టాక్‌కు కీలకం. ఇవి ఒక సాధారణ బైండింగ్‌ కారకంగా ఉండాలి. షాండ్లియర్‌ చెవిపోగులు.. ఈ షాండ్లియర్‌ శైలి చెవిపోగులు అత్యధికంగా మహిళల్ని ఆకట్టుకుంటాయి. దుస్తులకు నప్పేలా అలంకరణకు ఇది సరైన మార్గం. వీటిని మరే ఇతర ఆభరణాలూ లేకుండా ధరించవచ్చు. డైమండ్‌ షాండ్లియర్స్‌ కావచ్చు లేదా జడౌ చంద్బాలిస్‌ కావచ్చు చెవిపోగులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. బోల్డ్‌ రింగులు.. ఒక పెద్ద డేరింగ్‌ రింగ్‌ ధరించడం రూపానికి అత్యాధునికతను జోడిస్తుంది. దీని కోసం ఓ అసాధారణమైన డిజైన్‌లను ఎంచుకోవాలి. రత్నం, సిగ్నెట్‌ పెద్ద వాస్తవిక పువ్వులు వంటివి మరింత అందాన్నిస్తాయి. జడౌ..జతగా.. ఏదైనా భారతీయ ఆభరణాల శైలిలో జడౌ నెక్లెస్‌ ధారణ తరతరాల వారసత్వంగా వస్తోంది. పూర్వ కాలంలో చాలా ఆభరణాలు మొఘల్‌ ఇతివృత్తంతో ప్రభావితమయ్యాయి, అయితే ప్రస్తుతం ఆధునిక ఆభరణాల తయారీలో పురాతన పద్ధతుల్లో ఏదైనా ఒకదానిని జత కలపడం ఒక ప్రత్యేకమైన కొత్త సంప్రదాయంగా మారింది. ఆ విధంగా జడౌ నెక్లెస్‌కు ఆదరణ పెరిగింది. ఆమె..ఆభరణం.. కాబోయే వధువు అయితే, పెళ్లి రోజు లుక్‌లో ఆభరణాలు అతి ముఖ్యమైన భాగం. పెళ్లి ఆభరణాలు, అవి ఏ వధువునైనా యువరాణిగా చూపించగలవు. పెళ్లి వేడుకల్లో భారీ నెక్‌పీస్‌ ఎంచుకుంటారు. అయితే ఇవి విడదీసి, ధరించగలిగేలా ప్రత్యేకంగా రూపొందుతాయి. అన్నీ కలిపినప్పుడు అవి గ్రాండ్‌లుక్‌ని సంతరించుకుంటాయి. అలాగే వివాహానంతరం కూడా వాటిని సందర్భానుసారం ధరించవచ్చు. ఆఫీస్‌..డైమండ్‌ పీస్‌.. పని విధానాలకు అనుగుణంగా అలాగే సాయంత్రం సమావేశాల్లో సమర్థవంతంగా మమేకమయ్యే అందమైన పీసెస్, సెన్సిటివ్‌ డైమండ్‌ హగ్గీలు లేదా సాలిటైర్‌ స్టడ్‌లు రోజువారీ డ్రెస్సింగ్‌కు సరైన ఎంపిక. ఆఫీసుకు ఇండియన్‌ ఫార్మల్స్‌ ధరించడం ఇష్టపడితే, డైమండ్‌ సరౌండ్‌తో లేదా ఒక జత సింగిల్‌ పోల్కీ ఇయర్‌ స్టడ్‌తో సరిపెట్టొచ్చు. (చదవండి: కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..)

Qataris Are Happy To Dump Their 747 On Trump10
మేపలేక ‘తెల్ల ఏనుగు’.. ట్రంప్ ముఖాన డంప్!

ప్రపంచంలో సొంతంగా అతి పెద్ద ప్రైవేట్ జెట్స్ శ్రేణి కలిగిన యజమానుల్లో ఖతార్ రాజకుటుంబం ఒకటి. తమకు ఆర్థిక భారంగా పరిణమించిన కొన్ని భారీ విమానాలను అది తాపీగా వదిలించుకుంటోంది. ప్రయోజనం లేని, నిర్వహణ భారం మితిమీరిన ‘తెల్ల ఏనుగు’ లాంటి తమ ‘బోయింగ్ 747 జంబో’ను అచ్చం రాజకుటుంబం లాగే పోషించగల డొనాల్డ్ ట్రంప్ లాంటి సరైన వ్యక్తిని ఖతార్ రాజకుటుంబం ఎట్టకేలకు పట్టుకోగలిగింది!. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి లబ్ధి పొందడానికే ఖతార్ అత్యంత విలాసవంతమైన విమానాన్ని ఆయనకు బహుమతిగా ఇస్తోందని ఊహాగానాలు వినిపించినా ఈ వ్యవహారం వెనక అసలు కారణం.. ఖతార్ రాజవంశీయులకు ఆ విమానంతో అవసరం తీరిపోవడం!. నిజానికి వారు 2020లోనే ఆ విమానాన్ని అమ్మకానికి పెట్టారు. కానీ, కొనుగోలుదారు దొరక్క విక్రయంలో విఫలమయ్యారు. తమకు అవసరం లేని ఆ ‘చెత్త’ విమానాన్ని ఇప్పుడు ట్రంప్ ముఖాన ‘డంప్’ చేస్తున్నారు కనుక వారికి నిర్వహణ ఖర్చులు, స్టోరేజి వ్యయం బాగానే తగ్గుతాయని వైమానికరంగ నిపుణులు అంటున్నారు. ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్టు.. అలా అటు ఖతార్ రాజకుటుంబానికి ఖర్చూ తగ్గింది, ఇటు ట్రంప్ కూడా ఫ్రీ గిఫ్టుతో ఉబ్పితబ్బిబ్బవుతున్నారు. మొత్తానికి ఖతార్ ఒక బోయింగ్ 747 జంబో పీడను ఇలా వదిలించుకుంది.ఇంకా ఇలాంటివే మరో రెండు విమానాలు దాని దగ్గరున్నాయి. పరిమాణంలో పెద్దవైన, సుందరంగా అలంకరించిన, వాడకపోయినా నిరంతరం సరైన స్థితిలో (కండిషన్లో) ఉంచాల్సిన, ఇంధనం విపరీతంగా తాగే, పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు ఉద్దేశించిన ఇలాంటి విమానాలకు డిమాండ్ పడిపోయిందని తాజా ఉదంతం చాటుతోంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఈ విమానాలను కొనేవారు లేరు. అందుకే రాజకుటుంబాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు దశాబ్ద కాలంగా ఈ ‘తెల్ల ఏనుగు’లను వదిలించుకునే పనిలో ఉన్నాయి.Qatar gifted this Boeing 747 Jumbo Jet to the US defence department during the visit of Presidnet Donald Trump. pic.twitter.com/d5ad0k2Q0M— Aftab Chaudhry (@AftabCh81) May 15, 2025ఇతర ఆధునిక దేశాల మాదిరిగానే ఖతార్ కూడా ప్రస్తుతం నాజూకైన, బహుళ ప్రయోజనకర, ఆర్థిక అంశాలు కలిసొచ్చే, అధికారిక ప్రయాణాలకు అనువుగా ఉండే విమానాల వైపు మొగ్గు చూపుతోందని దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఏవియేషన్ కన్సల్టింగ్ సంస్థ ‘బీఏఏ & పార్టనర్స్’ మేనేజింగ్ డైరెక్టర్ లైనస్ బాయర్ ‘ఫోర్బ్స్’కు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడికి బోయింగ్ 747-8 విమానాన్ని ఖతార్ అప్పగించడాన్ని ఓ ‘సృజనాత్మక పరిష్కార వ్యూహం’గా, ‘ఆకాశంలో పోటాపోటీ బలప్రదర్శన అనే గతించిన నమూనాకు వీడ్కోలు’గా బాయర్ అభివర్ణించారు.అంతా ‘ఆయిల్ అండ్ గ్యాస్’ మహిమ!సౌదీ అరేబియా పక్కనే పర్షియన్ సింధుశాఖలో సుమారుగా అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్ర భూభాగం సైజులో ఉంటుంది ఖతార్ ద్వీపకల్పం. చమురు, సహజ వాయువు నిక్షేపాలు తెచ్చిపెట్టిన సంపద ఈ దేశాన్ని తలసరి జీడీపీ పరంగా ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలబెట్టింది. అటు ఖతార్ పాలకులనూ ఆగర్భ శ్రీమంతులను చేసింది. అలా ఖతార్ ఎమిర్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని కుటుంబం సిరి సంపదలతో అలరారుతోంది. దీంతో దాదాపు డజను ఎయిర్ బస్, బోయింగ్ విమానాల శ్రేణిని థాని కుటుంబం సమకూర్చుకుంది. కొద్దిమంది వ్యక్తులు విలాసవంతమైన ప్రయాణాలు చేయడానికి వీలుగా ఆ విమానాలకు మార్పులు చేయించారు.ఇవి కాకుండా రాజ కుటుంబానికి చిన్నపాటి బంబార్డియర్, డసాల్ట్ బిజినెస్ జెట్స్ ఎలాగూ ఉన్నాయి. ట్రంప్ కు బహూకరించిన 747 విమానం తోకపై ‘ఏ7-హెచ్బీజే’ (A7-HBJ) అని ఉంటుంది. 2007 నుంచి 2013 వరకు ఖతార్ ప్రధానమంత్రిగా వ్యవహరించిన హమద్ బిన్ జసిమ్ బిన్ జబర్ అల్ థాని పేరులోని తొలి మూడు పదాల ప్రధమ అక్షరాలను ‘హెచ్బీజే’ (HBJ) స్ఫురింపజేస్తుంది.ప్రస్తుతం ఖతార్ ‘రాజ’ విమానాల శ్రేణిలో ఉన్న మూడు 747-8 విమానాల్లో ఈ విమానం ఒకటి. ‘ఖతార్ అమీరీ ఫ్లైట్’ సంస్థ దీని నిర్వహణను చూస్తోంది. 13 ఏళ్ల కిందట 2012లో కొనుగోలు చేసినప్పుడు ఈ విమానం ఖరీదు 367 మిలియన్ డాలర్లు. అంటే రూ.3,130 కోట్లు. కొన్న తర్వాత మూడేళ్లపాటు వందల కోట్లు కుమ్మరించి విమానం లోపలి స్వరూపాన్ని (ఇంటీరియర్) సుందరంగా తీర్చిదిద్దారు. సాధారణ బోయింగ్ 747-8 విమానంలో 467 మంది ప్రయాణించవచ్చు. కానీ ‘ఎగిరే ప్యాలెస్’గా అభివర్ణిస్తున్న ‘హెచ్బీజే’లో 89 మంది మాత్రమే ప్రయాణించేలా మార్పులు చేసి హంగులు అద్దారు. రెండు పడక గదులు, వినోద గది, సమావేశ గదులు అందులో ఉన్నాయి.ఎగిరితే గంటకు రూ.20 లక్షల ఖర్చు!బోయింగ్ తయారుచేసే 747 సిరీస్ విమానాలు 1970 నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. వైమానిక దూర ప్రయాణాలను అవి ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చాయి. అయితే పెరుగుతున్న ఇంధనం ధర ఆకాశవీధిలో ఈ నాలుగు భారీ ఇంజిన్ల విమానం ప్రయాణాన్ని వ్యయభరితంగా మార్చింది. ‘కార్పొరేట్ జెట్ ఇన్వెస్టర్’ అంచనా ప్రకారం 747-8 వీఐపీ వెర్షన్ విమానాన్ని ఆపరేట్ చేయడానికి గంటకు 23 వేల డాలర్లు (రూ.20 లక్షలు) ఖర్చవుతుంది. వ్యయభారం తట్టుకోలేక గత దశాబ్ద కాలంగా పలు విమానయాన సంస్థలు బోయింగ్ 747, నాలుగు ఇంజిన్ల ఎయిర్ బస్ ఏ340 విమానాలను సేవల నుంచి తప్పిస్తున్నాయి. వీటి బదులుగా రెండు ఇంజిన్లు గల వెడల్పాటి బోయింగ్ 787, ఎయిర్ బస్ ఏ350 విమానాలపై ఆధారపడుతున్నాయి. నాలుగు ఇంజిన్ల 747 సిరీస్ విమానాలు ఇంధనాన్ని విపరీతంగా తాగుతాయి!.ఈ ‘ఎగిరే భవనాలు’ను ఒక్క ఖతారే కాదు.. సౌదీ అరేబియా, బ్రూనై, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ కూడా క్రమంగా వదిలించుకుంటున్నాయి. తక్కువ ఇంధన సామర్థ్యం అటుంచి పెద్ద విమానాలతో భద్రతాపరమైన సమస్యలున్నాయని, వాటిని పెద్ద లక్ష్యాలుగా ఎంచుకునే ప్రమాదం ఉందని ఏరోడైనమిక్ అడ్వైజరీ మేనేజింగ్ డైరెక్టర్ రిచర్డ్ అబౌలాఫియా చెప్పారు. పెద్ద విమానాలు దిగాలంటే పొడవైన రన్ వేలు కావాలని, దాంతో ఆ విమానాల వినియోగం పరిమితమేనని వివరించారు. సన్నటి విమానాలకైతే చాలా ఎయిర్ పోర్టులు, సంప్రదాయ బిజినెస్ జెట్స్ అయితే మరిన్ని విమానాశ్రాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. 2020లో మార్కెట్లో అమ్మకానికి పెట్టడానికి ముందు ఐదేళ్లలో ఖతారీ విమానం ప్రయాణించింది మొత్తం కలిపి 1,059 గంటలే.ఇక ఖతార్ దగ్గరున్న మిగతా రెండు వీఐపీ 747-8 విమానాల్లో ఒకదాన్ని పూర్తిగా క్రియాశీల సేవల తప్పించారని లైనస్ బాయర్ తెలిపారు. 2018లో ఖతార్ ఇలాంటి 747-8 విమానాన్నే తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కు కూడా ఇచ్చింది. మరో పాత 747-ఎస్పీ విమానాన్ని ఓ అసెట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పగించగా దాన్ని ఆ సంస్థ స్టోరేజికి తరలించింది. ఇలాంటి ఉదాహరణలు బోలెడు. సౌదీ యువరాజు సుల్తాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సాద్ 2011లో మరణించాడు. అతడి మరణానికి ముందు ఓ విలాసవంతమైన 747-8 విమానాన్ని అతడి కోసం సేవల్లోకి తీసుకున్నారు. కేవలం 42 గంటలే ప్రయాణించిన ఆ విమానాన్ని చివరికి 2022లో తుక్కు కింద ముక్కలు చేశారు. ప్రస్తుతం సౌదీలో రాజకుటుంబ ఉపయోగంలో ఉన్న 747 విమానాల శ్రేణిని ఒకే ఒక విమానానికి కుదించారు. సౌదీ యువరాజు మఃహమ్మద్ బిన్ సాల్మన్ ప్రస్తుతం బోయింగ్ 737, 787-8 వంటి చిన్న విమానాలు వినియోగిస్తున్నారు.అయితే లోపల ఖాళీ ప్రదేశం అధికం కనుక బోయింగ్ 747-8లకు సరకు రవాణా (కార్గో) రంగంలో మంచి డిమాండ్ ఉంది. 2023లో కర్మాగారం నుంచి బయటికొచ్చిన చివరి 747-8తో కలిపి బోయింగ్ ఇప్పటివరకు మొత్తం 155 విమానాలను విక్రయించగా వాటిలో రెండొంతులు సరకు రవాణాలోనే నిమగ్నమయ్యాయి. కేవలం కొద్దిమంది దూర ప్రయాణాల కోసమని స్వరూపం పరంగా, యాంత్రికంగా, కస్టమ్ ఇంటీరియర్స్ పరంగా మార్పులు చేసిన ఖతారీ 747-8 విమానాలను కార్గో విమానాల రూపంలోకి తేవడం కష్టమని బాయర్ అభిప్రాయం వెలిబుచ్చారు. ఇక బహుమతిగా ట్రంప్ స్వీకరిస్తున్న ఖతార్ విమానాన్ని పరికిస్తే... భద్రతపరమైన నిబంధనలను సడలిస్తే తప్ప... ఆ విమానాన్ని విడదీసి పునర్నిర్మించడానికి కనీసం ఐదేళ్లు పడుతుందని రిచర్డ్ అబౌలాఫియా అంచనా. అంటే అప్పటికి అధ్యక్షుడిగా ట్రంప్ రెండో విడత పుణ్యకాలం... ఆ విమానంలో తిరగాలనే ఆయన బులపాటం తీరకుండానే ముగిసిపోతుంది! - జమ్ముల శ్రీకాంత్ Source: Forbes

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement