Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Bumana Karunakara Reddy Other Leaders House Arrest In Tirupati1
తిరుపతిలో ఉద్రిక్తత.. భూమన ఇంటికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు

గోశాలకు భూమన అప్‌డేట్స్‌.. తిరుపతి..👉పద్మావతి పురంలో భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్న ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి👉తిరుపతి మేయర్‌ డాక్టర్‌ శిరీషను హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు.👉భూమన అభినయ రెడ్డి కామెంట్స్‌..భూమన ఒక్కరైనా గోశాలకు వెళ్తారు.తిరుమల శ్రీవారి ప్రతిష్టను కాపాడాలి.కూటమి సర్కార్‌ సవాల్‌ను మేము స్వీకరిస్తే ఎందుకు అనుమతించడం లేదు?.👉కూటమి సర్కార్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. తాజాగా తిరుపతి నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద తిరుచానూరు పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. భూమనతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హౌస్ అరెస్ట్ చేశారు.👉వివరాల ప్రకారం.. తిరుపతి నగరంలో ఉద్రిక్తత నెలకొంది. గోశాల గోవుల మృతిపై కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోంది. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని భూమనకు టీడీపీ సవాల్‌ చేసింది. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని వ్యాఖ్యానించింది. దీంతో, టీడీపీ ఛాలెంజ్‌ను భూమన కరుణాకర్‌రెడ్డి స్వీకరించారు. ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన తెలిపారు. ఈ క్రమంలో భూమనతో పాటు, తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు.👉మరోవైపు.. భూమన హౌస్‌ అరెస్ట్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు మాట్లాడారు. ఈ క్రమంలో భూమన కరుణాకరరెడ్డి రెడ్డి ఒక్కరినే గోశాలకు అనుమతిస్తామని హుకుం జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు గోశాలకు వెళ్ళాలని సూచించారు. 👉ఇదిలా ఉండగా.. అంతకుముందు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ను భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు అని భూమన మండిపడ్డారు.👉కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటిళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్‌ కెమెరాల హల్‌చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు.

No Indian Names in TIMEs Most Influential Leaders List 2025 Check Details2
టైమ్స్ జాబితాలో భారతీయులకు దక్కని చోటు!

ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్‌ మ్యాగజైన్‌(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. వంద మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అయితే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది భారతీయులెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.2025కి గానూ మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్‌ జాబితాను టైమ్‌ మ్యాగజైన్‌ విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌, నోబెల్‌ బహుమతి గ్రహీత.. బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, టెస్లా సీఈవో ఇలాన్‌ మస్క్‌ తదితరులకు చోటు దక్కింది. జిమ్నాస్ట్ సిమోన్‌ బైల్స్‌, పాపులర్‌ సింగర్‌ ఈద్‌ షరీన్‌, ఏఐ దిగ్గజం డెమిస్ హస్సాబిస్(Demis Hassabis) తదితరుల పేర్లు ఉన్నాయి.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారత్‌ నుంచి ఈ ఏడాది జాబితాలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. గతంలో.. షారూఖ్‌ ఖాన్‌, అలియా భట్‌, సాక్షి మాలిక్‌(రెజ్లర్‌) పేర్లు ఈ జాబితాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య సంవత్సరాల్లో ఇలా భారతీయుల పేర్లు లేకపోవడం ఇదే తొలిసారి. ఈసారి విశేషం ఏంటంటే.. నేరుగా భారతీయులకు చోటు దక్కకపోయినా భారత సంతతికి చెందిన వర్టెక్స్‌ ఫార్మాసూటికల్స్‌ సీఈవో రేష్మా కేవలరమణి(Reshma Kewalramani) పేరు ఈ జాబితాలోకి ఎక్కింది. రేష్మ ముంబైలో పుట్టారు. ఆమెకు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడింది. రేష్మా కేవలరమణి(52)టైమ్‌ జాబితాకు ప్రాధాన్యత ఎందుకు?టైమ్‌ మ్యాగజైన్‌ అనేది న్యూయార్క్‌ కేంద్రంగా నడిచే వార్త ప్రచురణ సంస్థ. 1923 మార్చి 3వ తేదీన ఇది ప్రారంభమైంది. సమకాలీన వార్తలకు పాఠకులకు అందించే ఉద్దేశంతో హెన్రీ లూస్‌, బ్రిటన్‌ హాడెన్‌ దీనిని స్థాపించారు. కాలక్రమేణా దీనికి ప్రపంచస్థాయి ఆదరణ లభించింది. అనేక రంగాలను మలుపు తిప్పిన వ్యక్తుల పేర్లతో ప్రతీ ఏటా జాబితా విడుదల చేస్తూ వస్తోంది టైమ్స్‌ మ్యాగజైన్‌. అలా..అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను 1999లో తొలిసారి రిలీజ్‌ చేసింది టైమ్‌ మ్యాగజైన్‌. మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ జాబితా గురించి విస్తృతంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే 2004 నుంచి క్రమం తప్పుకుండా ప్రతీ ఏడాది జాబితాను విడుదల చేస్తూ వస్తోంది టైమ్‌ మ్యాగజైన్‌.

No Police Protection for Marrying Against Parents Wishes says Allahabad High Court3
తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం.. హైకోర్టు తీర్పుతో దంపతులకు షాక్!

లక్నో: ‘మీరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి (love marriage) చేసుకున్నారు. అలాంటప్పుడు మీకెందుకు పోలీస్‌ భద్రత ఇవ్వాలి. మేం ప్రేమ వివాహం చేసుకున్నాం కాబట్టి తల్లిదండ్రుల నుంచి ముప్పు ఉందని పోలీస్‌ సెక్యూరిటీ అడిగితే ఇవ్వలేం. మీ జీవితానికి, స్వేచ్ఛకు నిజమైన ముప్పు ఉందని మేం భావిస్తే అప్పుడు మీకు పోలీసులు భద్రత కల్పిస్తారు’ అంటూ అలహాబాద్‌ హైకోర్టు (allahabad high court) కీలక తీర్పును వెలువరించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ప్రేమవివాహం చేసుకున్న దంపతుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్ 4న ఓ కీలక తీర్పును వెలువరించింది. ‘తాము ప్రేమవివాహం చేసుకున్నామని, తల్లిదండ్రుల నుంచి భయాందోళనలు ఉన్నాయంటూ శ్రేయా కేసర్వాని అనే మహిళ తన భర్తతో కలిసి తమకు పోలీసు రక్షణ కల్పించాలని’ కోరుతూ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఆ పిటిషన్‌పై న్యాయమూర్తి సౌరభ్ శ్రీవాస్తవ విచారణ చేపట్టారు. విచారణలో.. మీ జీవితానికి, మీ స్వేచ్ఛకు భంగం కలిగించేలా బెదిరింపులు వస్తే పోలీసులు రక్షణ కల్పించవచ్చు. అలాంటి బెదిరింపులు లేకుండా, కేవలం తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నారని చెప్పి రక్షణ కోరడం తగదని స్పష్టం చేసింది.దంపతులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్న విషయాలను పరిశీలించిన అనంతరం, దంపతులకు ప్రాణ భయమేమీ లేదని, వారికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని, పైగా వారి బంధువులు ఎటువంటి మానసిక లేదా శారీరక హానిని కలిగించే అవకాశం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.అలాగే, తమకు బెదిరింపులు వస్తున్నాయని సంబంధిత పోలీసులకు ముందుగా ఫిర్యాదు చేయకపోవడం కూడా పరిగణనలోకి తీసుకుంది. అయితే, చిత్రకూట్ జిల్లా ఎస్పీకి రక్షణ కోరుతూ వినతి పత్రం ఇచ్చిన విషయాన్ని గుర్తించింది. పోలీసులు అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సామాజికంగా ఎదురయ్యే సమస్యలను దంపతులు ఎదుర్కొని, పరస్పరం అండగా ఉండడం నేర్చుకోవాలి’ అని కోర్టు సూచించింది.అంతేకాదు..ప్రేమ పెళ్లి చేసుకున్న యువతకు న్యాయస్థానాలు కేవలం రక్షణ కల్పించేందుకు మాత్రమే లేవు’ అంటూ గతంలో ఈ తరహా పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (supreme court of india) చేసిన వ్యాఖ్యల్ని ఉదహరించింది.

RR captain Sanju Samson provides big update on injury4
మ్యాచ్ మ‌ధ్య‌లోనే రిటైర్డ్ హర్ట్‌.. గాయంపై అప్‌డేట్ ఇచ్చిన శాంస‌న్‌

ఐపీఎల్‌-2025లో తొలి సూప‌ర్ ఓవ‌ర్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికైంది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌పించింది. ఇరు జ‌ట్లు స‌మవుజ్జీల‌గా పోటీ ప‌డిన ఈ మ్యాచ్ ఫలితాన్ని సూప‌ర్ ఓవ‌ర్‌లో తేల్చారు. సూప‌ర్ ఓవ‌ర్‌లో రాజ‌స్తాన్‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ విక్టరీ సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. అనంత‌రం రాజ‌స్తాన్ కూడా స‌రిగ్గా 188 ప‌రుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. సూప‌ర్ ఓవ‌ర్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ 11 ప‌రుగులు చేసింది.రెండు ర‌నౌట్లు అయ్యి నాలుగు బంతులే ఆడి త‌మ ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆ త‌ర్వాత 12 ప‌రుగుల టార్గెట్‌ను నాలుగు బంతులు ఆడి మ్యాచ్‌ను ముగించింది. కాగా ఈ మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ రిటైర్డ్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. 189 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో సంజూ అద్బుత‌మైన ట‌చ్‌లో క‌న్పించాడు. య‌శ‌స్వి జైశ్వాల్‌తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. కానీ అనుహ్యంగా శాంస‌న్ గాయ‌ప‌డ్డాడు. 6 ఓవ‌ర్ వేసిన విప్రజ్ నిగ‌మ్ బౌలింగ్‌లో శాంస‌న్ కట్ షాట్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించాడు. అతను బంతిని మిస్ అయ్యాడు. వెంట‌నే శాంస‌న్ త‌న పక్కటెముకల నొప్పితో బాధ‌ప‌డ్డాడు. వెంట‌నే ఫిజియో వ‌చ్చి అత‌డికి చికిత్స అందించాడు. ఆ తర్వాతి బంతిని ఆడిన శాంస‌న్‌.. ప‌రిగెత్త‌డానికి చాలా ఇబ్బంది ప‌డ్డాడు. ఈ క్ర‌మంలోనే రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వెనుదిరిగాడు. అనంత‌రం సూప‌ర్ ఓవ‌ర్‌లో కూడా బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌కు సంజూ రాలేదు. అయితే మ్యాచ్ ముగిసిన త‌ర్వాత శాంస‌న్ త‌న గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు."ప్ర‌స్తుతం బాగానే ఉన్నాను. ఇప్పుడు మ‌రీ అంత నొప్పిగా లేదు. కానీ ఆ స‌మ‌యంలో తిరిగి వచ్చి బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా లేను. మా త‌ర్వాతి మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల స‌మయం ఉంది. అంత‌లో పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాను" అని శాంస‌న్ ధీమా వ్య‌క్తం చేశాడు.. శాంస‌న్ కేవ‌లం 19 బంతుల్లోనే 31 ప‌రుగులు చేశాడు.

Chandrababu TDP Govt Power Charges increased by more than 50 percent5
గుండె గు‘బిల్లు’

‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! మేం అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచం..! పైగా తగ్గిస్తాం..! నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసి ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పా?’ అంటూ మాట మార్చేశారు. ఎడాపెడా విద్యుత్‌ షాక్‌లిస్తున్నారు. ఎండలకు తాళలేక ఇంట్లో ఫ్యాన్‌ కింద సేదతీరుదామనుకుంటున్నారా..?కూలర్‌ దగ్గర కాసేపు చల్లగా గడుపుదామనుకుంటున్నారా..? కరెంట్‌ కోతలు.. ఉక్కపోత భరించలేక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నారా? కానీ మీరు ఏం చేసినా కరెంట్‌ షాక్‌లు మాత్రం ఖాయం..!!ఎందుకంటే.. అసలు కరెంట్‌ వాడకున్నా.. ఇళ్లకు తాళాలు వేసినా సరే.. కరెంట్‌ చార్జీలు మాత్రం చుర్రుమంటున్నాయి! మండుతున్న ఎండలతోపాటే బిల్లులూ భగ్గుమంటున్నాయి! టీడీపీ కూటమి సర్కారు కరెంట్‌ చార్జీల బాదుడే బాదుడు కొనసాగుతోంది!!సాక్షి, అమరావతి: ‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! మేం అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచం..! పైగా తగ్గిస్తాం..! నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసి ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పా?’ అంటూ మాట మార్చేశారు. ఎడాపెడా విద్యుత్‌ షాక్‌లిస్తు­న్నారు. ఏడాది వ్యవధిలో పెరిగిపోయి భగ్గుమంటు­న్న బిల్లులే ఇందుకు నిదర్శనం. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.15,485.36 కోట్ల విద్యుత్తు భారాన్ని ప్రజలపై మోపారు. గతే­డాది చివరి నుంచే రూ.6,072.86 కోట్ల చార్జీల భా­రాన్ని వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో రూ.9,412.50 కోట్ల బాదుడు మొదలైంది. గతేడాదితో పోలిస్తే రెట్టింపు చార్జీలతో బిల్లులు జారీ అవుతున్నాయి. అసలే కూటమి ప్రభు­త్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండగా దానికి తోడు విద్యుత్‌ చార్జీలు పెంచడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాడుకున్న విద్యుత్తుకు, వస్తున్న బిల్లులకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఇదెక్కడి దారుణమని మండిపడుతున్నారు. చార్జీల భారం మోపని గత ప్రభుత్వం..వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు విద్యుత్‌ చార్జీలు పెంచకుండా ప్రజలకు ఊరట కల్పించింది. వ్యవసాయ అవసరాలకు పెద్ద పీట వేస్తూ 9 గంటల పాటు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసింది. 6,663 వ్యవసాయ విద్యుత్తు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు వ్యయం చేసింది. గతంలో టీడీపీ సర్కారు రైతులకు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్‌ బకాయిలను సైతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. వివిధ వర్గాల పేదలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను అందచేసింది. రాష్ట్రంలోని 2 కోట్ల మంది విద్యుత్‌ వినియోగదా­రులపై ఎలాంటి విద్యుత్‌ చార్జీల భారం లేకుండా టారిఫ్‌ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదించేలా నాడు వైఎస్‌ జగన్‌ టారిఫ్‌ భారాలను సైతం భరించారు.పొంతన లేని బిల్లులుకర్నూలు జిల్లా కల్లూరు సెక్షన్‌ పరిధిలో నివసించే ఎస్‌.శిరీష ఈ ఏడాది ఫిబ్రవరిలో 125 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. ఈ లెక్కన ఆమెకు రావాల్సిన బిల్లు రూ.489.50 మాత్రమే. కానీ వచ్చిన బిల్లు మాత్రం ఏకంగా రూ.850. అంటే రూ.361 మేర కరెంట్‌ చార్జీ పెరిగింది.చిత్తూరుకి చెందిన జేజులరెడ్డి (సర్వీసు నంబర్‌ 3457) ఇంట్లో రెండు ఫ్యాన్లు, మూడు ట్యూబ్‌లైట్లు, టీవీ, కూలర్‌ ఉన్నాయి. కరెంట్‌ బిల్లులను పరిశీలిస్తే గతేడాదికి, ఇప్పటికి భారీ వ్యత్యాసం ఉంది. గతేడాది మార్చిలో 177 యూనిట్లకుగానూ ఆయనకు రూ.1,015 బిల్లు వచ్చింది. యూనిట్‌కు రూ.5.74 చార్జీ పడింది. ఈ ఏడాది మార్చిలో 563 యూనిట్లకు రూ.4,584 బిల్లు వేశారు. యూనిట్‌కు ఏకంగా రూ.8.14 వసూలు చేశారు. రూ.1,335.49 అదనంగా బిల్లు రావడంతో వినియోగదారుడు 39 శాతం అధిక భారం భరించాల్సి వచ్చింది.‘ఈ ఏడాది కరెంటు బిల్లులు భారీగా పెరిగాయి. గతేడాది జనవరిలో 124 యూనిట్లు వాడినందుకు రూ.657 బిల్లు వచ్చింది. అంటే యూనిట్‌ రూ.5.29 పడింది. అదే ఈ ఏడాది జనవరిలో 165 యూనిట్లు వాడినందుకు ఏకంగా రూ.1,271 బిల్లు కట్టమంటున్నారు. యూనిట్‌కు రూ.7.70 వసూలు చేస్తున్నారు. కరెంట్‌ చార్జీ ఏకంగా రూ.614 పెరిగింది.’ – ఎం.సిలార్, మచిలీపట్నం‘‘పదేళ్లుగా పిండి మిల్లు నిర్వహిస్తూ బతుకుతున్నాం. గత ఏడాది నవంబర్‌లో నెలకు రూ.4,881 మాత్రమే ఉన్న కరెంటు బిల్లు ఈ ఏడాది మార్చిలో ఒక్కసారిగా రూ.13,440 కు పెరిగింది. మేం అప్పుడు ఇప్పుడూ ఒకేలా వాడుతున్నాం. అయినా ఎందుకు అంతంత బిల్లు వస్తోందో అంతు­బట్టడం లేదు. ఇలాగైతే పిండి మిల్లు మూతపడి మా కుటుంబం రోడ్డు పాలవుతుంది’’ –రేలంగి వెంకటలక్ష్మి, వికేరాయపురం, కాకినాడ జిల్లా.వాడకం తగ్గినా.. బిల్లు పెరిగిందిశ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉంటున్న సువ్వారి జగదీష్‌ ఇంటికి 2024 మార్చిలో 216 యూనిట్లకు గానూ రూ.1,108 బిల్లు వచ్చింది. అంటే యూనిట్‌కు రూ.5.12 పడింది. ఇదే వినియోగదారుడు ఈ ఏడాది మార్చిలో 171 యూనిట్లు వినియోగించారు. దాని ప్రకారం రూ.875.52 మాత్రమే బిల్లు రావాలి. వినియోగం తగ్గినప్పుడు సాధారణంగా బిల్లు కూడా తగ్గాలి. కానీ అందుకు భిన్నంగా బిల్లు పెరిగి రూ.1,286 వచ్చింది. గతేడాది ధర (టారిఫ్‌)ల్లో ఏ మార్పూ జరగలేదని, చార్జీలు పెంచలేదని కూటమి ప్రభుత్వం చెబుతున్నా కరెంటు బిల్లు మాత్రం భారీగా పెరిగింది.వాడకున్నా వాతలే..!‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న మసీదు జిలానీ గుంటూరు జిల్లా మేడికొండూరులోని ఇంటిలో కొద్ది నెలలుగా నివసించడం లేదు. కానీ 2 యూనిట్ల విద్యుత్‌ వినియోగా­నికి రూ.182 చార్జీ పడింది. తాను అసలు విద్యుత్‌ వాడనే లేదని జిలానీ మొత్తుకుంటున్నారు.కొందరు సొంత ఇంటిని వదిలి కుటుంబంతో దూర ప్రాంతాల్లో గడుపుతుంటారు. ఖాళీగా ఉన్న ఇళ్లలో విద్యుత్‌ వినియోగం ఉండదు. అయినా సరే అలాంటి నివాసాలకు జీరో యూనిట్‌ కింద రూ.91 బిల్లు పంపుతున్నారు. విద్యుత్‌కు సైతం వడ్డన తప్పడం లేదు.మాట మార్చారు.. మాట తప్పారువిద్యుత్‌ చార్జీలపై ఎన్నికల ముందు ప్రతి చోటా మైకు పట్టుకుని చంద్రబాబు మాట్లాడిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన చేస్తున్న పనులకు పొంతన లేదు. అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచేది లేదని,అవసరమైతే వినియోగదారులే విద్యుత్‌ను అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలకు అర్ధమే లేదు. అధికారం చేపట్టి ఐదు నెలలు కాకుండానే విద్యుత్‌ చార్జీలపై ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన రోజే ‘చార్జీలు పెంచమని నేనెప్పుడు చెప్పాను’ అంటూ మాట మార్చేశారు. తాజాగా దీపావళి కానుకగా రాష్ట్ర ప్రజలపై రూ.6072.86 కోట్ల భారం వేశారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు గతంలో విద్యుత్‌ చార్జీలపై మాట్లాడిన మాటల్లో మచ్చుక్కి కొన్ని..16 ఫిబ్రవరి 2023, పెద్దాపురం తమ్ముళ్లూ..ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారా లేదా. ఏవమ్మా ఆడబిడ్డలూ మీరు చెప్పండి. నేనున్నప్పుడు కరెంటు చార్జీలు పెంచానా? లోటు బడ్జెట్‌ ఉన్నా కరెంటు చార్జీలు పెంచకుండా పరిపాలన సాగించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 27 మే 2020,టీడీపీ మహానాడుకరెంటు చార్జీలు ఎవరూ కట్టే పరిస్థితిలేకపోతే కరెంటు చార్జీలు పెంచమని చెప్పాం. ఐదు సంవత్సరాలు కరెంటు చార్జీలు పెంచలేదు.టెక్నాలజీ ఉపయోగించాం. సోలార్‌ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం.దానివల్ల రాబోయే రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందకు వెళితే మీరు(జగన్‌) పవర్‌ రేట్లు పెంచారు. రైతులకు కూడా కరెంటు చార్జీలు పెంచే పరిస్థితికి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరం.19 మార్చి 2019, కడపకరెంటు కొరత 2004లో లేదు. 2014లో అది 22.5 మిలియన్‌ యూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను. రెండు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు చార్జీలు పెంచమన్నాం. వ్యవసాయానికి 9 గంటలు కరెంటు ఇస్తున్నాం. ఇళ్లకు 24 గంటలు ఇస్తున్నాం. భవిష్యత్తులో ఎంత కావాలంటే అంత కరెంటు ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నా. 2 ఆగష్ట్‌ 2023, పులివెందులకరెంటు పెంచను, తగ్గిస్తా. ఇప్పటికి ఎనిమిది సార్లు కరెంటు చార్జీలను జగన్‌ పెంచారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో కరెంటు చార్జీలు పెంచను. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీరే వినియోగించుకునే పరిస్థితి తీసుకువస్తా. గ్రిడ్‌కు కనెక్ట్‌ చేసి మిగులు విద్యుత్‌ను వినియోగదారులే అమ్ముకునేలా చేస్తా.

Actress Abhinaya Get Married With Sunny Varma6
ఘనంగా నటి అభినయ పెళ్లి.. ఫోటో చూశారా?

కర్ణాటకు చెందిన నటి అభినయ తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్‌)తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏప్రిల్‌ 16న ఈ వేడుకు ఘనంగా జరిగింది. మార్చి 9న నిశ్చితార్థం జరిగింది. చాలా రోజులుగా ఆమె పెళ్లిపై ఎన్నో రూమర్స్‌ వచ్చాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన వారినే పెళ్లి చేసుకోబుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, అవన్నీ రూమర్స్‌ వరకే పరిమితం అయ్యాయి. 15 ఏ‍ళ్ల పాటు తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సన్నీ వర్మను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ నెల 20న రిసెప్షన్‌ నిర్వహించనున్నారు'నేనింతే' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కింగ్‌, శంభో శివ శంభో వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా 'పని' అనే మలయాళ సినిమాలో ఆమె అద్భుతంగా నటించారని ప్రశంసలు కూడా దక్కాయి. అయితే, అందులో ఒక సీన్‌లో ఆమె బోల్డ్‌గా నటించడంతో దర్శకుడిపై విమర్శలు వచ్చాయి. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official)

Gold price record new high Rs 1650 rally in a single day7
పసిడి మరో కొత్త రికార్డు.. ఒకే రోజు రూ.1,650 ర్యాలీ

న్యూఢిల్లీ: పసిడి మరోసారి కొత్త గరిష్ట రికార్డును నమోదు చేసింది. బుధవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9% స్వచ్ఛత) రూ.1,650 పెరగడంతో రూ.98,100 స్థాయికి చేరింది. క్రితం రికార్డు రూ.96,450ను చెరిపేసింది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతుండడం బంగారం ధరలకు ఆజ్యం పోస్తోంది.బంగారం ఈ నెల 11న ఒక్క రోజే 10 గ్రాములకు రూ.6,250 పెరగడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటి వరకు 23.56 శాతం ర్యాలీ చేసింది. జనవరి 1న రూ.79,390 స్థాయి నుంచి చూస్తే 10 గ్రాములకు రూ.18,710 లాభపడింది. మరోవైపు వెండి కిలోకి రూ.1,900 పెరిగి రూ.99,400కు చేరింది.‘‘బంగారం మళ్లీ భారీ ర్యాలీ చేసింది. ఎంసీఎక్స్‌లో రూ.95,000 స్థాయిని చేరింది. సురక్షిత సాధనానికి ఉన్న బలమైన డిమాండ్‌ను ఇది తెలియజేస్తోంది’’అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ కమోడిటీ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జతిన్‌ త్రివేది తెలిపారు.భౌగోళిక అనిశ్చితులకుతోడు అమెరికా–చైనా మధ్య టారిఫ్‌ ఉద్రిక్తతలు చల్లారనంత వరకు బంగారం ర్యాలీకి అవకాశాలున్నట్టు చెప్పారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు 105 డాలర్లు పెరిగి 3,349 డాలర్ల సరికొత్త ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని తాకింది.

TDP high Command seriously warns MLA Ganta Srinivasa rao8
గంటాతో కూటమికి తలనొప్పులు.. పిలిచి మరీ క్లాస్ పీకిన అధిష్టానం

రాష్ట్రంలో తెలుగుదేశం..కాంగ్రెస్.. ఎవరు అధికారంలో ఉన్నా మంత్రిగా హోదా నిలబెట్టుకునే స్థాయి నాయకుడైన గంటా శ్రీనివాస్‌కు ఇప్పుడు వట్టి ఎమ్మెల్యేగా ఉండడం ఇబ్బందికరంగా మారింది. గతంలో మంత్రి హోదాలో కలెక్టర్లు.పెద్ద పెద్ద అధికారులతో హడావుడి చేసే గంటా ఇప్పుడు భీమిలి వరకే పరిమితం అవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే తన ఉనికిని చాటుకునేందుకు అప్పుడప్పుడూ అత్యుత్సాహం చూపిస్తున్నారు. అయితే ఈ ఓవర్ యాక్షన్ని ప్రభుత్వం..పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయన చర్యలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతో చీవాట్లు పెడుతూ.. కాస్త హద్దుల్లో ఉండాలని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.విజయవాడలో మంగళవారం జరిగిన ఓ ముఖ్య సమావేశానికి విశాఖ నుంచి బయల్దేరిన గంటా నేరుగా విజయవాడ వెళ్లాల్సి ఉండగా సదరు విమానం ఆయన్ను ముందుగా హైదరాబాద్ తీసుకెళ్లి..అక్కణ్ణుంచి విజయవాడ డ్రాప్ చేసింది.. ఎందుకూ అంటే విశాఖ నుంచి బెజవాడకు డైరెక్ట్ విమాన సర్వీస్ లేదు.. రద్దు చేశారని తెలిసింది. దీంతో ఉదయం వెళ్లాల్సిన గంటా మధ్యాహ్నానికి విజయవాడ చేరుకున్నారు.దీంతో ఆయన ‘ఆంధ్ర టూ ఆంధ్ర వయా తెలంగాణ’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టు మీద టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని లేనిపక్షంలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మన వారే కదా ఆయనకు చెబితే సరిపోయేది కానీ ఇలా ట్విటర్లోకి ఎక్కి రచ్చ చేయాలా అని చీవాట్లు పెట్టింది. సీనియర్ ఎమ్మెల్యే అయినా ఇలా బాధ్యత లేకుండా ఉంటే ఎలా అని అడిగింది.ఇదిలా ఉండగా.. వతిలో 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని గంటా వియ్యంకుడు, పురపాలక మంత్రి నారాయణ ప్రకటన చేసిన తరుణంలోనే రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానమే లేదంటూ గంటా శ్రీనివాసరావు ట్విట్టర్లో సెటైర్ వేశారు. అధికార పార్టీ నాయకుడివైన నువ్వు ప్రభుత్వం పరువు తీయడం ఏమిటని అధిష్టానం ప్రశ్నించింది.వాస్తవానికి గంటా శ్రీనివాస్ గతంలో కూడా ప్రభుత్వానికి ఋషికొండ భవనాల తలుపులు తెరిచి హడావుడి చేశారు. ఫోటోలు విడుదల చేశారు. ఆ సందర్భంలో కూడా ఆయనకు పార్టీ నుంచి అక్షింతలు పడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్.. ప్రభుత్వంలో నంబర్ టూ అయిన లోకేష్..ఇంకా మంత్రులు ఉండగా కేవలం ఒక ఎమ్మెల్యే అయిన మీరు రుషికొండ భవనాలను చూడడానికి ఎందుకు వెళ్ళారు..మీకు అంత అత్యుత్సాహం ఎందుకు అని అప్పట్లోనే టిడిపి పెద్దలు ప్రశ్నించారు. ఇక ఇప్పుడు కూడా ఈ ట్వీట్ దెబ్బతో చీవాట్లు పడ్డాయి. మొత్తానికి గంటాకు ఈ టర్మ్ బాలేనట్లుంది.::సిమ్మాదిరప్పన్న

Interesting Twist In UP Woman And Daughter Fiance Episode9
కాబోయే అల్లుడితో అత్త జంప్‌ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌.. ఎందుకిలా చేసిందంటే..

లక్నో: తన కూతురికి కాబోయే భర్తతో సంబంధం పెట్టుకున్న పరారీ అయిన అత్త ఘటన వ్యవహారంలో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఏది ఏమైనా తాను రాహుల్‌తో జీవిస్తానని, అతడిని పెళ్లి చేసుకుంటానని సప్న తెలిపింది. అలాగే, తాను ఇంట్లొ నుంచి వెళ్లేటప్పుడు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లినట్లు తన భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది. మరోవైపు.. తనతో సంబంధానికి ఒప్పుకోకుంటే చనిపోతాను అని సప్న బెదిరించడంతోనే తాను ఆమెతో పారిపోడానికి ఒప్పుకున్నట్లు రాహుల్ కుమార్ చెప్పాడు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి. అలీఘర్‌లోని దాదోన్‌కు చెందిన సప్న, జితేంద్ర కుమార్ భార్యాభర్తలు. వీరికి శివానీ అనే ఓ కూతురు ఉంది. శివానీకి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ క్రమంలో రాహుల్ కుమార్ అనే యువకుడితో శివానీకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. మరో 10 రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనగా ఏప్రిల్ 6, 2025న 40 ఏళ్ల సప్న.. తనకు కాబోయే అల్లుడు రాహుల్ కుమార్‌తో పరారీ అయ్యింది. దీంతో, ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలిసిన వారంతా ముక్కునవేలేసుకున్నారు.అయితే, తాజాగా వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ క్రమంలో తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో సప్న పోలీసులకు వివరించింది. ఈ తన భర్త జితేంద్ర కుమార్ పెద్ద తాగుబోతు అని, తరుచూ తాగొచ్చి తనను కొట్టేవాడని.. తన కూతురు కూడా తరచూ తనతో గొడవలు పెట్టుకునేదని.. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. ఏది ఏమైనా తాను రాహుల్‌తో జీవిస్తానని, అతడిని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. అలాగే, తాను ఇంటి నుంచి వెళ్లేటప్పుడు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లినట్లు తన భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని.. తాను ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తన దగ్గర కేవలం ఓ మొబైల్ ఫోన్, రూ.200 మాత్రమే ఉన్నట్లు తెలిపింది.మరోవైపు.. తనను సప్న బెదిరించడంతోనే తాను ఆమెతో పారిపోడానికి ఒప్పుకున్నట్లు రాహుల్ కుమార్ చెప్పాడు. అలీఘర్ బస్ స్టాప్‌లో కలవకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటాను అని సప్న తనకు ఫోన్ లో చెప్పిందని.. దీంతో తాను అక్కడికి వెళ్లానని.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లక్నో వెళ్లినట్టు తెలిపాడు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారు అని తెలియడంతో తామే వచ్చి లొంగిపోయినట్లు చెప్పాడు. అయితే ఇప్పుడు సప్నని పెళ్లి చేసుకుంటావా అని అడినప్పుడు.. తాను సిద్దంగానే ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.Aligarh's absconding 'mother-in-law and son-in-law' were caught, what did the mother-in-law say, watch the video#Aligarh #Nepalborder #Bihar #saas #damad #Breaking #Lateat pic.twitter.com/yTOu6qXwig— Indian Observer (@ag_Journalist) April 16, 2025

CRDA issues notification for construction under three packages10
రూ.4,689 కోట్లతో సచివాలయానికి ‘టెండర్‌’

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో రూ.1,151 కోట్ల వ్యయంతో 2015లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ప్రభుత్వం.. ఇప్పుడు రూ.4,689.82 కోట్ల అంచనా వ్యయంతో సచివాలయ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. తాత్కాలిక సచివాలయాన్ని వెలగపూడి వద్ద 42.5 ఎకరాల్లో జీ+1 పద్ధతిలో ఐదు బ్లాక్‌లలో ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పడు శాశ్వత సచివాలయాన్ని రాయపూడి వద్ద 32 ఎకరాల్లో బీ+జీ+39 పద్ధతిలో నాలుగు టవర్లు, బీ+జీ+49 పద్ధతిలో ఒక టవర్‌.. మొత్తం ఐదు టవర్లను 4,85,000 చదరపు మీటర్ల (52,20,496 చదరపు అడుగులు)లో చేపట్టనుంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ తాత్కాలిక సచివాలయం.. శాశ్వత సచివాలయం పేరుతో రెండుసార్లు భవనాలు నిర్మించిన దాఖలాలు లేవని అధికార వర్గాలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాల మేరకు శాశ్వత సచివాలయంలో ఐదు టవర్లను మూడు ప్యాకేజీలుగా విభజించి.. వాటి నిర్మాణానికి బుధవారం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) లంప్సమ్‌ విధానంలో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండేళ్లలో పూర్తి చేయాలని గడువు అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి 2018లో పోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌– జెనిసిస్‌ ప్లానర్స్‌–డిజైన్‌ ట్రీ సర్వీస్‌ కన్సెల్టెంట్స్‌ సంస్థలు డిజైన్‌లు (ఆకృతులు) రూపొందించాయి. ఆ డిజైన్‌ల మేరకు ఇటీవల శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇప్పుడు శాశ్వత సచివాలయంలో 1, 2 టవర్లను ఒక ప్యాకేజీ కింద.. 3, 4 టవర్లను రెండో ప్యాకేజీ కింద.. జీఏడీ (సాధారణ పరిపాలన విభాగం) టవర్‌ను మూడో ప్యాకేజీ కింద విభజించి సీఆర్‌డీఏ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పనులను 24 నెలల్లో పూర్తి చేసేలా.. నిర్మాణం పూర్తయ్యాక 36 నెలలపాటు నిర్వహించాలని షరతు పెట్టింది. ఈ టెండర్‌లో బిడ్ల దాఖలుకు వచ్చే నెల ఒకటో తేదీని తుది గడువుగా నిర్దేశించింది. అదే రోజున టెక్నికల్‌ బిడ్‌ను తెరుస్తారు. టెక్నికల్‌ బిడ్‌లో అర్హత సాధించిన సంస్థల ఆర్థిక బిడ్లను మే 3న తెరుస్తారు. తక్కువ ధరకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన సంస్థకు కాంట్రాక్టు పనులు అప్పగించాలని సీఆర్‌డీఏ అథారిటీకి అధికారులు ప్రతిపాదించనున్నారు. సచివాలయం నిర్మాణం ఇలా.. » రాయపూడి వద్ద పాలవాగుకు ఇరు వైపులా శాశ్వత సచివాలయాన్ని నిర్మించనున్నారు. పాలవాగుకు ఉత్తరాన జీఏడీ టవర్‌తోపాటు 1, 2 టవర్లు.. దక్షిణాన 3, 4 టవర్లను నిర్మించేలా డిజైన్‌ను రూ­పొందించారు. మొత్తంగా 1, 2 టవర్ల పనుల కాం­ట్రాక్టు విలువ రూ.1,698.77 కోట్లు. 3, 4 టవర్ల పనుల కాంట్రాక్టు విలువ రూ.1,488.92 కోట్లు. జీఏడీ టవర్‌ కాంట్రాక్టు విలువ రూ.1,007.82 కోట్లు. ఐదు టవర్లలో ఒక్కో అంతస్తు 47 మీటర్ల వెడల్పు, 47 మీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. » శాశ్వత సచివాలయం నిర్మాణ పనులను ఇప్పటి తరహాలోనే మూడు ప్యాకేజీల కింద 2018 ఏప్రిల్‌ 26న అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించింది. జీఏడీ టవర్‌ నిర్మాణ పనులను రూ.554.06 కోట్లకు ఎన్‌సీసీ సంస్థకు.. 1, 2 టవర్ల నిర్మాణ పనులను రూ.932.46 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ సంస్థకు.. 3, 4 టవర్ల నిర్మాణ పనులను 784.62 కోట్లకు ఎల్‌ అండ్‌ టీ సంస్థకు అప్పగించింది. అంటే.. ఐదు టవర్ల నిర్మాణ పనుల విలువ రూ.2,271.14 కోట్లు. » ఈ ఐదు టవర్ల పునాదుల పనులను 2019 నాటికే కాంట్రాక్టు సంస్థలు పూర్తి చేశాయి. మిగిలిన పనులకు ఇప్పుడు టెండర్లు పిలిచింది. 2018 ఏప్రిల్‌ నాటితో పోల్చి చూస్తే.. స్టీలు, సిమెంటు, భవనాల నిర్మాణానికి ఉపయోగించే వస్తువుల ధరల్లో పెద్దగా మార్పు లేదు. పైగా ఈ టవర్ల నిర్మాణానికి సమీపంలోనే కృష్ణా నదిలో పుష్కలంగా.. అదీ ఉచితంగా ఇసుక లభ్యమవుతోంది. కానీ.. ఈ ఐదు టవర్లలో మిగిలిన పనుల నిర్మాణానికి రూ.4,195.51 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్‌డీఏ టెండర్లు పిలవడం గమనార్హం. » ఈ లెక్కన అంచనా వ్యయాన్ని రూ.1,924.37 కోట్లు పెంచేసిందన్నది స్పష్టమవుతోంది. యధావిధిగా సిండికేట్‌ కాంట్రాక్టర్లకు ఈ ఐదు టవర్ల పను­ల­ను కట్టబెట్టి.. కమీషన్లు వసూలు చేసుకోవడానికే ప్ర­భు­­త్వ ముఖ్యనేత చక్రం తిప్పారన్న చర్చ సాగుతోంది. » ఇక తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను అప్పట్లో చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున చెల్లించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన రూ.1,151 కోట్లు వ్యయం చేసి కమీషన్లు దండుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పుడు, ఇప్పుడు వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తెచ్చిన సొమ్మును ఇలా దుబారా చేయడం తగదని అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement