Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Supreme Court Key Comments Over HCU Lands And Telangana Govt1
గచ్చిబౌలి భూములు.. తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక

సాక్షి, ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడ చెట్ల నరికివేతపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే, వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి అని ప్రశ్నించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. కంచె గచ్చిబౌలి భూముల అంశంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం.. చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దీన్ని సమర్ధించుకోవద్దంటూ చురకలు అంటించింది. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా?.. సూటిగా జవాబు చెప్పండి. వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారు?. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలేదు. వీడియోలు చూసి మేము ఆందోళనకు లోనయ్యాం. అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరం. ఇష్టం వచ్చినట్టు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకోం. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే చెరువు దగ్గరే తాత్కాలిక జైలుపెట్టి అధికారులను అక్కడే ఉంచుతాం. షెల్టర్ కోసం జంతువులు పరుగులు తీస్తే.. వాటిని వీధి కుక్కలు తరిమాయి. 1996లో మేము ఇచ్చిన తీర్పుకు భిన్నంగా అధికారులు సొంత మినహాయింపులు ఇస్తే వారే బాధ్యులు అవుతారు. ప్రైవేట్ ఫారెస్టులో సైతం చెట్లు నరికితే సీరియస్‌గా పరిగణిస్తాం. భూముల తాకట్టు అంశాలతో మాకు సంబంధం లేదు. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలి. డజన్ల కొద్ది బుల్డోజర్లతో అడవిలో వంద ఎకరాలు తొలగించారు. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాలి. సిటీలో గ్రీన్ లంగ్ స్పేస్ ఉండాలి. వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించింది. చివరగా.. పర్యావరణ, వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని తెలిపింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ.. అన్ని పనులు ఆపి వేశాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేశారు. మినహాయింపులకు లోబడే మేము కొన్ని చెట్లు తొలగించాం అని చెప్పుకొచ్చారు.అమికస్ క్యూరీ వాదనలు వినిపిస్తూ.. సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుని.. అన్నింటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారు. ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధం. ఈ భూములు తాకట్టుపెట్టి ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంది అని అన్నారు. అంతకుముందే, ఈ కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవు. కంచె లేని కారణంగా హెచ్‌సీయూ భూములలోని పక్షులు ఇక్కడికి వచ్చాయని పేర్కొంది.

Supreme Court to hear pleas against Waqf Amendment Act on Apr 16 Updates2
వక్ఫ్‌ పిటిషన్లపై ‘సుప్రీం’ కీలక విచారణ.. హైలైట్స్‌

సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను(Waqf Petitions) సుప్రీంకోర్టులో ఇవాళ (ఏప్రిల్‌ 16న) విచారణ జరపనుంది. కేంద్రం కేవియెట్‌ పిటిషన్‌ వేయడంతో ఇరువైపులా వాదనలను చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. కొత్త చట్టంలోని పలు సెక్షన్లు రాజ్యాంగానికి విరుద్ధమని, జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు పలు సంస్థలు, ఎన్జీవోలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను ఉమ్మడిగా ఇవాళ మధ్యాహ్నాం సీజేఐ బెంచ్‌ విచారణ జరపనుంది. వక్ఫ్ సవరణ చట్టం(Waqf Amendment Law) రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టం రూపొందించారని, ఈ చట్టంతో ముస్లిం మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమేనని వైఎస్సార్‌సీపీ సైతం తన పిటిషన్‌లో పేర్కొంది.👉ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, కాంగ్రెస్‌ ఎంపీ మహ్మద్‌ జావేద్‌(బిహార్‌)తో పాటు జేడీయూ, ఆప్‌, డీఎంకే, సీపీఐ, వైఎస్సార్‌షీపీ.. ఇలా ప్రధాన పార్టీలతో పాటు జమైత్‌ ఉలేమా హింద్‌, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కూడా పిటిషన్లు వేశాయి. వక్ఫ్‌సవరణ చట్టం బిల్లు నిబంధనలు ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని, ముస్లింల హక్కులను హరించే కుట్రగా అభివర్ణిస్తున్నాయి. ; ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. 👉బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు చట్టానికి మద్ధతుగా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశాయి. ఆ చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టేయబోదన్న ధీమాతో ఉంది.👉ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో మంగళవారం మరో పిటిషన్‌ దాఖలైంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్‌ న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ వేసిన పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపడతామని వెల్లడించింది. అయితే అది ఇవాళ విచారించబోయే పిటిషన్లతోనా? లేదంటే ప్రత్యేకంగానా? అనేదానిపై ఈ మధ్యాహ్నాం స్పష్టత రానుంది.👉పిటిషన్లలో కొన్ని.. వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. మరికొన్ని.. దీనిని అమలు చేయకుండా కేంద్రాన్ని ఆదేశించాలని కోరాయి. 👉పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. ఈ నెల మొదట్లో సుదీర్ఘ చర్చల అనంతరం ఇటు లోక్‌సభలో, అటు రాజ్యసభలో వక్ఫ్‌ బిల్లుకు ఆమోదం లభించింది. 👉అయితే.. చట్టసభల పరిధిని తాము దాటబోమని ఇంతకు ముందే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయినప్పటికీ రాజ్యాంగానికి సంబంధించిన అంశాల్లో చివరి తీర్పు ఇచ్చే అధికారం మాత్రం ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో.. వక్ఫ్‌ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లో సమానత్వ హక్కు, మతాచారాలను అనుసరించేలాంటి హక్కులు ప్రభావితం అయ్యాయని పిటిషనర్లు వాదిస్తున్నారు. అందుకే సుప్రీం కోర్టు ఈ పిటిషన్లపై వాదనలు వినేందుకు సిద్ధమైంది. 👉ఈ సవరణలు వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి, వెనుకబడిన ముస్లింలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని కేంద్రం అంటోంది. మత స్వేచ్ఛను హరిస్తాయనే విమర్శలను తప్పుబడుతోంది. ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటోంది. వక్ఫ్ బోర్డుల్లో అవినీతిని తగ్గించి, వ్యవస్థను పారదర్శకంగా చేయడానికే ఈ బిల్లును తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.

KSR Comments On Chandrababu P-4 Concpet3
అపరాధ భావం.. అతకని కథలతో బాబు కాలక్షేపం!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో వింత ప్రకటన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాకుండా.. మిగిలిన అన్ని విషయాలపై అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆ క్రమంలో ఆయన డాక్టర్‌ అవుతున్నాడు.. మాస్టర్‌ అవతారం ఎత్తుతున్నాడు.. రోజూ ఏదో ఒక విషయం ఎత్తుకోవడం.. దానిపై మీడియాతోనో లేకపోతే ఇంకొకరితోనో.. గంటల తరబడి మాట్లాడటం! ఇదీ తంతు! ఈ ధోరణి గతంలోనూ ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అది మితి మీరిపోతోంది.హామీలు అమలు చేయలేక ప్రజల్లో పలచన అవుతున్నాన్న అపరాధ భావమో.. ఇతరాంశాల గురించి మాట్లాడుతూ ప్రజల దృష్టి తప్పించాలనో ఇలా చేస్తుండవచ్చు. అయితే, ఈ క్రమంలో ఆయన సమతుల్యత తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. ఒక ఉదాహరణ చూద్దాం..‘పీ-4 కార్యక్రమంలో ఎంత మంది మంత్రులు పాల్గొంటున్నారు? ఎన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు’ అని ఈమధ్య ఓ విలేకరి చంద్రబాబును ప్రశ్నించారు. అంతే ఆయనకు ఉన్నట్టుండి కోపం ముంచుకొచ్చింది. ‘కుక్క కరిస్తే, పిల్లి అరిస్తే సీఎం ఏం చేస్తాడు? విలేకరిగా నీకు బాధ్యత లేదా? సచివాలయంలో కూర్చున్నావంటే సొసైటీ నీకు ఆ స్థాయిని కల్పించిందని మర్చిపోవద్దు. మంత్రులను అడుగుతున్నావు.. ప్రెస్‌లో ఎంతమంది దత్తత తీసుకున్నారు? అన్నీ నేనే చూడాలన్న ఆలోచన ధోరణి మారాలి’ అంటూ చిర్రుబుర్రులాడారు.విలేకరి అడిగిన ప్రశ్నకు ఈయన గారి సమాధానానికి అస్సలు పొంతన లేకపోవడాన్ని కాసేపు పక్కనబెడదాం. వాస్తవానికి తాను అనుకుంటున్న పీ-4 కార్యక్రమం గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఇదో మంచి అవకాశం. మంత్రులు, తన పార్టీ నేతలను ఆ విధమైన సేవాభావం వైపు మళ్లించేందుకు ఓ సందేశం ఇచ్చి ఉండవచ్చు. అలాకాకుండా ఆ ప్రశ్న వేసిన విలేకరినే మందలించడం ఆయన పరిస్థితిని తెలియజేస్తోంది! పైగా ఇలా అసందర్భంగా మాట్లాడితే సీఎం స్థాయి నేత బ్యాలెన్స్‌ కోల్పోయినట్లు అనుకోరా?. చివరికి ప్రెస్ వారు దత్తత తీసుకోవాలని చెబుతున్నారంటేనే ఆ పీ-4 కార్యక్రమంలో చక్కదనం ఏంటో అర్థమవుతుంది.చంద్రబాబు గతంలో కూడా ఇలాంటి గిమ్మిక్కులు చేసేవారు. కాకపోతే ఈసారి అవి శృతి మించాయనిపిస్తుంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మీడియా అంతా అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడుతుండాలి. అబద్దాలు పోగు చేసి రాయాలి. లేకుంటే ప్రభుత్వానికి భయపడుతున్నారని ఆయనే మీడియా సమావేశాలలో వ్యాఖ్యానిస్తుంటారు. తాను ముఖ్యమంత్రి అయితే మాత్రం అంతా అదరహో అని ఊదరగొట్టాలి. టీడీపీ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇదే పనిలో ఉంటాయి. అయినా ఇంకెవరైనా ప్రశ్నిస్తే ఆయనకు అసహనం వచ్చేస్తుందన్న మాట. ఇంకో విషయం చూద్దాం.ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది. ఫీజుల చెల్లింపును డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగింది. దాని గురించి మీడియాలో కథనాలు వస్తే చంద్రబాబు ఆ అంశంపై మాట్లాడకుండా పీపీపీ విధానంలో ఆస్పత్రులు అంటూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారట. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల మొత్తానికి ఆరోగ్య బీమా కల్పిస్తామని పౌరులందరికీ డిజిటల్ హెల్త్ కార్డు, అన్ని మండలాలలో జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందుల పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీల అమలుపై ప్రజెంటేషన్ ఇచ్చి.. ఆ తరువాత కొత్త కార్యక్రమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన ‘ఇంటింటికి డాక్టర్’ కార్యక్రమాన్ని కొనసాగించి ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. కానీ, జగన్‌కు పేరు వస్తుందన్న భయంతో ఆ పథకాన్ని అటకెక్కించారు. ఆరోగ్యశ్రీ కింద పేదలకు సరైన వైద్యమే అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.ఈ విమర్శలకు ప్రతిగా ఆయన చెబుతున్నది ఏమిటంటే ప్రతి నియోజకవర్గంలోను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తారట. అవి కూడా ప్రభుత్వ, ప్రైవేట్‌ పద్ధతిలో.. ఈ రకమైన ఆసుపత్రులకు నష్టాలొస్తే ప్రభుత్వం పదేళ్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ ఇస్తుందట. ఆరోగ్యశ్రీ రోగుల్లో యాభై శాతం మందికి ఇక్కడకు పంపిస్తారట. హాస్పిటల్ లేని నియోజకవర్గాలలో వంద నుంచి 300 పడకలతో ఈ తరహా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తారట. ఎక్కడో ఒకటి, అర తప్ప, ఇవన్నీ ఎప్పటికి వస్తాయి?. ప్రజలకు ఎప్పటికి ఉపయోగపడేను? అదేమని అడిగితే.. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ఏర్పాటు చేస్తామంటారు. అది ఎప్పటికి రెడీ అవుతుందో తెలియదు. పది వ్యాధులకు ఒకరు చొప్పున డాక్టర్లను సలహాదారులుగా నియమిస్తారట. ఇదేమిటో తెలియదు.ఇంకోపక్క.. ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయని వాటికి ఆక్సిజన్ ఇవ్వాలని, కాని డబ్బులు లేవంటున్నారని చంద్రబాబే చెబుతారు. మరి ఆయన చెప్పేవాటన్నిటికీ డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? అమరావతిలో ఖర్చు పెట్టడానికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేదల, మధ్య తరగతి వారి ఆరోగ్యం కన్నా, భారీ భవంతులు కట్టడం ప్రయోజనకరమని ఆయన భావిస్తున్నారా? ఇలా అడిగితే ఆయన ఊరుకోరు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, వ్యాధులు అంటూ ఆయనే ప్రజెంటేషన్ ఇస్తారు. విరుగుడు మాత్రం ప్రైవేటు మంత్రం అని పరోక్షంగా చెబుతూంటారు. రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వదలుకుంటారు. జగన్ తెచ్చిన వైద్య కళాశాలలను సైతం ప్రైవేటుకు అప్పగిస్తారట.చంద్రబాబు మరో సలహా ఇచ్చారు. ప్రజలు ఏమేమి తినాలో ఆయన చెబుతున్నారు. అన్ని ప్రభుత్వమే చేయలేదని, వ్యాధులు రాకుండా ఆహార అలవాట్లు మార్చుకోవాలని, జీవన శైలి మార్చుకోవాలని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. జంక్ ఫుడ్స్ వదలిపెట్టి, మిల్లెట్స్ వాడాలని సూచిస్తున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు 600 గ్రాముల ఉప్పు, రెండు లీటర్ల నూనె, మూడు కిలోల పంచదారే వాడాలని అన్నారు. ఏదో పెద్ద తరహాలో చెబితే అదో రకం. కాని ఆయన మద్యం తాగమని చెబుతూ ఎన్నికల ప్రచారం చేశారే! తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చామని గొప్పగా అసెంబ్లీలో చెప్పారే. మరి ఆ మద్యం బాటిళ్లపై హానికరం అని ఉంటుంది కదా! ఆ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు. ఉప్పు ఎక్కువ తింటే బీపీ వస్తుందన్న సంగతి అందరికి తెలుసు. దాని గురించి మాట్లాడిన సీఎంకు మద్యం తీసుకుంటే లివర్ పాడవుతుందని తెలియదా?. ఇక్కడే చంద్రబాబు చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది.యధా ప్రకారం జీఎస్డీపీ అంటూ కాకి లెక్కలు చెప్పి, జగన్ టైమ్‌లో అలా జరిగింది.. ఇలా జరిగిందని చెప్పి మభ్య పెడితే ప్రజలకు ఒరిగేదేమిటి? కొసమెరుపు ఏమిటంటే మీరు చెబుతున్నవాటిన్నటికి డబ్బు కావాలి కదా? ఎక్కడ నుంచి వస్తాయని అడిగితే, చాలా విషయాలలో డబ్బు కంటే సంకల్పం, పాజిటివ్ దృక్పథం ముఖ్యమని సెలవిచ్చారు. అంటే గాలిలో మేడలు కడుతున్నట్టు అనిపించదా?. కాకపోతే చంద్రబాబు ఉపన్యాసాలు ఈనాడు వంటి టీడీపీ మీడియా ‘ఆరోగ్య భాగ్యం’ అంటూ శీర్షికలు పెట్టి బాజా వాయించడానికి మాత్రం బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

today gold and silver rates on telugu states4
ఇక బంగారం కొనడం కష్టమే! తులం ఎంతంటే..

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.88,150 (22 క్యారెట్స్), రూ.96,170 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.950, రూ.990 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.950, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.990 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.88,150 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.96,170 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.950 పెరిగి రూ.88,300కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.990 పెరిగి రూ.96,320 వద్దకు చేరింది.ఇదీ చదవండి: కృత్రిమ మేధను నియంత్రించవచ్చా..?వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లోనూ మార్పులు కనిపించాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై రూ.200 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,10,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Zaheer Khan Sagarika Ghatge Blessed with baby boy Reveals Name Pic Viral5
పెళ్లైన ఎనిమిదేళ్లకు శుభవార్త.. తండ్రైన జహీర్‌ ఖాన్‌

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌ తండ్రయ్యాడు. అతడి భార్య, బాలీవుడ్‌ నటి సాగరిక ఘట్కే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సాగరిక- జహీర్‌ దంపతులు బుధవారం సోషల్‌ మీడియా వెల్లడించారు.చిన్నారి పేరేమిటంటేఈ మేరకు ‘‘ఆ దేవుడి దివ్యాశీసులతో.. మా వెలకట్టలేని సంతోషానికి, చిన్నారి కుమారుడికి స్వాగతం పలుకుతున్నాం’’ అని పేర్కొన్నారు. తమ కుమారుడికి ఫతేసిన్హ్‌ ఖాన్‌గా నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కుమారుడిని చేతుల్లోకి తీసుకున్న ఫొటోను షేర్‌ చేయగా.. జహీర్‌- సాగరికలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి సతీమణి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ, కేఎల్‌ రాహుల్‌ భార్య, నటి అతియా శెట్టి, టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సతీమణి దేవిశా శెట్టి తదితరులు లవ్‌ సింబల్‌తో విషెస్‌ తెలియజేశారు.పెళ్లైన ఎనిమిదేళ్లకు శుభవార్తకాగా కొన్నాళ్లపాటు సాగరికతో ప్రేమలో మునిగితేలిన జహీర్‌ ఖాన్‌.. 2017లో ఇరు కుటుంబాల సమ్మతంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తన గత ప్రేమ (ఈశా శర్వాణి) తాలుకు చేదు జ్ఞాపకాలను చెరిపి.. జీవితంలో నవ వసంతం తెచ్చిన సాగరికతో ఎనిమిదేళ్లుగా కలిసి అడుగులు వేస్తున్నాడు. ఇక ఇప్పుడు తమ ప్రేమకు గుర్తుగా కుమారుడి రాకతో ఈ జంట కుటుంబం పరిపూర్ణమైంది. View this post on Instagram A post shared by Sagarika Z Ghatge (@sagarikaghatge)దిగ్గజ పేసర్‌గా నీరాజనాలుమహారాష్ట్రకు చెందిన 46 ఏళ్ల జహీర్‌ ఖాన్‌.. లెఫ్టార్మ్‌ మీడియం పేసర్‌. 2000 సంవత్సరంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. పద్నాలుగేళ్ల కెరీర్‌లో 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 311, వన్డేల్లో 282, టీ20లలో 17 వికెట్లు కూల్చి.. దిగ్గజ పేసర్‌గా వెలుగొందాడు. లక్నో మెంటార్‌గాఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ఐపీఎల్‌లో కొనసాగిన జహీర్‌ ఖాన్‌.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం.. ఐపీఎల్‌-2025లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి మార్గదర్శనంలో లక్నో ఈ సీజన్‌లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని నాలుగు గెలిచింది. చదవండి: KKR Vs PBKS: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’కెప్టెన్‌గా అది పంత్‌ నిర్ణయం.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..: బిష్ణోయి

Mirchi Farmers Protest AT guntur6
గుంటూరు మిర్చి యార్డ్‌ వద్ద ఉద్రికత్త.. పోలీసుల ఓవరాక్షన్‌!

సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి సర్కార్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. తాజాగా గుంటూరులో మిర్చి రైతులు చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు.వివరాల ప్రకారం.. కూటమి సర్కార్‌ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో, చంద్రబాబు సర్కార్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరులో మిర్చి రైతులు ఆందోళనలకు దిగారు. బుధవారం ఉదయమే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులతోపాటు మిర్చి రైతులు నిరసన చేస్తున్నారు. దీంతో, భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మిర్చికి కనీసం 20వేలు గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మిర్చిని రోడ్డు మీద పోయడానికి రైతులు ప్రయత్నించారు. దీంతో, రైతులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో రైతులు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించి.. రైతుల వద్ద నుంచి మిర్చి బస్తాలను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసుల ముందే రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం, మిర్చిని రోడ్డుపై పోసి ఆందోళన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Police Denies Permission to Devi Sri Prasad Musical Night in Vizag7
దేవి శ్రీప్రసాద్‌కు ఎదురుదెబ్బ.. మ్యూజికల్‌ నైట్‌ లేనట్లే!

సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ‍ప్రసాద్‌ విశాఖపట్నంలో నిర్వహించబోయే మ్యూజికల్‌ నైట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నాలుగు సార్లు ప్రయత్నించినా విశాఖ పోలీసులు అనుమతులు ఇచ్చేందుకు ససేమీరా అంటున్నారు. ఏప్రిల్‌ 19న విశ్వనాథ స్పోర్ట్స్‌ క్లబ్‌లో మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించేందుకు డీఎస్పీ (Devi Sri Prasad) సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ లైవ్‌ షో కోసం ఆన్‌లైన్‌లో భారీగా టికెట్లు విక్రయించారు. కానీ భద్రతా కారణాల రీత్యా అనుమతి ఇవ్వలేమని సీపీ శంఖబ్రత బాగ్చీ తేల్చి చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఆక్వా వరల్డ్‌లో జరిగిన దుర్ఘటన నేపథ్యంలోనే అనుమతులకు నిరాకరించారు. ఈ క్రమంలో దేవి శ్రీ ప్రసాద్‌.. తన సంగీత కచేరిని వాయిదా వేస్తాడా? లేదా వేరే ప్రదేశానికి షిఫ్ట్‌ చేస్తాడా? అన్నది తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by ACTC Events (@actc_events) చదవండి: కొత్త లుక్‌లో ఖుష్బూ.. ఇంజక్షన్స్‌ తీసుకుందని ట్రోలింగ్‌..

Chandrababu Govt Over Action On YS Jagan Tours8
వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కుట్రలు

సాక్షి తాడేపల్లి: వైఎ‍స్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వైఎస్‌ జగన్‌ క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లకుండా ఆటంకాలు సృష్టిస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్‌ జగన్‌కు హెలికాప్టర్లు ఇవ్వనీయకుండా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలకు దిగారు.వివరాల ప్రకారం.. ఇటీవల వైఎస్‌ జగన్ రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో ప్రభుత్వ వైఫల్యం బహిర్గతమైన విషయం తెలిసిందే. వైఎస్‌ జగన్‌ రాప్తాడులో హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్న వెంటనే.. ప్రజలందరూ హెలికాప్టర్‌ను చుట్టుముట్టారు. తమ అభిమాన నేతలను కలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతిన్నది. దీంతో, వైఎస్‌ జగన్‌ను వదిలేసి హెలికాప్టర్‌ వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కూటమి సర్కార్‌ కొత్త కుట్రలకు తెరలేపింది. ఈ ఘటనపై విచారణ పేరుతో పైలట్‌లకు నోటీసులు జారీ చేసింది. దీంతో, వైఎస్‌ జగన్‌కి హెలికాఫ్టర్లను ఇవ్వనీయకుండా చేసేందుకే ప్రభుత్వ పెద్దల కుట్రలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది.మరోవైపు.. హెలికాప్టర్ ఘటనపై మరుసటి రోజే హోంమంత్రి అనిత డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కొనసాగింపుగా హెలికాఫ్టర్ సంస్థలకు ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. ఈ ఘటనపై ఇప్పటికే సంస్థలు డీజీసీఏకు నివేదిక అందించారు. అయితే, నివేదిక ఇచ్చినా పోలీసుల విచారణ పేరుతో పైలట్‌, కో-పైలట్‌ను ప్రభుత్వం వేధింపులకు గురిచేయడం గమనార్హం. నేడు విచారణకు హాజరుకానున్న పైలెట్, కో పైలెట్‌ వైఎస్‌ జగన్‌ ప్రయాణించిన హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతిన్న ఘటనలో విచారణకు హాజరుకావాలని హెలికాప్టర్‌ నిర్వహణ సంస్థ, పైలెట్, కో–పైలెట్‌లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో వారు బుధవారం విచారణకు హాజరుకానున్నారు. చెన్నేకొత్తపల్లిలోని రామగిరి పోలీసు సర్కిల్‌ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. అక్కడ ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 Tamil Nadu CM MK Stalin Set up High-level committy9
స్టాలిన్.. కేంద్రం.. ఓ న్యాయ కమిషన్..

ఈ మధ్య కాలంలో, కేంద్ర విధానాలపై దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన.. తాజాగా దక్షిణాది రాష్ట్రాల్లో కాకను పెంచుతోంది. కేంద్రంతో, దక్షిణాది రాష్ట్రాలు తగవు పెట్టుకోవడానికి ఇదొక్కటే కారణం కాదు. కేంద్ర ప్రభుత్వం.. ముఖ్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈమధ్య తీసుకుంటోన్న కొన్ని కీలక నిర్ణయాలు.. దక్షిణాది రాష్ట్రాల్లోని ఎన్డీయేతర ప్రభుత్వాల అధినేతల్లో తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి. అసంతుష్ట సీఎంల జాబితాలో.. తమిళనాడు ప్రభుత్వాధినేత ఎంకే స్టాలిన్ ముందు వరుసలో ఉన్నారు.కేంద్ర ప్రభుత్వ విధానాలు, వైఖరికి నిరసనగా స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసే పనిలో పడ్డారు. తొలుత, త్రిభాషా విధానంపై.. తమిళనాడులోని అన్ని రాజకీయ పక్షాలనూ.. తన దారిలోకి తెచ్చుకున్నారు. ముందు నుంచీ హిందీ వ్యతిరేక విధానాన్ని ఒంట పట్టించుకున్న తమిళ ప్రజలకు, తాము ఎక్కడ దూరమవుతామోనని, అక్కడి అన్ని పార్టీలూ, త్రిభాషా విధానాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఇదే ఊపులో.. స్టాలిన్, జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలను పునర్విభజించాలన్న అంశంపై, దక్షిణాదిలోని అన్ని రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మధ్యనే చెన్నైలో ఎన్డీయేతర పక్షాలతో భేటీని కూడా నిర్వహించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్ప.. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోని కీలక పార్టీలన్నీ స్టాలిన్‌ ఆందోళనతో ఏకీభవించాయి. కేంద్ర ప్రభుత్వ దూకుడును నిలువరించాలని తీర్మానించాయి.తొలి తమిళ సీఎంలు.. కీలక కమిషన్లు..ఎన్డీయేతర పక్షాల భేటీ తర్వాత, మలి అడుగుగా, ఇప్పుడు, స్టాలిన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను తాజాగా నిర్వచించేందుకు, ఈ బంధాలు మెరుగయ్యే అవకాశాలపై అధ్యయనం కోసం ఏకంగా ఓ న్యాయ కమిషన్‌నే నియమించాలని నిర్ణయించారు. తగిన సిఫారసుల కోసం, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు.. మంగళవారం (15-04-2025) నాడు తమిళనాడు అసెంబ్లీలో కీలక ప్రకటన కూడా చేశారు. తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యంగా డీఎంకే నేతృత్వంలోని సర్కారు ఇలా కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై కమిషన్‌లను నియమించడం ఇదే తొలిసారి కాదు. 1969 ఫిబ్రవరిలో.. తొలిసారి ముఖ్యమంత్రి అయిన ఎం.కరుణానిధి, ఎనిమిది నెలల్లోనే ఇదే అంశంపై, రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్ రాజమన్నార్ నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా.. తొలిసారిగా సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన స్టాలిన్, తండ్రి చూపిన బాటలోనే.. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై తానూ కమిషన్‌ను నియమించడం విశేషం.రాష్ట్రాలు నియమించే కమిషన్ల వల్ల ప్రయోజనముందా?కేంద్ర, రాష్ట్ర సంబంధాల పటిష్టతపై కమిషన్ల ఏర్పాటు అంశం కొత్తదేమీ కాదు. 1969లో డీఎంకే అప్పటి అధినేత కరుణానిధి వేసిన జస్టిస్ రాజమన్నార్ కమిషన్‌తో మొదలు పెడితే, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా, 1983లో, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్‌సింగ్ సర్కారియా కమిషన్, అనంతరం, 2007లో.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్‌మోహన్ పూంచీ వేసిన కమిషన్‌లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై సునిశితంగా అధ్యయనం చేసి సిఫారసులను చేశాయి.జస్టిస్ రాజమన్నార్ కమిటీ, జస్టిస్ సర్కారియా కమిటీలు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యతకు.. ప్రధాని నేతృత్వంలో, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని సూచించాయి. జస్టిస్ పూంచీ కమిటీ కూడా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీ అంశంలో.. ప్రణాళిక, ఆర్థిక సంఘాల మధ్య సమన్వయానికి ఓ నిపుణుల కమిటీ ఉండాలని సూచించింది. రాష్ట్రాలు ఏర్పాటు చేసిన కమిటీలే కాదు, స్వయంగా కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీల సిఫారసులూ బుట్టదాఖలు కావడం శోచనీయం. ఇప్పుడు తాజాగా స్టాలిన్ నియమించే జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ చేసే సిఫారసులను, ఎటూ కేంద్రానికే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ సిఫారసులపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది.. ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.మరి స్టాలిన్ దూకుడు ఎందుకు?తమిళనాడు అసెంబ్లీకి ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. గడచిన ఐదేళ్ల కాలంలో, స్టాలిన్ తన పాలనతో రాష్ట్రంపై విశిష్ట ముద్రనేదీ వేయలేదన్న భావన ఉంది. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే, కచ్చితంగా, స్థానికుల సెంటిమెంట్‌ని రగిలించడమే సరైనదని స్టాలిన్ భావిస్తున్నారని స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం, నీట్ విధానాన్ని ప్రవేశ పెట్టినప్పుడు, ఇటీవలే త్రిభాషా విధానాన్ని ప్రతిపాదించినప్పుడు.. వాటిని వ్యతిరేకించడంలో స్టాలిన్ ముందు వరుసలోనే నిలిచారు. ఇప్పుడు, దక్షిణాది విశాల ప్రయోజనాల పేరిట, డీలిమిటేషన్‌ ప్రక్రియను ప్రధాన అస్త్రంగా మలచుకుని, స్టాలిన్, తమిళుల హృదయాల్లో.. తనను తాను, జాతీయ స్థాయి నాయకుడిగా ఎక్స్‌పోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. కేంద్రంపై పోరు, దాని వెనుక మర్మం ఏమైనా, స్టాలిన్ తాజా వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. - పి.విజయ్‌ కుమార్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌.

Farmers Likely To Move High Court For Lands Captures Of Capital10
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు తీసుకున్న భూములన్నీ చాలడం లేదు.. అన్నిటికీ కేటాయించేయగా.. అన్నీ కట్టేయగా.. మహా అయితే రెండు వేల ఎకరాలు మాత్రమే మిగలబోతున్నాయి. ఇంత పెద్ద నగరం కట్టడానికి ఆ భూమి ఏమూలకూ చాలదు. ఇంకా 44 వేల ఎకరాలను సేకరించి మహా రాజధాని కడతాం అని.. చంద్రబాబునాయుడు ఈ కొత్త డ్రామాకు స్క్రిప్టు సిద్ధం చేశారు. కొత్తగా 44 వేల ఎకరాలు లాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటనలు కూడా వస్తున్నాయి. అయితే.. ఆయన సొంత వర్గానికి చెందిన అమరావతి ప్రాంత రైతులే ఈ ఆలోచన మీద ఆగ్రహంతో నిప్పులు కక్కుతున్నారు. తా దూరను కంత లేదు.. మెడకో డోలు అన్నట్టుగా.. ఆల్రెడీ రాజధానిగా నోటిఫై చేసిన భూముల్లో ఏడాదిగా ఒక్క పని మొదలుపెట్టలేకపోయారు గానీ.. ఇప్పుడు ఇంకో 44 వేల ఎకరాలు అంటున్నారు. తమ వద్ద నుంచి సేకరించిన భూములలో తమకు హామీ ఇచ్చిన రాజధాని నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదాకా, నగర విస్తరణ పేరిట కొత్త భూసేకరణ/ పూలింగ్ ప్రయత్నాలను నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ.. అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అమరావతి రాజధానిని ఇప్పుడు చంద్రబాబునాయుడే వంచించడానికి పూనుకున్నారు. అమరావతి ని రాజధానిగా పూర్తిగా అభివృద్ధి చేసి, ఆ ప్రాంతంలో.. భూములు ఇచ్చిన రైతులకు దామాషా ప్రకారంగా భూములకంటె విలువైన స్థలాలుగా మార్చి ఇస్తాం అని చంద్రబాబునాయుడు లాండ్ పూలింగ్ సందర్భంగా చాలా చాలా మాటలు చెప్పారు. ప్రజలందరూ కూడా దానిని నమ్మారు. నమ్మి ఇచ్చిన వారు కొందరైతే.. బెదిరించి ప్రలోభ పెట్టి బలవంతంగా మరికొందరితో కూడా భూములు లాక్కున్నారు. మొత్తానికి 54 వేల ఎకరాల వరకు సమీకరించారు. తొలి అయిదేళ్ల పాలనలో కేవలం డిజైన్ల పేరుతో వందల కోట్ల రూపాయలు తగలేసి.. బొమ్మ చూపించి మాయచేస్తూ వచ్చారు. ప్రజలు నమ్మకం లేక ఓడించిన తర్వాత.. జగన్ ప్రభుత్వం ఏర్పడింది. మంచి పాలనలో అధికారవికేంద్రీకరణ ఉండాలనే ఉద్దేశంతో జగన్ ఆలోచన చేసి, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు తప్ప.. దానిని వ్యతిరేకించలేదు. అయితే.. చంద్రబాబునాయుడు అమరావతి రైతులను రెచ్చగొట్టి వారితో హైకోర్టులో కేసులు వేయించి.. అసలు ఏ పనీ ముందుకు సాగకుండా అడ్డుపడ్డారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటిదాకా ఆ ప్రాంత క్లీనింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు. నిర్మాణ పనులు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అప్పుడే మరో 44 వేల ఎకరాలు రాజధాని విస్తరణకు సేకరిస్తాం అంటూ మరో పాట అందుకోవడంపై అమరావతి రైతులు రగిలిపోతున్నారు. ముందు మాకు మాట ఇచ్చిన విధంగా ఈ 54 వేల ఎకరాల రాజధాని పూర్తిగా అభివృద్ధి చేసి.. మాకు కేటాయించిన స్థలాలు మాకు అప్పగించిన తర్వాతే.. మరో పూలింగ్ కు వెళ్లాలని వారు మొండికేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమను పక్కన పెట్టేసి, ఇంకో నగరం మాయతో తిరగకుండా అడ్డుకోవడానికి అమరావతి రైతులు తమ స్వబుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి డిమాండు సహేతుకమైనదే గనుక.. కోర్టులో అనుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నారు. 44 వేల ఎకరాలంటూ చంద్రబాబు ఎంచుకున్న కొత్త డ్రామాకు ఆదిలోనే బ్రేకులు పడేప్రమాదం కనిపిస్తోంది. సొంత సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ.. తమ పట్ల చంద్రబాబు తలపెడుతున్న ద్రోహాన్ని జీర్ణించుకోలేక అమరావతి రైతులు కోర్టు గడప తొక్కడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది...ఎం. రాజేశ్వరి

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement