
ఘనంగా చెన్నుని పుష్పయాగం
మాచర్ల: మాచర్లలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. అర్చకులు కొండవీటి రాజగోపాలాచార్యులు, ఈఓ ఎం పూర్ణచంద్రరావు, జేఏ వీరారెడ్డి, గౌరవాధ్యక్షులు పోలిశెట్టి చంద్రశేఖరరావు, పందిరి సాంబశివరావు, షరాబు వెంకటరత్నం, గజవెల్లి కిషోర్, కంభంపాటి అనిల్‌కుమార్, సూరె యలమంద, తిరివీధి వెంకట నాగేశ్వరరావు, కంభంపాటి వెంకటరమణలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారి పుష్పయాగం మండపంలో జరిపారు. ఈ ఉత్సవాన్ని చూసిన భక్తులు జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ అంటూ నామస్మరణ చేశారు.
ఆరోగ్యం పౌరుడి ప్రాథమిక హక్కుగా మారాలి
డాక్టర్ పీవీ రమేష్
కృష్ణలంక (విజయవాడ తూర్పు): ఆరోగ్యం పౌరుడి ప్రాథమిక హక్కుగా మారాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ అన్నారు. విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ప్రజారోగ్య వేదిక, జన విజ్ఞాన వేదిక, ఎంబీ విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్య రంగం – మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ – ఆరోగ్య బడ్జెట్ విశ్లేషణ’ అంశాలపై ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ రమణయ్య అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో వర్చువల్‌గా రమేష్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలన్నారు. ప్రముఖ బడ్జెట్ విశ్లేషకుడు డాక్టర్ డేవిడ్ సుధాకర్ మాట్లాడుతూ ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు జీడీపీలో కనీసం ఆరు శాతం ఉండాలని, అయితే 1.9 శాతానికి మించడం లేదన్నారు. ప్రఖ్యాత వైద్యుడు, ఐఎంఏ మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సమరం తదితరులు సదస్సులో పాల్గొన్నారు.
అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి
పెదవడ్లపూడి(మంగళగిరి) : ప్రేమించుకున్న జర్మనీ అబ్బాయి ఆంధ్రా అమ్మాయి ఇరు కుటుంబాల అంగీకారంతో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలోని పెదవడ్లపూడిలో వైభవంగా హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. పెదవడ్లపూడికి చెందిన సుందర్శనం రవికుమార్, లక్ష్మీ దంపతుల కుమార్తె మౌనిక జర్మనీలో పీహెచ్‌డీ చేస్తూ ఉద్యోగం చేస్తుంది. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న జర్మనీకి చెందిన ఫాబియన్ డువెన్ బేక్‌తో పరిచయమై అది ప్రేమగా మారింది. దీంతో ఇరువురూ తమ ఇళ్ళల్లో తల్లితండ్రులకు తెలియజేసి అందరి అంగీకారంతో పెదవడ్లపూడి సాయిబాబా ఆలయంలో వైభవంగా వివాహం చేసుకున్నారు.

ఘనంగా చెన్నుని పుష్పయాగం

ఘనంగా చెన్నుని పుష్పయాగం