
ముగిసిన బ్రహ్మోత్సవాలు
తిరుమలగిరి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం వాల్మీకోద్భవ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం పవళింపు సేవ, అశ్వ వాహనోత్సవంతో ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై గ్రామంలో ఊరేగించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ ఇళ్ల ముందుకు స్వామి వారు వస్తుండటంతో వారు పోసి హారతులిచ్చి పూజలు చేశారు. అనంతరం ఆలయంలో పూర్ణాహుతి, స్వామి వారికి కలశ స్నాపనోత్సవం, చూరసంవాదం, మహానివేదన, 12 సేవలను అర్చకులు పరాంకుశం వాసుదేవవాచార్యులు, తిరునగరి రామకృష్ణమాచార్యులు ఘనంగా నిర్వహించి ఉత్సవాలు ముగిసినట్లు తెలిపారు. మహిళలకు పసుపు, కుంకుమ, జాకెట్‌తో పాటు కుంకుమ భరణాలను ఆలయ ఏసీ వరప్రసాద్ అందజేశారు. చైర్మన్ భరద్వాజ్, సిబ్బంది పాల్గొన్నారు.