మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు! | - | Sakshi
Sakshi News home page

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!

Published Fri, Apr 18 2025 12:42 AM | Last Updated on Fri, Apr 18 2025 12:42 AM

మత్తు

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!

శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లలో దందా సాగిస్తున్నారు. సిండికేట్‌గా మారి రైతులను అందినకాడికి దోచుకుంటున్నారు. వాస్తవానికి రైతు కొనుగోలు కేంద్రంలో విక్రయించిన ధాన్యం ఏ మిల్లుకు చేరుతుందో తెలియదు. మిల్లుకు చేరిన ధాన్యం ఏ రైతుదో మిల్లరుకూ తెలియదు. కానీ ఏ రైతు ధాన్యం మిల్లుకు చేరిందో మిల్లర్లకు తెలిసిపోతోంది. ఎందుకంటే మిల్లర్లు ఇచ్చే కమీషన్‌కు కక్కుర్తి పడి కొందరు అధికారులు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది ఇష్టారాజ్యంగా రైతులను దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చిన సొమ్ము వాటాలు వేసుకుంటున్నట్లు సమాచారం.

దళారీ రాజ్యం..

రైతుల అవసరాలను ఆసరాగా తీసుకొని కొందరు మిల్లర్లు దళారులను పంపి ధాన్యం తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఆ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు తరలించి ప్రభుత్వం నిర్ణయించిన బస్తా రూ. 1,740 ధర పొందుతున్నారు. మిల్లర్లకు కొందరు అధికారులు, కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది సహకరిస్తున్నారు. ఎక్కడికక్కడ పర్సంటేజ్‌లేనని రైతులు చెబుతున్నారు.

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో 19,907 మంది రైతులు 50,484.1 ఎకరాల్లో రబీలో వరి సాగు చేశారు. మొత్తం 1,66,470 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారుల అంచనా. జిల్లాలోని 107 కొనుగోలు కేంద్రాల ద్వారా 50వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను 17 మిల్లులను ట్యాగ్‌ చేసింది. ఇప్పటికీ కేవలం 14,281 టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. కనీసం 50శాతం కూడా కొనుగోలు చేయలేదు. ఈనెల 3వ తేదీ నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. రైతులు తాము పండించిన ధాన్యాన్ని అకాల వర్షాల నుంచి కాపాడుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే తేమశాతం 17, నూక తక్కువగా ఉండాలి వంటి నిబంధనలు ఉన్నాయి. కల్లాల్లో ఆరబెట్టాలంటే ప్రతి రోజూ ఏదోచోట వర్షం కురుస్తోంది. నిల్వ చేసుకొనేందుకు రైతులకు ఏ మాత్రం అవకాశం లేదు. విధిలేని పరిస్థితుల్లో తక్కువ ధరకు విక్రయించి దందాకు బలైపోతున్నారు.

న్యూస్‌రీల్‌

సిండికేట్‌గా ఏర్పడి ధాన్యం దోపిడీ

రైతు అవసరాలను ఆసరాగా తీసుకొని ధరలో కోత కమీషన్లకు కక్కుర్తిపడి సహకరిస్తున్న కొందరు అధికారులు, సిబ్బంది ఎవరికీ చెప్పుకోలేక రైతుల దీనావస్థ

కేంద్రాల వద్దే కొనుగోల్‌మాల్‌

ఓ రైస్‌ మిల్లర్‌ నుంచి విజయవాడ రూరల్‌ మండలంలోని రైతుకు ఫోన్‌ వచ్చింది. ‘మీ ధాన్యం మా మిల్లుకు చేరింది. ధాన్యంలో నూక ఎక్కువగా వస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఇవ్వడం కుదరదు. ధాన్యం దిగుమతి చేసుకోలేను.. రూ.1400కు అయితే దిగమతి చేసుకుంటా’ అని తెగేసి చెప్పాడు. మరో ముగ్గురు రైతులకు అదే మిల్లరు ఫోన్‌ చేసి అలాగే మాట్లాడాడు. తాను చెప్పిన ధర అయితే ఓకే.. లేదంటే లేదు అని బెదిరించినంత పనిచేశాడు. వాతావరణంలో మార్పులు, అకాల వర్షాలు.. ధాన్యం నిల్వ చేసుకొనే సామర్థ్యం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు మిల్లర్‌ చెప్పిన రేటుకు సరే అని అంగీకరించారు. ఒక్కో రైతు 75 కేజీల బస్తాకు రూ. 340లకు పైగా నష్టపోయారు.

కొనుగోలు కేంద్రంలో సంచులు కూడా పలుకుబడి ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు. కేంద్రాల్లో నిల్వ ఉండా ల్సిన సంచులు.. ధాన్యం లారీతోపాటే వస్తున్నాయి. లారీలు కూడా సరిగా రావడం లేదు. దళారులు వచ్చి తక్కువ రేటుకు అడుగుతున్నారు. కాదని కొనుగోలు కేంద్రానికి వెళ్తే తేమశాతం పేరుతో ఇంకా ఎండబెట్టాలంటున్నారు. మిల్లర్లపై ప్రభుత్వ నియంత్రణ లేదు.

– ఓరుగంటి రాంబాబు, పైడూరుపాడు

కొనుగోలు కేంద్రాల కేంద్రంగానే మిల్లర్ల దందా సాగుతోందని సమాచారం. రైతులు తమ ధాన్యం అమ్ముకొనేందుకు కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లగానే ఆ సమాచారం మిల్లర్‌కు చేరుతోంది. అంతే వెంటనే ఆ రైతు కల్లాల్లో దళారులు వాలిపోతున్నారు. రైతుల అవసరాలు ఆసరాగా తీసుకొని ధరలో కోత విధిస్తున్నారు. మా ధర ఇంతే అంటూ తెగేసి చెబుతున్నారు. రైతు అంగీకరించకపోతే అతని సమాచారం కొనుగోలు కేంద్రాలకు వెళుతోంది. అక్కడ అతనికి గోనె సంచులు ఇవ్వడం లేదు. ఒక వేళ సంచులు ఇస్తే హమాలీలు కాటా వేసేందుకు వెళ్లడం లేదు. వాతావరణం చూస్తే గంటల వ్యవధిలో మారిపోతోంది. దళారులు కొనుగోలు చేసిన ధాన్యం ముందుగానే కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు చేరుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయించి వాటాలు వేసుకుంటున్నారు. మిల్లర్ల తరఫున రైతుల పేరుతో విక్రయించి వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. మరి కొందరు రైతుల వద్ద ముందే విత్‌ డ్రా ఫారాలు తీసుకొని తమ వద్ద ఉంచుకుంటున్నారు. డబ్బు డ్రా చేసి రైతుకు ముందే చెప్పిన ధర మేరకు ఎంత డబ్బు ఇవ్వాలో అంత ఇచ్చేసి, మిగిలిన సొమ్ము మింగేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లర్ల వద్ద ఉండాల్సిన యాప్‌ కొందరు దళారుల ఫోన్‌లలోనూ ఉండడం విశేషం. అధికారులు, మంత్రులు పర్యటించిన ఒకటి రెండు రోజులు అంతా హడావుడి చేస్తున్నారు. తర్వాత షరామామూలే. మిల్లర్లపై రాయనపాడు, పైడూరుపాడు రైతులు కొందరు ఏకంగా మంత్రికే విన్నవించారు అయినా పరిస్థితిలో మార్పులేదని చెబుతున్నారు.

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు! 1
1/6

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు! 2
2/6

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు! 3
3/6

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు! 4
4/6

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు! 5
5/6

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు! 6
6/6

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement