
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కృష్ణాజిల్లా కేసరపల్లికి చెందిన భక్తులు సోమవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. కేసరపల్లికి చెందిన బి.నీలిమ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,04,893ల విరాళాన్ని అందించారు.
నిత్యాన్నదానం, బంగారు తాపడం పనులకు..
విజయవాడకు చెందిన భక్తులు నిత్యాన్నదానానికి, బంగారు తాపడం పనులకు వేర్వేరుగా విరాళాలను అందజేశారు. విజయవాడ మాచవరానికి చెందిన అట్లూరి రామ్మోహన్‌రావు, సువర్ణ దంపతులు నిత్యాన్నదానానికి రూ.లక్ష, బంగారు తాపడం పనులకు రూ.లక్ష విరాళాన్ని అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.