చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ముగ్గురికి గాయాలు | RTC bus to hit tree, three passengers injured | Sakshi

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ముగ్గురికి గాయాలు

Published Tue, Aug 11 2015 3:12 PM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొనడంతో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

కంకిపాడు(కృష్ణా జిల్లా): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొనడంతో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ప్రొద్దుటూరు క్రాస్ రోడ్డు సమీపంలో జరిగింది. వివరాలు.. విజయవాడ నుంచి గుడివాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం వెంటనే 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఎదురుగా వస్తున వాహనాన్ని తప్పించే క్రమంలోనే బస్సు అదుపుతప్పి వెళ్లి చెట్టును ఢీకొట్టిందని డ్రైవర్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement