సాక్షి హైదరాబాద్: మెట్రో స్టేషన్లలో ఇక నుంచి జనరిక్ ఔషధాలు, ఇతర ఫార్మా ఉత్పత్తులు లభించనున్నాయి. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ , దవా దోస్త్ సంస్థతో భాగస్వామ్యం చేసుకోవడంతో మెట్రో ప్రయాణికులకు ఈ అవకాశం దక్కింది. దవా దోస్త్ సంస్థ ఏర్పాటు చేసిన తొలి హై ఫ్రీక్వెన్సీ స్టోర్‌ను ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మెట్రో రైల్ ఉన్నతాధికారులు, ఇతర అతిథులు పాల్గొన్నారు. త్వరలోనే దవా దోస్త్ కేంద్రాలు అమీర్‌పేట, కెపీహెచ్‌బీ, హైటెక్ సిటీ, ఎంజీబీఎస్ తదితర స్టేషన్‌లలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులతో పాటుగా సందర్శకులకు ఇది సంతోషకరమైన సమాచారం. ప్రయాణికులు అత్యంత సౌకర్యవంతంగా జనరిక్ మందులు, ఇతర ఔషధ ఉత్పత్తులను ఆకర్షణీయమైన రీతిలో 15 నుంచి 80 శాతం రాయితీలలో పొందవచ్చన్నారు.
ఎల్ అండ్ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ అండ్ సీఈవో కెవీబీ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో రైల్ వద్ద దవా దోస్త్‌ను స్వాగతిస్తున్నామన్నారు. ఖైరతాబాద్ వద్ద వచ్చిన ఈ స్టోర్‌తో రాయితీ ధరలలో ప్రయాణికులు ఔషధాలు పొందవచ్చన్నారు. దవాదోస్త్ సంస్థ సీఈవో అమిత్‌చౌదరి మాట్లాడుతూ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద దవా దోస్త్ ప్రారంభించడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment