విజయవాడ రైల్వేస్టేషన్
సాక్షి, రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలకు గానూ ఇండియన్ గ్రీన్ కౌన్సిల్ సంస్థ రైల్వేస్టేషన్‌కు గోల్డెన్ రేటింగ్ ఆదివారం ప్రకటించింది. 100కి 71 పాయింట్లను స్టేషన్ దక్కించుకుంది. గతేడాది నవంబరు 14న విజయవాడ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన ప్రతినిధులు స్టేషన్‌లోని వసతులను పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ స్టేషన్‌కు గోల్డెన్ రేటింగ్ ఇచ్చింది.
ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు..
స్టేషన్‌లో ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రయాణికులకు సెంట్రల్ ఏసీతో కూడిన విశ్రాంతి మందిరాలు, అత్యాధునిక ఫుడ్‌కోర్టు, ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాళ్లు, అత్యాధునిక ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు చికెన్ వంటకాలు అందించేందుకు ప్రపంచ ప్రసిద్ధగాంచిన కేఎఫ్‌సీ రెస్టారెంట్ స్టేషన్‌లోని 1వ నంబరు ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేశారు.
ప్రయాణికులకు సత్వర టికెట్లు అందించేందుకు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్( ఏ.టి.వి.ఎం)లు 16 ఇప్పటికే స్టేషన్‌లోని తూర్పు ముఖద్వారం1, 2, తారాపేట టెర్మినల్‌లలో అందుబాటులో ఉన్నాయి. దివ్వాంగులు, వమోవృద్ధులను రైలు ఎక్కించేందుకు అత్యాధునిక వీల్‌చైర్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ఐదు దశల్లో శుద్ధి చేసిన జలాన్ని అతి తక్కువ ధరకు అందించే ఆర్వో ప్లాంట్లను ఉన్నాయి. త్వరలో ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలు కల్పించి ప్లాటినం ర్యాంకు సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని స్టేషన్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment