అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాష్ మనీ చెల్లింపుల కేసు విషయమై మాన్‌హాటన్ కోర్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసందే. ఇప్పడూ తాజాగా ట్రంప్‌కి సంబంధించి.. 1970లలో తనను వేధింపులకు గురిచేశాడని ఓ రచయిత కోర్టుని ఆశ్రయించింది. ఈ కేసు దాఖలు చేసింది రచయిత జీన్ కారోల్. ఈ మేరకు కారోల్ కేసు విషయమై జెస్సికా లీడ్స్ అనే మహిళ ట్రంప్ లైంగిక ప్రవర్తన గూర్చి కీలక సాక్ష్యం ఇచ్చింది. తాను విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నప్పుడూ.. ట్రంప్ తనపై ఎలా లైంగిక వేధింపులకు పాల్పడ్డారో కోర్టులో వివరించింది.
తనను ట్రంప్ ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని, తాకేందుకు యత్నించాడని కోర్టుకి తెలిపింది. అయితే లీడ్స్‌కు ప్రస్తుతం 81 ఏళ్లు. ఆమె 2016 ఎన్నికలకు వారాల ముందు న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారిగా ట్రంప్‌పై ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ట్రంప్ లైంగిక దుష్ప్రవర్తన గూర్చి ఆరోపణలు చేస్తూ డజనకు పైగా మహిళలు బయటకు రావడం జరిగింది. ఈ తాజా పిటిషన్ కూడా 1990 మధ్య కాలంలో ట్రంప్ లైంగిక వేధింపులు గూర్చి రచయిత 79 ఏళ్ల కారోల్ ఇటీవలే (గతేడాది) కేసు దాఖలు చేశారు. అప్పుడూ ట్రంప్ మాన్‌హట్టన్‌లోని లగ్జరీ బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మ్యాన్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో దుస్తులు మార్చుకునే గదిలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ పిటీషన్ దాఖలు చేశారు.
న్యూయార్క్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి..ఒక కొత్త చట్టం రావడంతో..కారోలో గతేడాది ఈ కేసును దాఖలు చేసింది. ఆ పిటిషన్‌లో కారోల్ 2019లో తొలిసారిగా ట్రంప్‌పై ఆరోపణలు చేస్తూ బయటకు వచ్చానని, ఆ సమయంలో ట్రంప్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి తన పరువు తీశారని వాపోయింది. అందువల్ల ట్రంప్ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించకు కోవాలని పిటీషన్‌లో కోరింది. ఒకవేళ ఈ కేసులో ఓడిపోతే గనుకు తొలిసారిగా తనపై వచ్చిన ఆరోపణలను ట్రంప్ చట్టపరంగా బాధ్యతవహించినట్లవుతుంది.
మళ్లీ అమెరికా అధ్యక్ష బరిలోకి దిగి, వైట్‌హౌస్‌కి తిరిగి రావలనుకుంటున్న 76 ఏళ్ల ట్రంప్ ఎదుర్కొంటున్న అనేక చట్టపరమైన సవాళ్లలో ఇదొకటి. అంతకమునుపు 2020 ఎన్నికల ఓటమిని తిప్పికొట్టే ప్రయంత్నంలో రహస్య పత్రాలను మిస్ చేయడం దగ్గర నుంచి 2021న తన మద్దతుదారులతో క్యాపిటల్‌పై దాడుల వరకు పలు విచారణలు ఎదుర్కొన్నాడు ట్రంప్.
Comments
Please login to add a commentAdd a comment